Niharika: మెగా ప్రిన్స్ నిహారిక మనందరికీ సుపరిచితమే. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అనంతరం హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఇక ఇండస్ట్రీలో కొనసాగినప్పటికీ పెద్దగా పాపులారిటీ దక్కకపోవడంతో జొన్నలగడ్డ చైతన్య ని వివాహం చేసుకుంది. ఇక ఈ బంధాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది నిహారిక.
సంవత్సరం తిరగకముందే విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇక ఇటీవలే నిహారిక నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో అభివృద్ధి చెందకపోయినా యావరేజ్ గా కొనసాగుతుంది. ఇక తాజాగా నిహారిక మరోసారి సినిమాల్లోకి హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ఇందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైతన్య జొన్నలగడ్డ తో తన వివాహ బంధానికి గుడ్ బాయ్ చెప్పి సినిమాల్లోకి మరోసారి రియంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది నిహారిక. గత కొంతకాలం నటనకి బ్రేక్ ఇచ్చిన అనంతరం డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఇది అనుకున్నంత పాపులారిటీ దక్కించుకోకపోవడంతో నిర్మాణ సంస్థలోకి దిగింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పోస్టర్ చూస్తే తమిళ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ్ హీరో షేన్ నిగమ్‌కు జంటగా కనిపించనుంది. మద్రాస్కారన్ అనే టైటిల్ తో ఈ సినిమా ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ఇక ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!