Double Engine OTT release: కొందరు సినిమాల కంటే కొన్ని కొన్ని వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో గాయత్రి గుప్తా కూడా ఒకరు. ఇక ఈమె ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ డబల్ ఇంజిన్ ఓటీటీలోకి రాబోతుంది. మార్చ్ 29 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కథనంతో తెరకెక్కిన ఈ మూవీకి రోహిత్ పెనుమాత్స దర్శకత్వం వహించాడు. రోహిత్, శశి కథను అందించగా కేవలం 30 లక్షల బడ్జెట్ తోనే 12 రోజుల్లోనే ప్రయోగాత్మకంగా డబల్ ఇంజిన్ మూవీని తెరకెక్కించారు. డబల్ ఇంజిన్ మూవీలో ముని, అజిత్ కుమార్, రోహిత్ నరసింహ, రాజు తో గాయత్రి గుప్తా కీలక పాత్రలు వహించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ మూవీకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా యదార్ధ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు రోహిత్ డబల్ ఇంజిన్ ని తెరకెక్కించాడు. హైదరాబాద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న డానీ తన చిన్ననాటి స్నేహితుడు గోపిని కలవడానికి ఓ పల్లెటూరికి చేరుతాడు. రెండు తలల పామును అమ్మి భారీగా డబ్బు సంపాదించాలని డానీ, గోపి ప్లాన్ చేస్తారు. పాములు పట్టుకునే ప్రయత్నంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు? చివరికి దానిని పట్టుకుని అమ్మారా? అనే కథ చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీలో గాయత్రి గుప్తా మినహా మిగిలిన వారందరూ కొంత నటీనటులే కావడం విశేషం. జనవరి 5న డబల్ ఇంజిన్ మూవీ థియేటర్లో విడుదలైంది. గంట 45 నిమిషాల నీడివితోనే ఈ మూవీని తెరకెక్కించారు.
తక్కువ టైం అయినప్పటికీ థియేటర్లలో రిలీజ్ అయి మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన రోజే మరో పలు సినిమాలు పోటీగా నిలబడ్డాయి. ఫిదా లో సాయి పల్లవి స్నేహితురాలిగా కనిపించింది గాయత్రి గుప్తా. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపును సైతం సంపాదించుకుంది. ప్రస్తుతం డబల్ ఇంజిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలు చేస్తూ సక్సెస్ పొందాలని ఈమె ఫాన్స్ ఆశిస్తున్నారు.
ఇక ఈమె గతంలో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, అమర్ అక్బర్ ఆంథోనీ, బుర్రకథ తో పాటు పలు సినిమాలు చేసింది. అంతేకాకుండా దయా, షూటౌట్ ఎట్ ఆలేరు అని తెలుగు వెబ్ సిరీస్ లలో వైవిద్యమైన పాత్రలు పోషించింది. ఇక ఈ సినిమాలేవి ఈమెకు ఆశించిన స్థాయిలో పేరు తెచ్చి పెట్టలేదు. దీంతో ఈమె పేరు పెద్దగా సినీ ఇండస్ట్రీలో వినిపించలేదు. కానీ అనేక వివాదాలతో మాత్రం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు నటీనటులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ బాగా ట్రెండ్ అయింది. ఇక మొట్టమొదటిసారిగా డబల్ ఇంజిన్ మూవీ తో సక్సెస్ అయ్యింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!