NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Special Status: అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి .. ఏపీ సమస్యలపై స్పందించిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ

AP Special Status: దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి, పలు రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవేళ డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ శివ మాట్లాడుతూ .. తమ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్నారనీ, సీఎం స్టాలిన్ రాగానే చర్చించి మద్దతు ఇస్తామని తెలిపారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలన్నారు. కొన్ని రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపించడం సరికాదని పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

YS Sharmila

అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర విభజన హామీల కోసం ఈ రోజు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ లను కలిసినట్లు చెప్పారు. పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారన్నారు. కానీ ఇప్పటికీ ప్రత్యేక హోదాని ఇవ్వలేదు, హామీల అమలు చేయలేదని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, రాజధాని నిర్మాణానికి సహకారం సహా కడప స్టీల్ ప్లాంట్ సహా ఏ హామీ అమలుకు నోచుకోలేదని షర్మిల విమర్శించారు. దుగరాజపట్నం పోర్ట్ ను నిర్లక్ష్యం చేశారని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదని చెపారు. హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బుందేల్ ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు.

వైజాగ్ – చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. హామీలు అమలు చేయనప్పుడు బిజెపికి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా కీలకమైన పది హామీల్లో ఒకటి అమలు కాలేదని అన్నారు. తమ పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. అన్ని పార్టీల నేతలు కలవడంతో పాటు అందరికీ లేఖలు రాస్తామని షర్మిల తెలిపారు.

YS Sharmila: శరద్ పవార్ తో వైఎస్ షర్మిల భేటీ .. ఆ కీలక అంశంపై వినతి పత్రం అందజేత

Related posts

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N