NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Hi Nanna TRP: ఓటీటీలో హిట్ టాక్ దక్కించుకున్న హాయ్ నాన్న.. టీవీలో మాత్రం భారీ డిజాస్టర్.. కారణమేంటి..?

Hi Nanna TRP: రోజు రోజుకి ఓటీటీల హవా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే టీవీల హడావిడి పోతుంది. ఈ ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తున్నది. తాజాగా నాని హీరోగా నటించిన హాయ్ నాన్న మూవీకు వచ్చిన టిఆర్పి తో ఇది మరోసారి రుజువు అయింది. నెట్ఫ్లిక్స్ ఓటిటిలో హిట్ టాక్ తో సాగిన ఈ మూవీ టీవీల్లో మాత్రం ఎవ్వరు చూడకపోవడంతో దారుణమైన టిఆర్పి రేటింగ్ను సొంతం చేసుకుంది. ఈమధ్య జెమినీ టీవీలో ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన సంగతి తెలిసిందే. నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కింది.

Hi Nanna movie TRP
Hi Nanna movie TRP

ముఖ్యంగా దసరా లాంటి మాస్ మూవీ తర్వాత నాని మరోసారి ఓ క్లాస్ మూవీతో రావడం మూవీ అంత చాలా క్లాసిగా సాగడంతో థియేటర్లలో నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. ఇక ఆ ప్రభావం ఓటిటి పై పడకపోయినా టీవీ ప్రీమియర్లపై బాగానే పడింది. మార్చ్ 17వ తారీఖున జెమినీ టీవీలో ఈ మూవీ ప్రసారమైంది. అంతకు చాలా రోజుల ముందే ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయినా హాయ్ నాన్న మూవీ కి అర్బన్ ఏరియాలో 4.45 టిఆర్పి దక్కగా రూరల్ ఏరియాలో 4.06 టిఆర్పి దక్కింది. నాని లాంటి హీరో మూవీకి ఈ విధమైన టిఆర్పి దక్కడంతో తన అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు.

ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఈ సినిమాకు ఇంత దారుణమైన టిఆర్పి అందుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ పెద్ద హీరో సినిమాకు కనీసం రెండంకెలు దాటితేనే మంచి టిఆర్పి రేటింగ్ గా పరిగణిస్తారు. కానీ హాయి నాన్న మూవీ దానికి చాలా దూరంలోనే ఆగిపోయింది. నిజానికి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. చాలా వారాలపాటు నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ లో ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా హాయ్ పాప పేరుతో హిందీలో డబ్ కాగా ఈ మూవీకి తెలుగు కంటే కూడా అక్కడే మంచి రెస్పాన్స్ రావడం విశేషం.

Hi Nanna movie TRP
Hi Nanna movie TRP

కానీ టీవీలో మాత్రం ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ లాంటి చానల్స్ కూడా పోటీ ఇవ్వలేక కింద మీద పడుతున్న జెమినీ టీవీ ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఆ ఆశలని అన్ని హాయ్ నాన్న మూవీ నిరాశలు చేసిందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల మధ్య జరిగే కథ మరియు పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తల్లి విడిచి వెళ్లిపోవడం. తండ్రి ఎంతో ప్రేమగా చూసుకోవడం చుట్టూ ఈ మూవీ తిరిగింది. అలాంటి ఈ ఎమోషనల్ మూవీకి ఇటువంటి టిఆర్పి రేటింగ్ దక్కడం బాధాకరం. ఏదేమైనా ఇది నాని కెరీర్ లో బిగ్ మార్క్ గా మిగిలిపోతుందని చెప్పొచ్చు. మరి నానీ తన నెక్స్ట్ మూవీ తో ఈ టాక్ మీ తొలగిస్తాడో లేదో చూడాలి.

author avatar
Saranya Koduri

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella