NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam February 2 2024 Episode 149: అమర్ కి నిజం చెప్పాలనుకుంటున్న పిల్లలు…

Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights

Nindu Noorella Saavasam February 2 2024 Episode 149: మంగళ పిల్లలను బయటికి గెంటేస్తుంది.నువ్వు ఇక్కడే ఉండగా వాళ్ళు లోపలికి ఎలా వెళ్లారు అని అడుగుతుంది మంగళ.పెళ్లి కుదిరిందని ఫ్రెండ్ కి చెపుదామని ఫోన్ చేశాను అక్క అని అంటాడు ఖాళీ.అన్ని అనుకున్నట్టు జరిగితేనే పెళ్లవుతుంది లేదంటే మనిద్దరిని ముసలోడు బయటికి గెంటేస్తాడు అని అంటుంది మంగళ.భాగమతి పిల్లల గురించి ఆలోచించుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వెళుతుంది ఇంతలో రామ్మూర్తి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఊపిరి ఆడక కొట్టుకుంటాడు. భాగమతి డాక్టర్ ని పిలుస్తుంది. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేస్తాడు. దాంతో రామ్మూర్తి పరిస్థితి కొంచెం కుదుటపడుతుంది. భాగమతి డాక్టర్ ని రామ్మూర్తికి పరవాలేదు కదా అని అడుగుతుంది కానీ డాక్టర్ ఏం చెప్పకుండా బయటికి వెళ్తాడు. డాక్టర్ బయటికి వెళ్లి మంగళతో రామ్మూర్తి పరిస్థితి ఏం బాగోలేదు తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము అని అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights

డాక్టర్ వెళ్లిపోగానే మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అక్క అని అంటాడు ఖాళీ. ఇంతలో భాగమతి బయటికి వస్తుంది. పిన్ని డాక్టర్ గారు ఏం చెప్పారు భయపడాల్సిందేమీ లేదు కదా అని అంటుంది భాగమతి. ఇప్పుడు బాగానే ఉందంట కాకపోతే ఆయన మనసులో ఏదో బాధ ఉంటే దాన్ని తీర్చేస్తే ఇంకా తొందరగా నయమవుతుందని చెప్పారు అని అంటుంది మంగళ. ఆయన మనసులో ఉంది నీ పెళ్లి కాబట్టి అది తొందరగా చేసేస్తే ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం ఉండదు అని అంటుంది మంగళ. నాన్నకు ఏమి కాకూడదు అని బాధపడుతుంది భాగమతి. మీ నాన్నకి ఏం కాదమ్మ పెళ్లి ఏర్పాట్లు నేను ఖాళీ చూసుకుంటాను నువ్వు వెళ్లి మీ నాన్న దగ్గర ఉండు అని అంటుంది మంగళ. మనం వెళ్లి పెళ్లి సామాన్లు తెచ్చుకుందాం పద అని మంగళ ఖాళీ వెళ్లిపోతారు.

Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights

అది వింటున్న అరుంధతి వాళ్ళ మీద కోపం వచ్చి మిమ్మల్ని పీక పిసికి చంపేస్తాను అని అనుకుంటుంది. మిస్సమ్మ వాళ్ళు చెప్పేది అబద్ధం నువ్వు నమ్మి బాధపడకు నీకు నిజం ఎలా చెప్పాలి అని అనుకుంటుంది భాగమతి. భాగమతి లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ అమర్ కి ఫోన్ చేసి స్కూల్లో పిల్లలు పర్మిషన్ అడిగి బయటికి వెళ్లారు అంట సార్ వాళ్ళు లేరు అని అంటాడు. ఎక్కడికి వెళ్లారు నేను ఫోన్ చేసి చెప్తాను ఉండు రాథోడ్ అని అంటాడు అమర్. అమర్ వాళ్ళ అమ్మానాన్నలను పిలిచి పిల్లలు ఎక్కడికో వెళ్లిపోయారు అంట మీకు చెప్పి వెళ్లారా అని అడుగుతాడు.పొద్దున స్కూల్ కి వెళ్ళింది తెలుసు ఇంకా ఎక్కడికి వెళ్లారో మాకు తెలియదు అని అంటారు. పిల్లలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నారు అసలు కొంచెం కూడా క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నారు అసలు వీళ్ళకిలా అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమి వచ్చింది ఇలా ఎందుకు మారిపోయారు అని అంటాడు అమర్.

Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights

ఇంకెవరు చేస్తారు అమర్ ఆ మిస్సమ్మని చూసి నేర్చుకున్నారు తనతో ఉన్నప్పుడు తను చేసే పనులు చూస్తున్నప్పుడు వాళ్లు కూడా అలాంటి పనులు చేస్తారు కదా అమర్ అని అంటుంది మనోహరి. మనోహరి మిస్సమ్మ ఏ తప్పు చేయలేదు అయినా తనకి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమి వచ్చింది మన పిల్లలకు ఎప్పుడు తప్పుడు అలవాటులు నేర్పించలేదు ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని అంటాడు శివరాం. అమర్ కోపంతో బయటికి వెళ్లిపోతాడు. అన్ని అమర్ చూసుకుంటున్నాడు అసలు అమర్ కి ఎన్ని కష్టాలు అని అని వెళ్ళిపోతుంది మనోహరి. అమర్ కి కోపం వస్తుందని తెలిసి కూడా ఈ అమ్మాయి ఎందుకిలా మాట్లాడుతుంది అని అంటాడు శివరాం. మనోహరి గురించి మనకు తెలిసిందే కదా అని అంటుంది శివరాం భార్య. తాతయ్యను కలవడానికి స్కూల్లో అబద్ధం చెప్పి బయటికి వచ్చాం ఇప్పుడు ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయొద్దు మనం వెళ్లి డాడీకి నిజం చెప్పేద్దాం అని అంటుంది అమృత. డాడీ గురించి నీకు తెలుసు కదా అమ్ము అని అంటుంది అంజలి. తప్పు చేసింది నేనే కాబట్టి నేనొక్కదాన్నే తప్పు చేశాను అని చెప్తాను అని అంటుంది అమృత.

Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights

మనం నలుగురం వెళ్ళాము కాబట్టి నలుగురం ఒప్పుకొని సారీ చెబుదాము అని అంటుంది అంజు. డాడీ తాతయ్యని చూడడానికి వెళ్లారంటే ఒక అర్థం ఉంది కానీ మిస్సమ్మ ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళింది అని అంజు అడుగుతుంది. తాతయ్య మన ఇంటి మనిషి కదా మిస్సమ్మని చూసుకోమని ఉంచాడేమో అని అంటుంది అమృత. ఇంటికి వెళ్ళాక డాడీ మనల్ని ఏమంటాడో ముందు అది ఆలోచించు తర్వాత మిస్సమ్మ గురించి ఆలోచించుదాం అని అమృత అంటుంది. ఇంతలో భాగమతి స్నేహితురాలు వర్ష హాస్పిటల్ కి వస్తుంది. భాగమతిని కలవడానికి వీళ్ళేదు లోపలికి వెళ్లడానికి వీల్లేదు వెళ్లిపో అని అంటుంది మంగళ. నేను భాగమతితో మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటుంది వర్ష. ఇప్పుడు భాగమతికి పెళ్లి కాబోతుంది తనని కలవాలంటే నా అనుమతి కావాలి అని అంటాడు ఖాళీ. వాళ్ల మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది వర్ష. వర్షని చూసిన భాగమతి తనని పట్టుకొని ఏడుస్తుంది. బాధపడకు భాగమతి మీ నాన్నకు ఏం కాదు ఆయన బాగానే ఉంటారు నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది వర్ష.

Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 2 2024 Episode 149 Highlights

నాన్నకి ఏమైనా అవుతుందేమో అని భయమేస్తుంది అని అంటుంది భాగమతి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఆయనకేం కాదు అని అంటుంది వర్ష. అయినా మీ పిన్నికి మీ మామయ్యకి పిచ్చా నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ఏంటి? అయినా ఆ చెత్త వెదవతో నీకు పెళ్లి ఏంటి అని అంటుంది వర్ష. అవును వర్ష వాళ్ళు చెప్పింది నిజమే నాన్న కోరిక కూడా అదే అని నాన్న పిన్నికి చెప్పారంట అని అంటుంది భాగమతి. నేనెప్పుడూ ఇంటికి వెళ్లినా నాతో ఏదో చెప్పాలని అనుకునేవాడు నాన్న కానీ ఎప్పుడు చెప్పలేదు నేను కూడా ఆయనతోనే ఎప్పుడు మాట్లాడలేదు అని అంటుంది భాగమతి. మీ నాన్న నీతో డైరెక్ట్ గా చెప్పాడా అని అడుగుతుంది వర్ష. నాతో చెప్పలేదు పిన్ని తో చెప్పాడు అని పిన్ని నాకు చెప్పింది అని అంటుంది భాగమతి. మీ నాన్న నీ
సంతోషాన్ని కోరుకుంటే మీ మామయ్యకి ఇచ్చి నిన్ను పెళ్లి చేయడు అని అంటుంది వర్ష. నాన్న బ్రతుకుతాడు అంటే నేను పెళ్లి చేసుకోడానికైనా సిద్ధంగా ఉన్నానుఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది భాగమతి.

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella