Krishna Mukunda Murari:నిన్నటి ఎపిసోడ్ లో, దీపావళి పండుగ రోజు కృష్ణ మురారి ఇంటికి రావడం, ముకుందా భవాని దేవి లకు నచ్చదు అయినా కృష్ణుని రేవతి ఇంటికి ఆహ్వానిస్తుంది. పూజలో జరిగినా అవమానమే మళ్ళీ దీపావళి రోజు ఎక్కడ జరుగుతుందో అని కృష్ణ భయపడుతూ ఉంటుంది. కృష్ణ దీపావళికి ఇంటికి రావడం మురారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కృష్ణ తను కొనిచ్చిన చేరే కట్టుకొని మురారి ఇంటికి వస్తుంది. దీపావళి లో కృష్ణ చీర కాలిపోవడంతో మురారి వేణి అని పిలవకుండా కృష్ణ అని పిలుస్తాడు దాంతో మురారి కి గతం గుర్తుకొచ్చిందేమోనని భవానీ దేవి ముకుందా భయపడతారు.

ఈరోజు ఎపిసోడ్ లో మురారి కృష్ణ కోలుకోగానే, చీర కాలిన అది తీసివేసి వేరే చీర మార్చుకొని రమ్మని బయట కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కృష్ణ వచ్చిన తర్వాత నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను నిన్ను ఎందుకు వేణి అని పిలవకుండా కృష్ణ అని అంత చనువుగా పిలుస్తున్నాను నీకు నాకు మధ్య ఏదో బంధం ఉంది అది ఏంటో చెప్పు అని సూటిగా అడుగుతాడు అప్పటికే భవానీ దేవి ముకుందను కృష్ణ నుండిమురారిని దూరం చేయడానికి,మురారిని తీసుకొని రమ్మని పంపిస్తుంది. మురారి అడిగిన ప్రశ్నలకు కృష్ణ సమాధానం చెప్పలేక మీరు నన్ను చదివించారు కదా ఆ చనివే ఉందేమో అని అంటుంది కృష్ణ ఏదో చెబుతూ ఉండేసరికి ముకుంద రావడం చూస్తాడు మురారి పెద్దమ్మ పంపించింది కదా నిన్ను అని అడుగుతాడు అవును అని అంటుంది ముకుందా ఇక్కడ ఎలాగూ నా ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు కనీసం వాళ్ళనైనా కనుక్కోవాలి అని ముకుంద వెంట మురారి ఇంటికి వెళ్తాడు ఇక భవాని దేవితో ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. భవానీ దేవిని అడుగుతాడు అసలు కృష్ణని నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను ప్రతిసారి తనతో మాట్లాడాలని నాకెందుకు అనిపిస్తుంది నేనసలు వేణి అని కాకుండా కృష్ణ అని ఎందుకు పిలుస్తున్నాను అని అడుగుతాడు ఇక మురారి అలా అడుగుతూ అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోతాడు. ముకుంద మనసులో నేను ఎంత ప్లాన్ వేసి మురారిని నా వైపు తిప్పుకుందామనుకున్నా, నా ప్లాన్లు అన్ని రివర్స్ అవుతున్నాయి అని బాధపడుతుంది.

నాన్న మురారి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడగగా నేను ఎవరిని కాపాడాను అని మురారి అంటాడు. అదేంటి ఆ డాక్టర్ కృష్ణవేణి కాపాడావు కదా అని భవాని అంటుంది. ఇంతకీ ఆ డాక్టర్ కృష్ణవేణి ఎవరు.. అయినా గతంలో మీరెవరు.. నేను ఆ వేణి గారిని ఒక్కదానినే చదివించానా అని మురారి భవానిని అడుగుతాడు. లేదు నాన్న చాలామందిని చదివించావు అని భవాని అంటుంది. మరి వాళ్లంతా నాకెందుకు గుర్తుకు రావడం లేదు. ఈ కృష్ణవేణినే ఎందుకు గుర్తుకు వస్తుంది అని మురారి భవానిని సూటిగా ప్రశ్నిస్తాడు. తనతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. పదే పదే కలవాలనిపిస్తుంది అని వాళ్ళ పెద్దమని నిలదీసి అడుగుతాడు. ఎవరు సమాధానం చెప్పరు. నేను మాత్రం పిచ్చివాడిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. నాకు ఈ తలకాయ బద్దలై పోతుంది. నాకు కోపం రాదా బాధగా అనిపించదా, ఒక్కరంటే ఒక్కరు చెప్పారు. ఏమైనా ఉంటేనా కదా చెప్పడానికి, చదివించావు అని చెప్పాను అది నిజం. వాళ్ళు మనల్ని దారుణంగా మోసం చేశారు అది నిజం అని భవాని అనగానే.. అది నాకెందుకో నిజం కాదు అనిపిస్తుంది పెద్దమ్మ అని మురారి అంటాడు.

నాకు ఎవ్వరూ నిజం చెప్పారు. అసలు ఏమైందో చెప్పమని మురారి బావని నీ నిలదిస్తాడు. అప్పుడు బావని నువ్వు చనిపోయవని చెప్పి ఒక డెడ్ బాడీ నీ పోలీసులు ఇంటికి పంపించారు. మేమంతా అదే నిజమని నమ్మాము. కానీ నువ్వు ఆ కృష్ణ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నవు. ఈ విషయం వాళ్లకు తెలిసిన కూడా మాకు నిజం చెప్పలేదని భవాని మురారి కి చెబుతుంది. ఆ మాట వినగానే మురారి కళ్ళు తిరిగి పడిపోతాడు. రేవతి త్వరగా వెళ్లి ఆ కృష్ణ నీ పిలుచుకు రమ్మని చెబుతుంది. రేవతి కృష్ణ కి జరిగిందంతా చెప్పి ఇంటికి తీసుకు వస్తుంది. భవాని కృష్ణ తో మురారి ఏం అడిగినా నిజమే చెప్పమని చెబుతుంది.

కృష్ణ మురారి దగ్గరకి వెళ్తుంది. తనకి స్ప్రహ రాగానే నవ్వుతూ మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేస్తుంది. మధు వేసే పంచ్ డైలాగ్స్ కి నవ్వుతూ ఉంటారు. మురారి కృష్ణ నీ ఒక ప్రశ్న అడగాలి అనగానే.. ముకుంద మాత్రం కంగారు పడుతుంది. మీరు నన్ను ఏదైనా అడిగే చనువు మికుంది అడగమని చెప్పగా.. మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మీరు ఈ ఇంట్లో నాతో పాటు ఉండమని చెబుతాడు.ఆ మాట విన్న తర్వాత ముకుంద ఫేస్ ఫీలింగ్స్ అని మారిపోతాయి నేను ఎంతో ప్లాన్ చేసి ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్లి పోదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ కృష్ణ మధ్యలో వచ్చి నన్ను మురారిని దూరం చేస్తుంది ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి బంధాన్ని చెడగొట్టాలి. అసలు కృష్ణని అంతలా మురారి ఎందుకు అభిమానిస్తున్నాడు. నేను ఎంత చెప్పినా కానీ మురారికే అర్థం కావడం లేదు అయినా ఈ కృష్ణుని దూరం పెట్టమంటే తీసుకొచ్చి అవుట్ హౌస్ లో పెట్టారు ఇప్పుడు వీళ్ళిద్దరిని విడగొట్టడానికి నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.కృష్ణ మాత్రం మురారి ఆ మాట అడిగేసరికి ఇక నన్ను ఇంటికి తీసుకువచ్చేస్తారు కచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను. ఏదో ఒకటి చేసి మురారి సారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా ఉన్నారు ఇక భవానీ దేవతగాని ముకుంద కానీ నన్ను ఏమీ చేయలేరు నన్ను ఆపడానికి కుదరదు రేవతి అత్తయ్య ఆశలన్నీ నిజమవుతాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి వేణి గారు నేను అడుగుతుంటే మీరేం మాట్లాడట్లేదు మీరు ఇకమీదట ఇక్కడే ఉండాలి అని అంటాడు మురారి. మధు రేవతి చాలా సంతోషిస్తారు రేవతి నా కొడుకు కోడలు మళ్ళీ కలవబోతున్నారు ఇక ఈ ఇంట్లో ఉంటే వాళ్లని కలవకుండా ఆపడం ముకుంద తరం కాదు అని అనుకుంటుంది. మధు కూడా అలానే ఫీల్ అవుతాడు ఇక కృష్ణ మురారిలు కలవబోతున్నారు అని.

రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ దగ్గరికి వచ్చి నాకు మీతోనే ఉండాలని ఉంది మీతో నే మాట్లాడాలని ఉంది. అని తనతో కబురు చెప్తూ ఉంటాడు నేను మీకు టాబ్లెట్ ఇచ్చాను కదా అయినా మీకు నిద్ర రాలేదా అని అడుగుతుంది కృష్ణ రాలేదు కృష్ణ అని చెప్తూ అంతే కృష్ణ ఒడిలో తలవాల్చి నిద్రపోతాడు అందుకు కృష్ణ చాలా సంతోషిస్తుంది. ఎవరు ఎంత విడదీయాలని చూసినా మన మధ్య ఉన్న ప్రేమ బంధం తాళిబంధం మనల్ని కలుపుతుంది అని అనుకుంటుంది కృష్ణ.