Brahmamudi Serial November 18 Episode 257: నిన్నటి ఎపిసోడ్ లో, రాహుల్ రుద్రాణి వేసిన ఫోటోల ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో, మరో ప్లాన్ తో ముందుకు వెళ్తారు తల్లి కొడుకులు, స్వప్న అమ్మమ్మ గారి ముందు భోజనం చేయడానికి కంగారుపడి, ఫోటోల గురించి అందరిలో మాట్లాడుతుందేమోనని భోజనం చేయకుండా వెళ్ళిపోతుంది. రాజ్ కావ్యాలు ఇద్దరు అందరి ముందు నటిస్తూ ఉంటారు ప్రేమగా ఉన్నట్టు, కావ్య అందరి ముందు, అపర్ణకి కోపం తెప్పిస్తుంది. రాజ్ కావ్యల మీద రుద్రాణి కి అనుమానం వస్తుంది.

ఈరోజు 257 ఎపిసోడ్ లో కావ్య పుస్తకం చదువుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ గదిలోనికి వస్తాడు. కావాలనే కావ్య ఆ పుస్తకంలో ఉన్న రాజు గారి కథ ని పైకి చదువుతుంది. రాజుగారు లోపలికి వచ్చేసరికి రాణి గారు, తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వయ్యారంగా హంస దూళిక తలపం మీద బోర్లా పడుకొని, శృంగార నైషధం చదువుతూ ఉంది. రాజుగారు ఆమెని ఓరకంటతో చూస్తూ ఉన్నాడు అని చదువుతూ ఉంది రాజ్ నిజంగానే కావలెను అలానే చూస్తూ ఉంటాడు. గుండె సవ్వడి గుడి గంట సవ్వడిలా మోగుతూ ఉంటే యుద్ధానికి కదిలి యోధుడిలా, తల్పం వైపు నడుస్తూ ఉన్నాడు. అని చదువుతుంది దానికి రాజ్ కోపంగా ఇంకా ఆపు అన్నట్టుగా బెడ్ మీద నుంచి లాగే కింద పడేస్తాడు కావ్యని, రాజ్ ఒడిలో కావ్య పడుతుంది. అయినా గాని పుస్తకం వదలకుండా చదువుతూ ఉంటుంది. రాజకీయ కోపం వచ్చి పుస్తకం తీసి విసిరేస్తాడు. ఆ పుస్తకం వచ్చి మళ్ళీ రాజ్ కి తగులుతుంది. అయ్యో రాజు రాణి గాల్లో ఎగురుతున్నారండి. అసలు ఏమైందే నీకు అని అంటాడు. వైస్ అయింది అని అంటుంది వెంటనే రాజ్ ఏంటి అని అంటాడు. మనసైంది అని అంటుంది కావ్య. మన మధ్య భార్యాభర్తల బంధం లేదని చెప్పాను కదా అని అంటాడు రాజ్. నీకు నాకు మధ్య ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ బంధం సంబంధం ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎలా ఉండదో నేను చూస్తా అని అనుకుంటుంది కావ్య.

అరుణ్ ఫోన్ స్వప్న కంగారు..
అరుణ్ ఫోన్ చేస్తా అన్నాడు అని స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది. నైట్ ఫోన్ చేస్తానని మెసేజ్ పెట్టాడు ఇంతవరకు చేయలేదు అని స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది. రుద్రాణి రాహుల్ తో ఈ అరుణ్ గాడు వస్తాడు అన్న ఇంకా రాలేదేంటి అని అంటుంది వస్తాడు మమ్మీ అని అంటాడు రాహుల్. అప్పుడే అరుణ్ ఫోన్ చేస్తాడు రాహుల్ కి, ఎక్కడున్నావ్ అని అంటాడు రాహుల్ మీ ఇంటి ముందే ఉన్నాను అని అంటాడు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు స్వప్న కి కాల్ చేసి బయటికి రమ్మని చెప్పు అని అంటాడు. నేను చెప్తే తను రాదు సార్ అని అంటాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు కచ్చితంగా వస్తుంది అని అంటాడు రాహుల్ నేను చెప్పినట్టు వినేది అయితే నేనే పెళ్లి చేసుకునేవాన్ని కదా అని అంటాడు అరుణ్. ఇప్పుడు దాని భయంలో ఉంది తన ఫొటోస్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి కచ్చితంగా వస్తుంది అని అంటాడు రాహుల్. సరే సార్ అని పెట్టేస్తాడు ఇక స్వప్న కి కాల్ చేస్తాడు అరుణ్. ఫోన్ లిఫ్ట్ చేయగానే నీకు అసలు బుద్ధుందా అని స్వప్న తిట్టడం మొదలు పెడుతుంది. ఒకసారి నేను చెప్పింది వింటావా అంటాడు ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది, నీతో కలిసి తిరిగినంత మాత్రాన పెళ్లయిన తర్వాత నీ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావా అని అంటుంది స్వప్న. నేను చెప్పేది ఒకసారి విను స్వప్న అంటాడు. నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు ఆ ఫోటో గాని ఎవరికంటైనా పడితే నాకు ఎంత ప్రాబ్లం అవుతుందా అసలు ఆలోచించావా అని స్వప్న అరుణ్ మీద కోపంతో అరుస్తూ ఉంటుంది. నువ్వేమైనా సినిమా హీరో బే చూడగానే మురిసిపోవడానికి బుద్ధుందా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అసలు ఏ ఉద్దేశంతో పంపించావు రా నీ ఫోటో మా ఇంటికి ఇప్పుడు నీ ఫోటో చూడంగానే నేను మళ్ళీ గతం గుర్తు చేసుకోవాలని, అని అరుణ్ తో గొడవ పడుతూ ఉంటుంది స్వప్న.
Krishna Mukunda Murari: తన ఇంట్లోనే క్రిష్ణని ఉండమన్న మురారి.. సూపర్ ట్విస్ట్

అరుణ్ ని కలిసిన స్వప్న..
ఇక స్వప్నాల మాట్లాడుతూ ఉంటే అరుణ్ ఇందాకట్నుంచి నా ఫోటో మాత్రమే పంపించాను అంటున్నావు మరి ఇద్దరి ఫోటోలు కదా పంపించింది అని అంటాడు. ఆ మాటకి ఒకసారిగా షాక్ అవుతుంది స్వప్న.ఏంటి మన ఫోటోలు కూడా పంపించావా అని అంటుంది అవును నువ్వు చూడలేదా అంటాడు అరుణ్.ఇప్పుడు అసలు అవి ఎందుకు పంపించాను చెప్పడానికే నిన్ను ఒకసారి కిందకి రమ్మంటున్నాను ఇప్పుడు నేను మీ ఇంటి ముందే ఉన్నాను అని అంటాడు అరుణ్. ఇప్పుడు నువ్వు పిలవంగానే నేను రావాలా అని అంటుంది స్వప్న. నువ్వు ఒకసారి వస్తే నీకు ఒక్క మాట చెప్పేసి నేను వెళ్ళిపోతాను అని బతిమిలాడుతాడు. స్వప్న బయటికి వెళ్లడానికి ఇష్టపడదు అరుణ్ నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నేనే మీ ఇంట్లోకి వస్తాను అని బెదిరిస్తాడు. దాంతో చేసేదేం లేక స్వప్న నేనే వస్తాను అని చెప్తుంది. ఇక స్వప్న వెళ్లడం రాహుల్ రుద్రాణి ఇద్దరు చూస్తారు. స్వప్న ఎవరూ చూడకుండా అరుణ్ దగ్గరికి వెళ్తుంది. అరుణ్ణి ఇంట్లో నుంచి పక్కకి తీసుకువెళ్లి మాట్లాడుతుంది.
Naga Panchami November 17 2023 Episode 203: కంత్రి తంత్రీ చేసిన పనికి చిత్ర జ్వాల బలైపోతారు..

రాహుల్ ప్లాన్.. రాజ్ అనుమానం..
స్వప్న బయటికి వెళ్లడం చూసిన రుద్రాణి ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసి రాజ్ ని బయటికి వచ్చేలా చెయ్యి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం రాజ్ చూశాడు అంటే ఇక తర్వాత జరిగేదంతా జరిగిపోతుంది అని అంటుంది. సరే మమ్మీ అని రాహుల్, రాజ్ గది దగ్గరికి వెళ్లి తలుపు కొడతాడు. రాజు ఎంతసేపటికి బయటికి రాపోవడంతో రాహుల్ ఫోన్ చేస్తాడు రాజ్ కి, నీతో ఒక విషయం మాట్లాడాలి ఒకసారి బాల్కనీలోకి రా అని అంటాడు రాహుల్ రాజ్ తో, స్వప్న తో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు వచ్చావు చెప్పు అని అంటుంది. విషయం ఏంటో సరిగ్గా చెప్పు అని అంటుంది ఐ లవ్ యు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అని అంటుంది. అవును స్వప్న ఐ లవ్ యు నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటాడు అరుణ్ ఆ మాటలకి సౌండ్ వచ్చి కావ్య ఏంటి ఎవరో మాట్లాడుకుంటున్నారు అని బయటకు వచ్చి చూస్తుంది. స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు అది కావ్య చూస్తుంది. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని రాజ్ రాహుల్ ని అడుగుతాడు. నీకు ఒక విషయం చెబుదామని అనుకున్నాను రాజ్ కానీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది తర్వాత చెప్తానులే అని వెళ్ళిపోతాడు. అసలు వీడు ఎందుకు ఫోన్ చేశాడు ఏంటి చెప్పకుండా వెళ్ళాడు అని అనుకుంటూ బాల్కనీలో నుంచి కిందకి చూస్తాడు రాజ్. అప్పుడు అక్కడ స్వప్న చెయ్యి పట్టుకొని అరుణ్ మాట్లాడుతూ ఉంటాడు. అది రాజ్ చూస్తాడు. ఈ టైంలో స్వప్న ఎవరితో అబ్బాయితో మాట్లాడుతుంది అని అనుకుంటాడు రాజ్. నా ప్లాన్ సక్సెస్ అయిందని, రాహుల్ సంతోషిస్తాడు.

అక్కకి వార్నింగ్ ఇచ్చిన కావ్య..
ఇక రాజ్ స్వప్నని అరుణ్ణి చూసి, ఈ టైంలో స్వప్న ఎవరితో మాట్లాడుతుంది. నేనేంటి తప్పుగా ఆలోచిస్తున్నాను ఒకవేళ ఫ్రెండ్ అయ్యుంటాడు అని అనుకుంటాడు. విషయం ఏంటో తెలియకుండా నేను అనుమాన పడకూడదు అని రాజ్ మనసులో అనుకుంటాడు. ఇక స్వప్న లోపలికి వస్తూ ఉంటుంది అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్వప్న వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి లోపలికి వస్తుంది. అక్కడే కావ్య నించొని ఉంటుంది. కావ్య స్వప్నని తీసుకొని లోపలికి వెళ్లి తలుపేసి మాట్లాడుతుంది. ఏం చేస్తున్నావ్ అక్క నువ్వు అని అడుగుతుంది. నేనేం చేశాను ఇప్పుడు అని అంటుంది అరుణ్ గాడు ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది కావ్య వాడు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోండి అని అడగడానికి వచ్చాడు అని అంటుంది స్వప్న. స్వప్న మాటలకు షాక్ అవుతుంది కావ్య ఏంటి వాడి మళ్లీ నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడా అని అంటుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నావు నీకు అర్థం అవుతుందా ఇది అత్తగారిల్లు అని అంటుంది. నాకు ఆ మాత్రం తెలీదు అనుకున్నావా కావ్య వాడికి నేనేమీ చెప్పలేదు వాడంతటి వాడే వచ్చాడు అని అంటుంది. అలా ఎలా వస్తాడు అక్క నీ నుంచి ఏ రెస్పాండ్ లేకుండా వాడినంత దూరం వచ్చాడంటావా అని అంటుంది నిజం చెప్తున్నాను కావ్య నన్ను నమ్ము నేనైతే వాడిని పిలవలేదు అసలు వాడితో నేను ఫోన్ లోనే మాట్లాడలేదు ఇంత వాడికి వాడే ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చి నాకు ఐ లవ్ యు చెప్పి పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు. రాహుల్ అని సరిగా చూసుకోవట్లేదని వాడికి తెలిసిందిట అందుకని మళ్లీ లైఫ్ ఇస్తానన్నట్లు మాట్లాడుతున్నాడు అని అంటుంది. అయినా నేను ఎందుకు అబద్ధం చెప్తాను నీకు అని అంటుంది స్వప్న. నిన్ను నేను నమ్మలేను అక్క ఎందుకంటే అక్కడిదాకా వచ్చిన తర్వాత నువ్వు నన్నే ముంచేస్తావు అందుకే నా జాగ్రత్తలో నేను ఉండడానికే నీ నుంచి నిజం రాబడుతున్నాను. ఇంక మీదట వాడిక్కడ ఇంకొకసారి వస్తే మాత్రం నేనే ఊరుకోను ఇంట్లో వాళ్ళదాకా కాదు నేనే ముందు ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని అంటుంది. నన్ను నమ్ము కావ్య అని అంటుంది స్వప్న నిన్ను నేను ఎప్పటికీ నమ్మలేను అక్క అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కనకం బాధ..
కనకం అప్పు ప్రేమ గురించి తెలుసుకొని మళ్లీ ఆ ఇంట్లో అబ్బాయిని ప్రేమించింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కృష్ణమూర్తి వస్తాడు. ఏంటి కనకం ఒక్కదానివే కూర్చుని ఆలోచిస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. రాత్రి టైం రెండు అయింది ఇంకా నిద్ర పోకండి ఇక్కడ కూర్చున్నావ్ ఏంటి అని అడుగుతాడు. నేనంటే ఆర్డర్ వచ్చింది కాబట్టి బొమ్మలు చేస్తూ కూర్చున్నాను నువ్వు పడుకోవచ్చు కదా అని అంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు కదా పడుకుందాం అని అంటాడు. ఒక నిమిషం అండి మీతో ఒక మాట చెప్పాలి అని అంటుంది. ఈ టైంలో నా అని అంటాడు అవును ఇప్పుడే అని అంటుంది కనుకమ్. మీతో అసలు చెప్పకూడదనుకున్నాను చెప్పకపోతే, మీ దృష్టిలో నేను ఇంకో తప్పు చేసిందని అవుతాను అందుకే చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది కనుకమ్. ఏమైందే ఎందుకు అంత కంగారుగా బాధగా ఉన్నావు అని అంటాడు కృష్ణమూర్తి ఇంకో సమస్య మొదలైంది అని అంటుంది. కృష్ణమూర్తి అవాక్కయి చూస్తాడు.
రేపటి ఎపిసోడ్ లో, రాజ్ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే ఇందిరాదేవి ఎదురు వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడే అరుణ్ ఫోటోలు తీసి చూపిస్తుంది ఇతను అని రాజ్ అంటాడు ఇతను ఎవరో నాకు తెలియదు కానీ మన ఇంటికి కొరియర్ వచ్చింది. అందులో ఇతని ఫొటోస్ స్వప్న అని ఈ అబ్బాయి దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ మాటలకి రాజ్, ఆలోచిస్తూ ఆ ఫోటో తీసుకుంటాడు ఈ అబ్బాయి గురించి నిజాలు తెలుసుకోవాలి అని అంటుంది ఇందిరాదేవి. ఆ ఫోటోలు తీసుకొని రాజ్ కావ్య దగ్గరికి వెళ్తాడు. ఫోటో చూపించగానే ఈ అబ్బాయి మా అక్క కాలేజ్ ఫ్రెండు అని చెప్తుంది. కాలేజ్ ఫ్రెండా అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు.