BrahmaMudi November 20 Episode 258: నిన్నటి ఎపిసోడ్ లో, రాహుల్, రుద్రాణి ప్లాన్ ప్రకారం, అరుణ్ స్వప్న ని కలవడానికి వస్తాడు. స్వప్న విషయం తెలుసుకోకుండా మొదటి అరుణ్ మీద చాలా కోప్పడుతుంది. ఎవరికీ తెలియకుండా అరుణ్ ని కలుస్తుంది స్వప్న అరుణ్ తో మాట్లాడడం రాహుల్ రాజ్ చూసే విధంగా చేస్తాడు. అరుణ్ తో స్వప్న మాట్లాడడం కావ్య కూడా చూస్తుంది. అక్కకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. అరుణ్ ని చూసిన రాజ్ ఆలోచనలో పడతాడు.అప్పు ప్రేమ గురించి తెలిసిన కనుకమ్ ఎవరికీ చెప్పకుండా తనలో తానే బాధపడుతూ ఉంటుంది.

ఈరోజు 258 ఎపిసోడ్ లో కనకం బాధపడుతూ ఉంటే కృష్ణమూర్తి వచ్చి అడుగుతాడు. టైమెంతయిందో తెలుసా ఇప్పటిదాకా మేల్కొని ఉన్నావు కారణం ఏంటి అని అడుగుతాడు. కనకం కృష్ణమూర్తి అడిగే దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది కనకం నిన్నే అడుగుతుంది అని అంటాడు కృష్ణమూర్తి. చాలా బాధగా కనకం మీకు చెప్పకుండా ఉందాం అనుకున్నాను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది. ఇప్పుడు మళ్లీ సమస్య ఇంకొకటి మొదలైంది అని అంటుంది. ఎవరికి సమస్య నీకా, నాకా,మన పిల్లలకు అని అడుగుతాడు.మనకి అని అంటుంది.

అర్థం చేసుకోవాలన్న కృష్ణమూర్తి..
కనకం చాలా బాధగా నువ్వు నేను చెప్పేదాన్ని నిదానంగా విను కంగారు పడొద్దు అయ్యా అని అంటుంది. ఏమిటా సమస్య అని అడుగుతాడు కృష్ణమూర్తి. మనం అప్పుని అందరి పిల్లల్లాగా పెంచలేదు. తనకి తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటట్టు అందరినీ ఎదిరించేటట్టు ఉండేది. అసలు ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూసే వాళ్ళం అలాంటిది ఇప్పుడు ఆడపిల్లగా మారింది అని అంటుంది కనుకమ్. అందులో తప్పేముంది అని అంటాడు కృష్ణమూర్తి. అలా మారడమే మనకి సమస్యను తెచ్చి పెట్టింది అని అంటుంది కనుకమ్. ఆడపిల్ల మనసులోకి వేరే వాళ్లకు చోటిచ్చింది. అప్పు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ మాట వినగానే కృష్ణమూర్తి షాక్ అవుతాడు. నాకు ప్రేమించడం ఏంటి అని తప్పుని ఎదిరించే పిల్ల తప్పు చేసిందా అని అంటాడు. ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి అని అడుగుతాడు కృష్ణమూర్తి. చాలాసేపు కనకం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది కనుకమ్ ఎవరు అబ్బాయి చెప్పు అని అంటాడు. కళ్యాణ్ బాబు అని చెప్పింది. ఆ మాట వినగానే కృష్ణమూర్తికి నోట మాట రాదు. అవునయ్యా మన కళ్యాణ్ బాబుని నువ్వు ప్రేమించింది అని చెప్తుంది కనుకమ్. ఇంత తెలిసిన పిల్ల పోయి ఆ ఇంటి అబ్బాయిని ప్రేమించడం ఏంటి, ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంకొకరితో పెళ్లి జరుగుతుంది. ఇలాంటి అప్పుడు అప్పు మనసులో మాట బయటకు పెట్టడం ఏంటి? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు కనుకం. అసలే కొడుకు లేకుండా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వచ్చి పడింది. ఇప్పటికే ఆ ఇంట్లో వాళ్ళు ఒకరికి ఇద్దరు నీ కూతుర్లను వలవేసి మా ఇంటికి పంపించారు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు అప్పు విషయం బయటపడితే తల్లిదండ్రులుగా మనం ఎలా సమాధానం చెప్పాలి అసలు తలెత్తుకొని తిరగగలమా అని అంటాడు కృష్ణమూర్తి. నా బాధ కూడా అదేనయ్యా ఒకపక్క పిల్లకి ఏమవుతుందో ఎలా బాధపడుతుందో, దానికి ఎలా సరిగా చెప్పాలా అని,ఇంకోవైపు ఈ విషయం బయటపడితే ఆ ఇంటి వాళ్ళ నుంచి వచ్చే మాటలు తట్టుకోగలమా అని ఇస్తున్నాను అని అంటుంది. ఈ విషయం బయట పడకూడదు ఆ అబ్బాయి మన అమ్మాయిని ప్రేమించట్లేదు వేరే అమ్మాయిని ప్రేమించాడు వేరే అమ్మాయితో పెళ్లి కూడా నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఈ విషయం బయటపడకూడదు అప్పు అర్థం చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు మనం కూడా అర్థం చేసుకోవాలి. కృష్ణమూర్తి నేను మాట్లాడతాను అని అంటే ఇప్పటికే నాకు తెలిసిందని అది బయటికి మొహం చూపించలేక పోతుంది ఇప్పుడు మీకు కూడా తెలిసిందని తెలిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఉంటుంది కనుకం. ఈ విషయం బయటపడితే ఆ ఇంట్లో వాళ్ళని మాటలు కూడ నిజం అవుతాయి. మా ఇంటికి ముగ్గురు పిల్లలు నీ వలవేసి పంపించాము అని అనుకుంటారు. ఈరోజుతో ఈ రాత్రికి ఈ విషయం ఇక్కడితో సమాధి అయిపోవాలి కనుకం. ఇదంతా నువ్వే చూసుకోవాలి బయటకు రాకుండా నీదే బాధ్యత అని అంటాడు. కనకం మీద బాధ్యత వేసి కృష్ణమూర్తి కనకం కి పెద్ద పరీక్ష పెట్టాడు.

రాజ్ కి పని అప్పచెప్పిన ఇందిరా దేవి..
రాజ్ ఆఫీస్ కి బయలుదేరుతాడు. ఇందిరా దేవి రాజ్ ని ఆగమని చెప్తుంది. నాకు పని ఉంది నానమ్మ సాయంత్రం మాట్లాడుకుందాం అని అంటాడు. లేదు రాజ్ ఇప్పుడే మాట్లాడాలి అని అంటుంది. చాలా ముఖ్యమైన పని అని అంటుంది. రాజ్ ఏమిటది అని అడుగుతాడు. ఇంట్లో ఎవరికి చెప్పాలో తెలీక నీతో చెప్తున్నాను. ఇందిరా దేవి అరుణ్ ఫోటో రాజ్ కి చూపిస్తుంది. ఈ అబ్బాయి అని రాజ్ అనే లోపు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. మన ఇంటికి కొరియర్ వచ్చింది అందులో ఈ అబ్బాయి ఫోటో, స్వప్న ఈ అబ్బాయి కలిసిన ఫోటో లు ఉన్నాయి. స్వప్న తో దిగిన ఫోటోలని ఎవరికంటైనా పడతాయేమోనని నేనే చింపి వేశాను. ఈ అబ్బాయి ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఈ అబ్బాయికి స్వప్నకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలి. ఈ అబ్బాయి ఫోటోని స్వప్న దగ్గరికి తీసుకెళ్లి అడిగితే నాకు ఎవరో తెలీదు అని అబద్ధం చెప్పింది. నాకు అప్పటినుండి అనుమానం గానే ఉంది స్వప్న ఏదో దాస్తుందని. కానీ మనం ఇప్పుడే తొందరపడి బయటపడకూడదు నిజం ఏంటో తెలిసిన తర్వాతే బయటపడాలి. స్వప్నకి ఈ అబ్బాయికి ఉన్న సంబంధం గురించి ఇంట్లో ఎవరికైనా తెలిస్తే, ముఖ్యంగా మీ రుద్రా నీ అత్తకి గాని ఈ విషయం తెలిసిందంటే ఇక ఎంత గొడవలు జరుగుతాయో నీకు తెలుసు. అసలే మీ తాత గారికి బాగోలేదు ఇలాంటి టైం లో ఇలా ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. అసలు విషయం ఏంటో నువ్వు తెలుసుకుంటే ఆ తర్వాత మనం వెళ్లి స్వప్న నిలదీద్దాం. అప్పుడేమైనా బయటపడుతుందేమో చూద్దాం. రాజ్ ఇందిరా దేవి చెప్పిన మాటలన్నీ విని, అరుణ్ ఫోటో తీసుకొని ముందు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి. కావ్య నుంచి మొదలు పెడితే మనకు అసలు విషయం తెలుస్తుంది ఈ అబ్బాయి ఎవరు అని, పని మనసులో అనుకుంటాడు ఇంతలో ఇందిరా దేవి ఆలోచిస్తున్నావేంటి రాజ్ అని అంటుంది. ఏం లేదు నానమ్మ ఈ విషయం నాకు కాకుండా ఇంకెవరికైనా చెప్పావా అని అడుగుతాడు. లేదు రాజ్ ఎవరికీ చెప్పలేదు అని అంటుంది ఇందిరా దేవి ఎవరికీ చెప్పద్దు కూడా నేను చెప్పే వరకు నువ్వు ఈ విషయం బయట పెట్టకు అని అంటాడు. ఇక రాజ్ కళావతిని అడగడానికి వెళ్తూ ఉంటాడు ఇందిరాదేవి ఆఫీస్ కి వెళ్తానన్నావు మళ్ళీ రూమ్ లోకి వెళ్తున్నాం అని అంటుంది ఏం లేదు నానమ్మ ఒక ఫైవ్ కోసం అని అంటాడు.

తీగ లాగుతున్న రాజ్..
రాజ్ కావ్య గదిలోనికి వెళ్తాడు ఏంటండీ ఆఫీస్ కి టైం అయిందని ఎంత స్పీడ్ గా వెళ్లారో మళ్లీ అంతే స్పీడుగా లోపలికి వచ్చారు అని అంటుంది. మళ్లీ నన్ను చూడాలనిపించిందా అని అంటుంది. నిన్ను చూడడం కంటే డైరెక్ట్ గా సూర్యుని చూద్దాం హాయిగా ఉంటుంది నాకు అని అంటాడు. చూడాల్సింది నాలుగు రోజులు ఏవి కనిపించవని ఇంట్లోనే కూర్చునే వాళ్ళు అని అంటుంది కావ్య. ఏయ్ నన్ను మాట్లాడి ఇస్తావా అని అంటాడు. చెప్పద్దన్న ఆగరు కదా అవసరం కోసం నాతో మాట్లాడతారా నాకు తెలుసు ఏంటో చెప్పండి అని అంటుంది. రాజ్ చెప్పకుండా అలానే ఉంటాడు మీ చిరాకు అయిన ఫేసు చూసే కంటే మీరు చెప్పేది వినడమే బెటర్, ఏంటో చెప్పండి అని అంటుంది. ఏంటండీ అలిగారా ఏంటి అడగంగానే చెప్పట్లేదు, ఇప్పుడు నేను బుజ్జగించాలా ఏంటి అని అంటుంది అక్కర్లేదు అని అంటాడు రాజ్ జేబులో చేయి పెడతాడు, అరుణ్ ఫోటో తీద్దామని, ఓ నాకు డబ్బులు ఇస్తున్నారా వద్దండి అని అంటుంది. రాజ్ అరుణ్ ఫోటో తీయగానే నా ఫోటో మీరు జేబులో దాచి పెట్టుకున్నారా నేనంటే మీకు ఎంత ప్రేమ అని అంటుంది. ఎహే ఆపు అని అంటాడు రాజ్. లొడలడా వాగుతూనే ఉంటావా నీకు తోచింది నువ్వు మాట్లాడతావా చెప్పేదాకా ఆగవా అని అంటాడు. నోరు మూసుకొని కాసేపు కూడా ఉండలేవా అని అంటాడు వెంటనే కావ్య నోటి మీద వేలు వేసుకుంటుంది.

రాత్రి నిజం తెలిసిపోయిందా..
వెంటనే అరుణ్ ఫోటో చూపిస్తాడు రాజ్. ఆ ఫోటో చూడగానే కావ్య ఒకసారిగా షాక్ అవుతుంది. ఈ ఫోటోలో ఉంది అరుణ్ కదా అయినా ఈ ఫోటో రాజ్ దగ్గరికి ఎలా వచ్చింది. ఈ ఫోటో పట్టుకొని నన్ను అడుగుతున్నాడు అంటే రాత్రి అరుణ్ వచ్చి స్వప్నని కలవడం తెలిసిపోయిందా ఏంటి? ఇప్పుడు రాత్రి జరిగింది తెలుసుకొని నన్ను ఉదయాన్నే అడుగుతున్నారా, నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే రాజ్ హలో మేడం మిమ్మల్ని అడుగుతుంది ఈ అబ్బాయి ఎవరో తెలుసా అని అంటాడు. కావ్య ఈ అబ్బాయి పేరు అరుణ్. మా అక్క కాలేజీ ఫ్రెండు అని చెప్తుంది. కాలేజీ ఫ్రెండా అని అంటాడు. ఇంకా నీకు ఇతని గురించి ఏం తెలుసు అని అడుగుతాడు రాజ్. నాకు అంతకన్నా ఏం తెలియదండి అని అంటుంది. ప్రస్తుతం ఇతను ఎక్కడున్నాడు అని అడుగుతాడు. ఏమో నాకు తెలియదు కానీ డాక్టర్ అని మాత్రం తెలుసు అని అంటుంది. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అంటుంది నేను చెప్పను అని అంటాడు. ఈ అబ్బాయి గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది. చెప్పానుగా చెప్పానని అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. రాజ్ వెళ్లిన తర్వాత కావ్య అసలు ఈ అబ్బాయి గురించి స్వప్న రాత్రి వార్నింగ్ ఇచ్చి పంపించాను అని చెప్పింది ఉదయాన్నే ఈ ఫోటో పట్టుకొని వచ్చాడు ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. రూమ్ లో నుంచి బయటికి వచ్చిన రాజ్ కళావతి మాటలు నమ్మడానికి వీల్లేదు మన ప్రయత్నం మనం చేయాలి. నానమ్మ చెప్పినట్టు ఇది చాలా సెన్సిటివ్ మేటర్ ఇందులో లోతు పాట్లు అన్నీ నేనే తెలుసుకోవాలి అని అనుకుంటాడు.
అప్పు ఇంటికి కళ్యాణ్ రాక..
ఇక అప్పుడు ఇంటికి కళ్యాణ్ వచ్చి బ్రో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఏంటి అని అడుగుతాడు. నిజం ఇంట్లో అందరికీ తెలుసు అప్పు కళ్యాణ్ ని ప్రేమిస్తుందని, కానీ కళ్యాణ్ కి మాత్రం తెలియదు. ఇక అప్పుతో కళ్యాణ్ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేసాను అని అంటాడు. ఫోన్ చేతిలో పట్టుకొని తిరగడానికి నేనేమన్నా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నానా అని అంటుంది అప్పు. కృష్ణమూర్తి కనకం అలానే నిలబడి చూస్తూ ఉంటారు. సరే పద అప్పు బయటకు వెళ్దాం అని అంటాడు. చేయి వదులు అని అంటుంది విసుగ్గా అప్పు. నీ గోల నీదే కానీ మా గురించి అసలు ఆలోచించవా అని అంటుంది అప్పు. నీ గురించి ఆలోచించకపోవడం నాకు తెలిసినట్టుగా నీ గురించి ఎవరికీ తెలియదు అని అంటాడు. నీ గురించి ఆలోచించే వాళ్ళు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అంటాడు అని నువ్వు అనుకుంటే సరిపోతుందా అంటుంది అప్పు. అనుకోవడం ఏంటి పొద్దున లేచినప్పటి నుండి నువ్వు ఏం చేస్తావు ఎవరితో మాట్లాడతావు ఏ టైం కి ఎవరిని కలుస్తావు అన్ని నాకు తెలుసు, మొత్తం చెప్పమంటావా అని అంటాడు కళ్యాణ్. నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ నీకు నా ప్రేమ అర్థం కాలేదు అని మనసులో బాధపడుతూ ఉంటుంది అప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు అవతల పెళ్లి పంది చాలా ఉన్నాయి కదా వెళ్దాం అని అంటాడు. అప్పు తొందరగా రెడీ అయ్యారా బయటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు.
అప్పు నీతో రాదు..
ఇక కళ్యాణ్ అపోని తొందర పెడుతూ ఉంటాడు పెళ్లి పనులు చాలా ఉన్నాయి నువ్వు త్వరగా వస్తే ఇద్దరం బయటికి వెళ్లి పనులు చూసుకుందాం నువ్వు లేకపోతే నేను ఏ పని చేయలేను. త్వరగా రెడీ అయ్యారా అప్పు అని అంటూ ఉంటాడు కానీ అప్పు మాత్రం అక్కడే నిలబడి ఉంటుంది. వెంటనే కృష్ణమూర్తి బాబు అప్పు నీతో రావడం కుదరదు అని అంటాడు. అదేంటండీ అప్పు నాతో రావడం మీకు ఇష్టం లేదా ఏంటి అని అంటాడు కళ్యాణ్ కృష్ణమూర్తి తో, నా మాట వినగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు. వెంటనే కనకం కవర్ చేయడానికి ముందుకు వస్తుంది. అంటే బాబు ఆయన ఉద్దేశం అది కాదు అప్పు చాలా రోజుల నుంచి కాలేజీకి వెళ్లడం లేదు దానికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఈరోజు వాళ్ళ నాన్నను తీసుకొని వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడాలి. అంతే బాబు ఆయన అదే చెప్పాలని అనుకుంటున్నారు అని అంటుంది. అదే నా విషయం, అయినా నువ్వేంటి బ్రో చిన్నపిల్లల్లాగా కాలేజ్ కొట్టడం ఏంటి నాన్న తీసుకొని వెళ్లి మాట్లాడేది ఏంటి అని అంటాడు. అది నీతో తిరగడానికే కాలేజీ మానేసింది బాబు అని అంటాడు కృష్ణమూర్తి. ఇక మీదట అలా జరగకూడదని ఇలా నీతో వద్దని చెప్తున్నాను అంటాడు కృష్ణమూర్తి. మీరు చెప్పింది కూడా నిజమే అంకుల్ చదువుని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈరోజు కాలేజీకి వెళ్లి బ్రో, రేపు ఎల్లుండి సెలవులే కదా అప్పుడు వచ్చి షాపింగ్ చేద్దాము. అనామిక నువ్వు నేను కలిసి అని అంటాడు. ఆ మాట చెప్పేసి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరేంటండీ అప్పు ముందు ఆ అబ్బాయితో అలా మాట్లాడుతున్నారు అని అంటుంది కనకం. అతను కావ్య మరిదన్న విషయం మర్చిపోయారా అని అంటుంది. ఒక కూతురికి న్యాయం చేయడం కోసం ఇంకో కూతురు అన్యాయం చేయలేను అని అంటాడు కృష్ణమూర్తి.
నిజం కావ్య కి తెలియకూడదు అనుకున్నా స్వప్న..
ఇక స్వప్న తాపీగా కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కావ్య వచ్చి అక్క అని గట్టిగా అరుస్తుంది ఏమైంది అని అంటుంది స్వప్న. నా భర్త అనుమాన పడుతున్నాడు అని అంటుంది. అది నీ ప్రాబ్లం నా మీద అరుస్తావ్ ఏంటి అని అంటుంది స్వప్న అనుమాన పడుతుంది నామీద కాదు నీ మీద అని అంటుంది. నామీద నీ భర్త అనుమానపడ్డం ఏంటి? అయితే రాహుల్ అనుమానపడాలి గాని రాజ ఎందుకు అనుమాన పడుతున్నాడు అని అంటుంది. నువ్వు నాతో అబద్ధం చెప్పావు అక్క అని అంటుంది కావ్య నేనేం అబద్ధం చెప్పలేదు అని అంటుంది రాత్రి కలిసిన అబ్బాయి అరుణ్ గురించి నువ్వు నా దగ్గర దాచి పెట్టావ్ అక్క అసలు విషయం ఏంటో చెప్పు అని అంటుంది. నేనేం దాచిపెట్టలేదు రాత్రి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అతని నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అంటుంది స్వప్న. అలా అయితే ఇప్పుడు మా వారు అరుణ్ ఫోటో తీసుకువచ్చి నాకు చూపించారు ఎందుకు అని అంటుంది. వెంటనే స్వప్నకు మేటర్ మొత్తం అర్థమైపోతుంది. ఇందిరా దేవి ఆ ఫోటో నీ రాజకీ ఇచ్చినట్టు ఉంది. ఎంక్వయిరీ మొదలుపెట్టాడు అని అనుకుంటుంది స్వప్న ఈ విషయం కావ్యకి తెలియకూడదు తెలిస్తే డైరెక్ట్ గా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెబుతుంది. అని మనసులో స్వప్న అనుకొని కావ్యకి, ఫోటో తీసుకొచ్చి చూపిస్తే నన్నేం చేయమంటావు అదేదో రాజ్ ని అడుగు అని అంటుంది. అయినా నువ్వేంటి నేను ఏదో తప్పు చేసిన దానిలాగా మాట్లాడుతున్నావు అని అంటుంది కావ్యతో, నువ్వు తప్పు చేశావని కాదక్కా మళ్ళీ ఇంకొకసారి ఇంట్లో దోషి గా నిలబడకూడదు అన్నదే నా ప్రయత్నం అని అంటుంది. నా గురించి నేను తప్పు చేసినప్పుడే భయపడలేదు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఏ ఎంక్వయిరీ చేసుకున్న ఐ డోంట్ కేర్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. పైనుంచి ఇదంతా రాహుల్ చూస్తూ ఉంటాడు. అక్క ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటే తనే తప్పు చేయలేదన్నమాట అని అనుకుంటుంది కావ్య.
రాహుల్ ప్లాన్ బి అమలు..
రాహుల్ స్వప్న కాన్ఫిడెన్స్ చూసి, నా భార్య భయపడట్లేదు అంటే మనం ప్లాన్ బి కి వెళ్ళాలి అని అనుకుంటాడు. వెంటనే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోతే కష్టం అవుతుంది అని, అరుణ్ కి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు మన నెక్స్ట్ స్టెప్పులోకి వెళ్లాలి స్వప్నకి కాల్ చేసి డబ్బులు అడగాలి అని అంటాడు. నేను అడగగానే తను ఎందుకు ఇస్తుంది సార్ అన్ని డబ్బులు మీరేమన్న ఇచ్చారా అని అంటాడు. ప్రశ్నకి మళ్లీ ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు వారు నీకు హాస్పిటల్ కి పరిమిషన్ కావాలంటే చెప్పిన పని మాత్రమే చెయ్యి అని అంటాడు రాహుల్. సరే సార్ ఇప్పుడు ఫోన్ చేసి పది లక్షలు అడుగుతాను తను ఎలా తెస్తే నాకేంటి అని అంటాడు. సరే జాగ్రత్తగా మాట్లాడు అని అంటాడు రాహు సరే అని ఫోన్ పెట్టేస్తాడు అరుణ్.
సిఐ కి ఫోన్ చేసినా రాజ్..
ఇక రాజ్ ఆఫీస్ కి వెళ్తూ దారిలో కారులో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య చెప్పినట్టు ఈ అబ్బాయి స్వప్నకి జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అయితే రాత్రి ఇంటికి వచ్చి ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడాడు అని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం అమ్మమ్మ చెప్పినట్టు చాలా సెన్సిటివ్ మేటర్ నేనే తెలుసుకోవాలి కానీ స్వప్నని ఇంతలో అనుమానించడం కరెక్ట్ కాదు విషయం బయటపడిన తర్వాతే మనం ఒక డెసిషన్ కి రావాలి అని అనుకొని సీఐ కి ఫోన్ చేస్తాడు. చెప్పండి సార్ అని అంటాడు సిఐ. నేను మీకు ఒక ఫోటో పంపించాను అతని డీటెయిల్స్ నాకు కావాలి ఇది కొంచెం సీక్రెట్ గా మెయింటినెన్స్ చేయండి మా నాన్న కూడా చెప్పొద్దు అని అంటాడు రాజ్. ఏమైంది సార్ అతని వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటాడు సిఐ లేదు లేదు ఇది నా పర్సనల్ విషయం ఇది బయటకు తెలియకూడదు అని అంటాడు. సాయంత్రం కల్లా అతని ఫుల్ డీటెయిల్స్ మీకు ఫోన్లో చెప్తాను అని అంటాడు.
రేపటి ఎపిసోడ్ లో కావ్య, రాజ్ ఇద్దరినీ తాడుతో కట్టేసి కాళ్లు చేతులు దొంగ, దొంగతనం చేయడానికి ఇంటికి వస్తాడు. చేతులు కాళ్లు కట్టేసిన తర్వాత రాజకీయ మేలుకువ వస్తుంది చూసేసరికి, దొంగ పక్కనే ఉండి నవ్వుతూ ఉంటాడు. హే ఏంటిది అని అంటాడు రాజ్. నేను దొంగని అని అంటాడు. వెంటనే కావ్య దొంగ దొంగ అని పెద్దగా అరుస్తుంది అతను జేబులో నుంచి కత్తి తీసి బెదిరిస్తాడు. వెంటనే కావ్య దొంగ అన్నయ్య మమ్మల్ని ఏమీ చేయొద్దు అని అంటుంది. ఏమన్నావ్ ఇప్పుడు అని అంటాడు దొంగ అన్నయ్య అని అంటుంది. నన్ను అన్నయ్య అని పిలిచావా అని ఎమోషనల్ అవుతాడు దొంగ. రాజ్ ఎక్స్ప్రెషన్స్ భలే కామెడీగా ఉంటాయి.