Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, అరవింద పద్మావతి విక్కి మాట్లాడుకోవడం గమనిస్తుంది. విక్కీ పద్మావతి తో మనది ఒప్పందం ప్రకారం చేసుకున్న పెళ్లి అని చెప్పడంతో ఇక అరవిందకు ఒకసారిగా మాటరాదు. ఇక అంతే విక్కీ దగ్గరికి వెళ్లి గొడవ పడడం మొదలు పెడుతుంది. వికీ పద్మావతి ఇద్దరిని నిలదీస్తుంది. అరవింద వారి మాటలు విన్న విషయం విక్కీ పద్మావతి తెలుసుకొని చాలా బాధపడతారు. అసలు అక్కకి ఇప్పుడు ఏం చెప్పి ఇక్కడి నుండి పంపించేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విక్కి. తన భర్త మంచివాడు కాదన్న విషయం తెలిస్తే అరవింద ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి.

ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి విక్కి లను గొడవ పడి మరి, కిందకి తీసుకువస్తుంది అరవింద. ఇక అరవింద మళ్లీ పెళ్లి చెయ్యాలి అని అనుకుంటుంది పద్మావతి విక్కి లకు, అలా పెళ్లి చేస్తే ఇప్పటిదాకా ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయి ఇకమీదటైనా వీళ్ళ బంధం బలపడుతుంది అని అనుకుంటుంది. కానీ విక్కీ మాత్రం అందుకు ఒప్పుకోడు పద్మావతి తో పెళ్లి జరగడానికి అందరి ముందు మళ్లీ ఇంకోసారి తాళి కట్టడానికి విక్కీ సిద్ధంగా ఉండడు. ఇప్పుడు కాదు అక్క తర్వాత చూద్దాం అని అంటాడు దానికి పద్మావతి చాలా బాధపడుతుంది ఇక నాకు వికీ ప్రేమ దొరకదేమో అని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది కానీ అరవింద్ మాత్రం విక్కీ అనే మాటలు పట్టించుకోదు. ఇప్పుడు దాకా పైన జరిగింది విషయాలన్నీ అరవింద కు ఒకసారి గుర్తుకు వస్తాయి.
Krishna Mukunda Murari: మురారి కోరికను ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా?ముకుంద ప్లాన్ రివర్స్..

విక్కీ తో ప్రామిస్ చేయించుకున్న అరవింద..
ఇక పద్మావతి చెప్పింది అంతా విని అరవిందా ఒక నిర్ణయానికి వస్తుంది. పద్మావతి విక్కీ తో మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒప్పందం ప్రకారమే జరిగిందో ఎవరి బలవంతంగా జరిగిందో అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. పెళ్లి జరిగింది కాబట్టి అది అగ్నిసాక్షిగా నువ్వు తాళి కట్టావు కాబట్టి, మనం ఆ తాళికి విలువ ఇవ్వాల్సిందే, లేదంటే ఆ వివాహ బంధానికి అర్థం ఉండదు. ఏం చెప్తుందో ఇద్దరికీ అర్థం కానట్టు చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు మీరిద్దరూ ఏం చేసినా అది మన రెండు కుటుంబాల క్షేమం కోసం చేశారని నాకు అర్థమైంది. ఇక మీదట కూడా మన రెండు కుటుంబాల సంతోషం మీ ఇద్దరి మీదే ఆధారపడి ఉంది అని అంటుంది అరవింద. కాబట్టి జరిగిందాని గురించి కాకుండా ఇక ముందు జరగబోయే దాని గురించి కూడా ఆలోచించండి అని అంటుంది అరవింద. మీ భార్యాభర్తల బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అంటుంది దానికి విక్కీ షాక్ అవుతాడు పద్మావతి సంతోషిస్తుంది. అక్క అది అని విక్కీ ఏదో చెప్పబోతుంటే నువ్వే మాట్లాడకు విక్కీ అని అంటుంది అరవింద. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట నువ్వు పద్మావతి కలిసిమెలిసి ఉండాలి అని అంటుంది అరవింద. ఒకరంటే ఒకరు ప్రాణంగా బతకాలి ఇష్టం లేనట్టు ఇలా ఇంకొకసారి నా ముందు కనిపించకూడదు. అలాగని నాకు ఇప్పుడే ఇక్కడే నువ్వు మాట ఇవ్వాలి విక్కీ అని అడుగుతుంది. విక్కీ సైలెంట్ గా ఉంటాడు అరవింద ఏంటి చూస్తూ ఉన్నావ్ మాట ఇవ్వవా అని అంటుంది. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు మాటిచ్చి తీరాలివికి అని అంటుంది అరవింద్ కానీ విక్కీ చాలా ఆలోచిస్తాడు అసలు ఈ పద్మావతి జీవితాంతం ఎలా భరించాలి అని, ఇక వాళ్ళ అక్క కోసం వాళ్ళ అక్క చేసిన త్యాగాలు అన్ని గుర్తు చేసుకుని నీకోసం మాటిస్తున్నాను అక్క పద్మావతి అంటే ఇప్పటికి నాకు ఇష్టం లేదు నీ సంతోషమే నాకు ముఖ్యం అని మనసులో అనుకొని మాట ఇస్తాడు. అరవింద చాలా సంతోషపడుతుంది పద్మావతి కూడా సంతోషపడుతుంది.

మళ్లీ పెళ్లి చేసుకోవాలి అన్న అరవింద..
ఇక విక్కీ మాట ఇచ్చిన తర్వాత అరవింద సంతోషపడుతుంది పద్మావతిని కూడా మీరు కూడా మాట ఇవ్వండి అని అంటుంది సరే అని పద్మావతి కూడా సంతోషంగా మాటిస్తుంది. విక్కీ నీకోసమే ఇదంతా చేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు. ఇక పద్మావతి మాత్రం మా ప్రేమ నిజమైనది. ఆ దేవుడే ఇలా చేయించాడు అని అనుకొని మాట ఇచ్చి సంతోషపడుతుంది ఇక అరవింద,ఇప్పుడు నువ్వు ఇంకో పని కూడా చేయాలి విక్కీ ఏ రోజైతే నీ తులాభారం ఇప్పుడు పద్మావతి పసుపుతాడు కట్టుకుందో ఇప్పుడు అందరి సమక్షంలో నువ్వు ఆ పసుపుతాడు తీసేసి, బంగారపు తాలిని కట్టాలి అని అంటుంది. అప్పుడు అందరి కుటుంబ సభ్యుల ముందు మీ పెళ్లి జరిగినట్టు ఇక ఈ ఒప్పందం పెళ్లిని పక్కన పెట్టేసి ఇదే నిజమైన పిల్లనుకొని మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి అని అరవింద్ చెప్తుంది. తాళి కట్టిన తర్వాత నువ్వు పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్లి రావాలి అని కూడా చెప్తుంది అన్నిటికి అరవింద సరే అంటాడు. ఇక పద్మావతి చాలా సంతోషించి మీరిద్దరూ మధ్యలో ఎప్పుడైనా సరే వదిలిపెట్టుకొని ఒకరికొకరు విడిపోవాలనుకున్న ఈ ఒప్పందం ప్రకారం మళ్లీ మీ మధ్య టాపిక్ వచ్చినా కానీ, ఇద్దరూ చనిపోతారు జాగ్రత్త అని అంటుంది. ఇద్దరు ఎవరు చనిపోతారు అని పద్మావతి వికీ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అరవిందవైపు, ఒకటి నేను ఇంకొకటి నా కడుపులో పెరుగుతున్న మన అమ్మ అని అంటుంది అరవింద వెంటనే విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతాడు అలాంటి మాటలు అనొద్దక్క అని అంటాడు. నేను అలా అనకుండా ఉండాలన్నా అలా జరక్కుండా ఉండాలన్న అది మీ చేతుల్లోనే ఉంది అని అంటుంది అరవింద. ఇక ఇద్దరినీ తీసుకొని కిందకి వస్తుంది తాళి కట్టించడానికి.

విక్కీని ఒప్పించిన అరవింద..
నేను చెప్పేది నీ మంచి కోసమే విక్కీ ఇప్పటిదాకా జరిగింది పక్కనపెట్టి అందరి కోసం నువ్వు పద్మావతి మెడలో మళ్లీ తాళి కట్టాల్సిందే అని కరాకండిగా చెప్తుంది అరవింద. విక్కీ ఒప్పుకోడు పద్మావతి తో నువ్వు తాళి కట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్లాలి అని చెప్తుంది దానికి కూడా విక్కీ ఒప్పుకోడు. ఇక అరవిందా ఎప్పుడు లాగానే తన బ్రహ్మాస్త్రమైనా, అక్క సెంటిమెంట్ ని బయటకు తీసుకొస్తుంది. విక్కీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు సరిగ్గా విను ఇప్పుడు కనక నువ్వు పద్మావతి మెడలో తాళి కట్టకపోతే ఇకమీదట నేను నీకు అక్కనే కాదు నువ్వు నాకు తమ్ముడు వే కాదు మన బంధం ఇక్కడితో ఆగిపోతుంది అని అంటుంది. దానికి విక్కీ చాలా బాధపడతాడు అలా మాట్లాడొద్దు అక్క అని అంటాడు అలా మాట్లాడకుండా ఎలా మాట్లాడాలి విక్కి అని అంటుంది అరవింద. మీరిద్దరూ కలిసి ఉండాలని కదా ఇప్పుడు దాకా మీకు పైన మాటలు చెప్పి తీసుకువచ్చింది ఇప్పుడు కిందకి వచ్చిన తర్వాత మళ్లీ నువ్వు ఇలా మొండికేస్తే ఎలాగో నాకోసం మన అమ్మ కోసం పద్మావతి మెడలో నువ్వు తాళి కట్టి తీరాలి అని అంటుంది. ఇక చేసేదేం లేక మన హీరో పద్మావతి మెడలో తాళి కడతాడు. ఇక ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నాను అక్క అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మూడు నెలల్లో వదిలించుకుందాం, అనుకున్నాను మూడుముళ్ల బంధం వేసి నన్ను జీవితాంతం కట్టి పడేసావ్ అక్క అనుకున్నాడు. పద్మావతి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీనివాస్ సార్ నువ్వు ఉన్నావు స్వామి మళ్లీ మా ఇద్దరినీ కలపడానికి అని అనుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ దీవిస్తారు. పద్మావతి విక్కి ల పెళ్లి జరుగుతుంది.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి ఇంటికి విక్కీ వెళతాడు. పద్మావతి నువ్వు మరీ అంత సంతోషంగా ఉండకు నేను మా అక్క కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి పద్మావతి సరే సారు వచ్చారు కదా పదండి లోపలికి వెళ్దాం అని అంటుంది ఇక చాలా సంతోషంగా బయట వేసిన ముగ్గులన్నీ తొక్కకుండా జాగ్రత్తగా గడప దగ్గరికి వెళ్తుంది. ఇక విక్కీ పద్మావతి వెనకాలే వెళ్దాము అని అనుకుంటాడు. పద్మావతి గుమ్మం దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి సారు నేను ఎలా వచ్చాను మీరు కూడా అలానే ముగ్గు తొక్కకుండా రావాలి అని అంటుంది. వాట్ ఇన్ని ముగ్గులు తప్పకుండా రావాలా అని అంటాడు ఇప్పుడు నేను వచ్చాను కదా అని అంటుంది నువ్వు వచ్చింది నేను చూడలేదు అని అంటాడు. నాకదంతా తెలియదు సారు మీరు మాత్రం ముగ్గురు తొక్కకూడదు మా అమ్మ ఎంతో కష్టపడి వేసింది అని అంటుంది. విక్కీ పద్మావతి చెప్పినట్టుగా వెళ్లడానికి చాలా ప్రయత్నిస్తాడు ఇక అంతలో అక్కడ చాలా రంగులు కనిపిస్తాయి పద్మావతి వాటిని తీసుకొని విక్కీ మీద వేస్తుంది విక్కీ కూడా పద్మావతి మీద రంగులు వేస్తాడు అదంతా చూసి భక్త, పార్వతీ ఆనందిస్తారు. విక్కీ పద్మావతి ఇద్దరూ చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఇక ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు.