NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 2 2024 Episode 143: పెన్ డ్రైవ్ దొంగలించిన నిషిక…

Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights

Jagadhatri February 2 2024 Episode 143: కేదార్ బాక్స్ ఓపెన్ చేస్తుంటే జగదాత్రి ఒక నిమిషం ఆగు అని అంటుంది. ఇంతలో మధు అక్కడికి వస్తుంది.మధుని చూసి యువరాజ్ తను ఇక్కడికి వచ్చింది తనను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి అని మధుని వాళ్ళ అమ్మ పిలుస్తుందని చెప్తాడు. మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది.మనల్ని ఎవరో ప్రాంక్ చేస్తున్నట్టున్నారు కేదార్. ఈ పార్టీ అయిపోయిన తర్వాత చూద్దాము ఈ బాక్స్ అక్కడ పెట్టు అని జగదాత్రి అంటుంది. కేదార్ జగదాత్రి హాల్లోకి వెళ్తారు.

Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights
Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights

మనమందరం ఒక గేమ్ ఆడదాం ఎవరూ బాగా డాన్స్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు అని నిషిక అంటుంది. ఈ బెలూన్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జగదాత్రి అని అడుగుతాడు బూచి. నిన్ను చూసి నవ్వాలో జాలిపడలో అసలు అర్థం కావడం లేదు అని తన మనసులో అనుకుంటుంది జగదాత్రి. ఇక్కడ అందరూ ఉన్నారు కదా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు బెలూన్స్ వేస్తే అప్పుడు నువ్వు గెలుస్తావు అని అంటుంది జగదాత్రి. బూచి యువరాజ్ దగ్గరికి వెళ్లి అసలు నువ్వు చేసేదేం బాగోలేదు నేను అంత చూశాను నువ్వు ఎంత ట్రై చేసినా ఆ లక్ష గెలిచేది నేనే అంటాడు. ఏమైంది బావ అని అడుగుతాడు యువరాజ్. ఏమీ తెలియనట్టు మాట్లాడకు అని వెళ్ళిపోతాడు బూచి.

Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights
Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights

మనం ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం అని నిషిక అనగానే బూచి ఈ ఇంటికి అల్లుడు నేనే ముందు నేనే డాన్స్ చేయాలి అని తను డాన్స్ వేస్తాడు. తరువాత దివ్యాంక సురేష్ కలిసి డాన్స్ వేస్తారు అది చూసి కౌశికి బాధపడుతుంది. వదిన బాధపడుతుంది నేనేం చేయలేకపోతున్నాను అని జగదాత్రి అనుకుంటుంది. జగదాత్రి పైనున్న కేదార్ కి ఫోన్ చేసి వదిన చాలా బాధపడుతుంది కేదార్ త్వరగా ఆ బెలూన్స్ కింద పడేసే అని అంటుంది. కేదార్ బెలూన్స్ పడేసే సమయానికి వైజయంతి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. సామాన్లు తీసుకు రమ్మంటే వచ్చాను అని కేదార్ అంటాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నావ్ త్వరగా తీసుకెళ్ళు అని వైజయంతి అంటుంది. కేదార్ కిందికి వెళ్ళిపోతాడు. జగదాత్రి కేదర్ కలిసి ఏదో చేస్తున్నారు అందుకే ఇంత కంగారు పడుతున్నారు అని అనుకుంటుంది వైజయంతి.దివ్యాంక సురేష్ డాన్స్ చేయడం అయిపోతుంది. మమ్మల్ని క్షమించండి వదిన ఏం చేయలేకపోయాం అని అనుకుంటుంది జగదాత్రి.

Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights
Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights

వైజయంతి కిందికి వచ్చి నేను మొదలుపెట్టిన పనిని నువ్వు పూర్తి చేస్తున్నావ్ నిషిక అని అంటుంది. మీరేం చేశారు అత్తయ్య అని అడుగుతుంది నిషిక.సురేష్ ని కౌశికిని విడగొట్టింది నేనే అని నిషికకి చెప్పకపోవడం మంచిది అని అనుకుంటుంది వైజయంతి. నిషిక మనం వెళ్లి ఆ పెన్ డ్రైవ్ తేవడానికి ఇదే మంచి సమయం అందరూ డాన్స్ చేస్తున్నారు వెళ్దాం పద అని వైజయంతి అంటుంది. వెళ్దాం అత్తయ్య కానీ ఈ జగదాత్రి కేదార్ ఉండగా మనం వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళని డాన్స్ చేయమని చెప్పి మనం ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్దాం అని అంటుంది కౌశికి. కౌశికి జగదాత్రికి కేదార్ ని డాన్స్ చేయమని చెప్తుంది. మేము డాన్స్ చేయాలా నాకు డాన్స్ రాదు అని అంటుంది జగదాత్రి. నీకు డాన్స్ వచ్చు , నాకు తెలుసు నానమ్మ ఎప్పుడు నీ గురించి చెప్తూ ఉంటుంది అని అంటుంది నిషిక. నాకు క్లాసికల్ డాన్స్ వచ్చు ఈ డాన్స్ నాకు రాదు అని అంటుంది జగదాత్రి. ఏం కాదు వెయ్యండి అని అంటాడు బూచి. జగదాత్రి కేదార్ డాన్స్ వేస్తారు. కేదార్ నిషిక అత్తయ్య ఎక్కడికో వెళ్తున్నారు చూడు అని చెప్తుంది జగదాత్రి. నాకు తెలిసి నిషిక వాళ్ళు పెన్ డ్రైవ్ కోసం వెళ్లారు అని అంటుంది జగదాత్రి. మనం ఏదో ఒకటి చేసి పెన్ డ్రైవ్ ని దొంగతనం చేయకుండా ఆపాలి కేదార్ అని అంటుంది జగదాత్రి.

Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights
Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights

జగదాత్రి వాళ్ళు డాన్స్ ఆపేసి వెళుతుంటే బూచి ఎందుకు డాన్స్ ఆపేశారు అని అడుగుతాడు. బాగానే చేస్తున్నారు కదా వేయండి అని అంటాడు సురేష్. అన్నయ్య మీకు ఎలా చెప్పాలి అని అనుకుంటుంది జగదాత్రి. ఈ విషయం వదినకి ఎలాగైనా చెప్పాలి అని జగదాత్రి అనుకుంటుంది. జగదాత్రి కౌశికి సైగ చేసి గదిలోకి వెళ్లి పెన్ డ్రైవ్ చూడండి వదిన అని చెప్తుంది. కౌశికి గదిలో నిషిక వాళ్లకి పెన్ డ్రైవ్ దొరుకుతుంది. వాళ్లు బయటికి వెళ్దాం అనేసరికి కౌశికి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. గది మొత్తం చూసి పెన్ డ్రైవ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. నిషిక వాళ్ళు పెన్ డ్రైవ్ మార్చి పెట్టింది కనపడుతుంది అది చూసి నిజమైన పెన్ డ్రైవ్ అనుకుంటుంది కౌశికి. ఎవరు రాలేదు అని బయటికి వెళ్లిపోతుంది కౌశికి. వదిన ఏమైంది? పెన్ డ్రైవ్ ఉందా అని అడుగుతుంది జగదాత్రి. ఉంది జగదాత్రి నువ్వేం కంగారు పడకు అని అంటుంది కౌశికి. వదిన హాల్లో కి వచ్చి కూర్చోండి ఇప్పుడు హాల్లో హోలీ జరగబోతుంది అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights
Jagadhatri Today Episode February 2 2024 Episode 143 Highlights

నిషిక వాళ్ళు వేరే తలుపు నుండి బయటకి వస్తారు. అందరూ యువరాజ్ నిషిక డాన్స్ చేయాలని అంటారు.మా బదులు మరోసారి దివ్యాంక సురేష్ చేస్తారు అని అంటుంది నిషిక. సరే మళ్లీ మేమే చేస్తాం అని దివ్యాంక సురేష్ డాన్స్ చేస్తారు. పైనుండి బూచి కలర్ బెలూన్స్ దివ్యాంక మీద వేస్తాడు. అది చూసి కౌశికి నవ్వుతుంది. నిషిక అతను ఎవరు నా మీద ఎందుకు బెలూన్స్ వేస్తున్నాడు అని అడుగుతుంది దివ్యాంక. అతను కొంచెం అలాగే ప్రవర్తిస్తాడు ఏం పట్టించుకోకు దివ్యాంక అని అంటుంది నిషిక. నిషిక దివ్యాంక దగ్గరికి వెళ్లి పెన్ డ్రైవ్ చేతిలో పెడుతుంది.దివ్యాంక పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళిపోతుంది. దివ్యాంక ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు జరిగిన అవమానం సరిపోతుంది కదా అని అంటుంది కౌశికి. నవ్వుకోండి మీ నవ్వులు కొంచెం సేపటి వరకే నేనేంటో చూపిస్తాను అని అనుకుంటుంది దివ్యాంక.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella