Naga Panchami November 17 2023 Episode 203: నువ్వు వెళ్లి పిలుచుకురా అని జ్వాల అంటుంది. అక్క ఇద్దరు వెళ్లి పిలుద్దాం రా అక్క అని చిత్ర అంటుంది. పంచమిని పిలుచుకు వచ్చి చూడు పంచమి నువ్వు చేసిన నిర్వాకం నిన్ను నమ్మి తాళం ఇస్తే ఇలా చేస్తావా అని జ్వాల అంటుంది. నాకేమీ తెలియదు అమ్మ నేను ఈ గదిలోకి రాలేదు అని పంచమి అంటుంది. నువ్వెందుకు వస్తావు నువ్వు పంపించిన దొంగలు వస్తారు అని జ్వాల అంటుంది. నిజంగా నాకేమీ తెలియదు నన్ను నమ్మండి అని పంచమి అంటుంది. మేము కాదు నమ్మేది నీకు పెత్తనం అంట కట్టిన వైదేహి నమ్మాలి అని చిత్ర అంటుంది. ఆవిడ ఇవన్నీ ఇలా చూసింది అంటే నీ పని క్లోజ్ అని జ్వాల అంటుంది. అందరూ వచ్చేలోపు నీ బట్టలు సర్దుకొని పారిపో పంచమి అని చిత్ర అంటుంది. తప్పు చేయనప్పుడు నేనెందుకు పారిపోవాలి అని పంచమి అంటుంది.

చూడు పంచమి అందరూ వచ్చారంటే నిన్ను పోలీస్ స్టేషన్లో పెడతారు ఇక మోక్ష కొద్ది రోజుల్లో చనిపోతాడు ఇక నిన్ను ఎవరు కాపాడుతారు చెప్పు అని జ్వాలా అంటుంది. చూడండి మోక్ష గురించి మీరు మాట్లాడితే బాగోదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పంచమి. చూడు పంచమి నువు ఏ ధైర్యం చూసుకొని మాతో పెట్టుకుంటున్నావొ నాకే అర్థం కావట్లేదు అని జ్వాలా అంటుంది. చూడండి నేను చెయ్యని తప్పుకి ఒప్పుకోను తప్పు చేయనప్పుడు నాకేంటి భయం అని పంచమి అంటుంది. అక్క దీని సంగతి ఇలా కాదు అందరిని పిలుచుకు వద్దాము రా అని చిత్ర జ్వాలా వెళ్లిపోతారు. కంట్రీ మనం అనుకున్న పని జరిగింది మనకు నీలాంబరి మంచి నరమాంసం పెడుతుంది అని వాళ్ళిద్దరూ సంబరపడతారు. పంచమి బాధపడుతూ సోఫా మీద కూర్చుంటుంది. ఇంతలో సుబ్బు వచ్చి ఏం జరిగింది పంచమి అని అంటాడు.

పంచమి మౌనంగా ఉండడం చూసి సుబ్బు పైకి వెళ్తాడు. కట్ చేస్తే, అందరూ వచ్చి డబ్బు పోయిందని పంచమి తిడుతూ ఉంటారు. ముందు గది దగ్గరికి వెళ్లి చూస్తే కదా డబ్బు పోయిందో ఉందో తెలిసేది అని రఘు అంటాడు. అందరూ రూమ్ దగ్గరికి వెళ్లి చూసేసరికి ఎక్కడి బీరువా అక్కడ తాళం వేసి ఉంటుంది. దాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. చూశారా ఇందాక నేను చెబితే మీరు నమ్మలేదు ఇక్కడ డబ్బులు కింద ఎక్కడ పడి ఉన్నాయి అని చిత్ర వాళ్ళ ఆయన అంటాడు. లేదు నిజంగానే డబ్బులు అన్ని కింద పడిపోయి ఉన్నాయి అని చిత్ర అంటుంది. జ్వాలా బీరువా దగ్గరికి వెళ్లి ఓపెన్ చెయలని విశ్వప్రయత్నం చేస్తుంది కానీ బీరువా ఓపెన్ కాదు. పంచమి బీరువా తాళాలు తీసుకురా అమ్మ అని రఘు అంటాడు.

నా దగ్గరే ఉన్నాయి మామయ్య గారు అని పంచమి తాళాలు ఇస్తుంది. బీరువా ఓపెన్ చేస్తే డబ్బులు నగలు అన్ని బీరువాలోనే ఉంటాయి. పంచమి ఇరికించడానికి ఇలాంటి పనిచేశారని అందరూ చిత్రని జ్వాలాని తిట్టి వెళ్ళిపోతారు.అక్క అంతా ఆ సుబ్బు గాడు ఈ పంచమి పనే అక్క ఏమి తెలియనట్లున్నారు చూడు అని చిత్రా అంటుంది. నేను నిజంగా చూశాను డబ్బు అంత ఇక్కడ పడిపోయి చిందరవందరగా ఉంది అని పంచమి అంటుంది. ఒక్కోసారి మనం బ్రహ్మ పడతాము పంచమి అని సుబ్బు అంటాడు. కట్ చేస్తే, మోక్ష స్వామీజీ దగ్గరికి వెళ్లి పంచమి పాముగా మారకుoడా ఏదైనా అవకాశం ఉందా స్వామి అని అడుగుతాడు. చూడు మోక్ష పంచమి పాము అని తెలుసాక మనిషి అనే వాడు ఎవడైనా సరే భయపడి తను ఎలా వదిలించుకోవాలని చూస్తాడు, కానీ నువ్వు మంచి వాడివి కాబట్టి నీకు పంచమి మీద ఉన్న ప్రేమ నిన్ను పంచమిని మార్చడానికి ప్రయత్నించేలా చేస్తుంది అని స్వామీజీ అంటాడు.

స్వామీజీ పంచమి నా భార్య నా భార్యని కాపాడుకోవడం నా ధర్మం, కానీ చిన్నప్పటి నుంచి పాములు అంటే నాకు భయం కానీ మిమ్మల్ని కలిసి పంచమి పుట్టుక తెలుసుకున్నాక నాకు ఆ భయం పోయింది పంచమి మీద జాలి ప్రేమ ఎక్కువైంది తనను ఎలాగైనా సరే కాపాడుకోవాలనిపిస్తుంది అని మోక్ష అంటాడు.పంచని పాముగా మారి నిన్ను కాటు వేయడానికి విశ్వప్రయత్నం చేసింది చూసిన తరువాత కూడా పంచమిని కాపాడాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు చూడు నీలాంటి మనిషి ఈ భూమండలంలో చాలా అరుదుగా ఉంటారు నువ్వు చాలా గొప్ప వాడివి నీ మనసు చాలా మంచిది నీకు మంచే జరుగుతుంది అని స్వామీజీ అంటాడు.

పౌర్ణానికి పంచమి పాముగా మారి నన్ను కాటు వేయడానికి వస్తుందని పంచమికి తెలుసు నాకు తెలుసు కానీ నా చావు గురించి నాకు భయం లేదు స్వామీ నా పంచమి పాముగా మారకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని మోక్ష అడుగుతాడు. ఈ సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మోక్ష పరిష్కారం లేని సమస్య ఉండనే ఉండదు అని స్వామీజీ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది