Nithya Menen: నిత్య మీనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్య మీనన్.. బాలనటిగా పలు చిత్రాలు చేసింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపుదిద్దుకున్న `అలా మొదలైంది`తో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ సూపర్ హిట్ నిలవడమే కాదు.. నిత్యా మీనన్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ మెరుపులు మెరిపించిందీ బ్యూటీ. మధ్యలో కెరీర్ కాస్త బల్ అయినా.. మళ్లీ `భీమ్లానాయక్`తో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇక త్వరలోనే `మోడ్రన్ లవ్ హైదరాబాద్` అనే వెబ్ సిరీస్‌తో పలకరించబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తం ఆరు ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నారు. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికా బహుధనం దర్శకత్వం వహించగా.. నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, రేవతి, అభిజిత్, మాళవిక నాయర్, సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య తదితరులు కీలక పాత్రలను పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో జూలై 8న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ హైదరాబాద్ లో తాజాగా ఈ వెబ్ సిరీస్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌కు నిత్యా మీనన్ నడవలేని స్థితిలో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సహాయంతో నడుచుకుంటూ నిత్యా మీనన్ స్టేజ్ పైకి రావడంతో.. అభిమానులు తెగ కంగారు పడిపోయారు. దీంతో నిత్యా ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చింది. `ఈ వెబ్ సిరీస్‌లో నేను ఎల్బో క్రచ్‌తో నటించాను. అయితే నాకు నిజ జీవితంలోనూ అదే జరిగింది. రెండు రోజుల క్రితం మెట్లపై నుంచి జారి పడిపోయాను. ఇప్పుడు ఎల్బో క్రచ్‌తో ఇబ్బంది పడుతున్నా.` అంటూ ఆమె చెప్పుకొచ్చింది.