Krishna Mukunda Murari: రేవతి రాగానే తనకు ఎలా ఉంది అని అడగగా ఇప్పుడు బానే ఉంది అని అంటుంది. మురారి ఎక్కడ ఇంకా రాలేదు అక్కడే ఉన్నాడు అని చెబుతుంది. కృష్ణకి ఇంత త్వరగా తగ్గిపోయింది అంటే అది ఖచ్చితంగా యాక్టింగ్ అయి ఉంటుంది అని ముకుందా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ ముకుందా మేము రీల్స్ చేయడం లేదు అది రియల్ అని మధు అంటాడు. అదంతా యాక్టింగ్ అని నాకు అనిపిస్తుంది అని భవాని అంటుంది. పెద్దమ్మ వాళ్ళు ఇదంతా చేశారు అని ప్రూవ్ కాలేదు కదా, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు పిల్ల ని ఇచ్చిన చోట తగ్గి ఉంటారు అని అనగానే.. ఏంట్రా మధు నువ్వు కూడా నాకు చెప్పే అంత పెద్ద వాడివి అయ్యావా? నా తోడబుట్టకపోయినా చెల్లెలా చూసుకుంటున్న తనకి కూడా ఈ విషయంలో నేను నచ్చడం లేదు అందరూ నాకు మాయ కప్పేసింది అని అనుకుంటున్నారు. త్వరలోనే మీ మాయ పొరలని నేను తొలగిస్తాను అని భవాని అంటుంది.

కృష్ణవేణి గారు మీకు ప్రమాదం జరిగినప్పుడు మిమ్మల్ని వేణి అని కాకుండా కృష్ణ అని ఎందుకు పిలిచాను అని మురారి కృష్ణని అడుగుతాడు. కృష్ణ మౌనంగా ఉండిపోతుంది గతంలో మీకు నాకు మధ్య స్పాన్సర్ అని కాకుండా కృష్ణ అని పిలిచే ఏమైనా రిలేషన్ ఉందా అని అడిగితే.. మీరు నన్ను చదివించారు కదా ఆ చనువుతో నన్ను పిలిచి ఉంటారు అని అంటుంది. అంతేనా ఇంకా ఏం లేదా అని మురారి కృష్ణని ప్రశ్నిస్తాడు అప్పుడే ముకుందా అక్కడికి వస్తుంది మురారి నిన్ను పెద్దత్తయ్య ను పిలుచుకుని రమ్మంటుంది అని అంటుంది. ఇక్కడ ఎలాగో ఈ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు కదా అక్కడే తేల్చుకుంటాను అని మురారి సీరియస్ గా భవాని దగ్గరకు బయలుదేరుతాడు.

నాన్న మురారి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడగగా నేను ఎవరిని కాపాడాను అని మురారి అంటాడు. అదేంటి ఆ డాక్టర్ కృష్ణవేణి కాపాడావు కదా అని భవాని అంటుంది. ఇంతకీ ఆ డాక్టర్ కృష్ణవేణి ఎవరు.. అయినా గతంలో మీరెవరు.. నేను ఆ వేణి గారిని ఒక్కదానినే చదివించానా అని మురారి భవానిని అడుగుతాడు. లేదు నాన్న చాలామందిని చదివించావు అని భవాని అంటుంది. మరి వాళ్లంతా నాకెందుకు గుర్తుకు రావడం లేదు. ఈ కృష్ణవేణినే ఎందుకు గుర్తుకు వస్తుంది అని మురారి భవానిని సూటిగా ప్రశ్నిస్తాడు. తనతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. పదే పదే కలవాలనిపిస్తుంది అని వాళ్ళ పెద్దమని నిలదీసి అడుగుతాడు. ఎవరు సమాధానం చెప్పరు. నేను మాత్రం పిచ్చివాడిలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. నాకు ఈ తలకాయ బద్దలై పోతుంది. నాకు కోపం రాదా బాధగా అనిపించదా, ఒక్కరంటే ఒక్కరు చెప్పారు. ఏమైనా ఉంటేనా కదా చెప్పడానికి, చదివించావు అని చెప్పాను అది నిజం. వాళ్ళు మనల్ని దారుణంగా మోసం చేశారు అది నిజం అని భవాని అనగానే.. అది నాకెందుకో నిజం కాదు అనిపిస్తుంది పెద్దమ్మ అని మురారి అంటాడు.

నాకు ఎవ్వరూ నిజం చెప్పారు. అసలు ఏమైందో చెప్పమని మురారి బావని నీ నిలదిస్తాడు. అప్పుడు బావని నువ్వు చనిపోయవని చెప్పి ఒక డెడ్ బాడీ నీ పోలీసులు ఇంటికి పంపించారు. మేమంతా అదే నిజమని నమ్మాము. కానీ నువ్వు ఆ కృష్ణ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నవు. ఈ విషయం వాళ్లకు తెలిసిన కూడా మాకు నిజం చెప్పలేదని భవాని మురారి కి చెబుతుంది. ఆ మాట వినగానే మురారి కళ్ళు తిరిగి పడిపోతాడు. రేవతి త్వరగా వెళ్లి ఆ కృష్ణ నీ పిలుచుకు రమ్మని చెబుతుంది. రేవతి కృష్ణ కి జరిగిందంతా చెప్పి ఇంటికి తీసుకు వస్తుంది. భవాని కృష్ణ తో మురారి ఏం అడిగినా నిజమే చెప్పమని చెబుతుంది.

కృష్ణ మురారి దగ్గరకి వెళ్తుంది. తనకి స్ప్రహ రాగానే నవ్వుతూ మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేస్తుంది. మధు వేసే పంచ్ డైలాగ్స్ కి నవ్వుతూ ఉంటారు. మురారి కృష్ణ నీ ఒక ప్రశ్న అడగాలి అనగానే.. ముకుంద మాత్రం కంగారు పడుతుంది. మీరు నన్ను ఏదైనా అడిగే చనువు మికుంది అడగమని చెప్పగా.. మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మీరు ఈ ఇంట్లో నాతో పాటు ఉండమని చెబుతాడు. ఇక రేపటి కృష్ణ మురారి మాట్లాడుకుంటూ ఉంటారు. మురారి కృష్ణ ఒడిలో పడుకుని నిద్ర పోతాడు.