Premikudu re release: ప్రస్తుత కాలంలో రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. ఒకరు రిలీజ్ చేస్తున్నారని మరొకరు రిలీజ్ చేయడం వంటివి కామన్ గా చేస్తున్నారు. అలా రీ రిలీజ్ అయిన సినిమాలు అప్పట్లో ఫ్లాప్ అయిన ఇప్పట్లో మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. కొన్ని సినిమాల కాన్సెప్ట్ అప్పట్లో అర్థం కాకపోయినా ఇప్పుడు ఉన్న జనరేషన్ వాటిని ఎక్కువ ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే వసూళ్లను ఎందుకు వదులుకోవడం అనుకుంటున్నారో ఏమో తెలీదు కానీ ప్రతి ఒక్క సినిమా మేకర్స్ కూడా తమ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే అలా అనేక స్టార్ హీరోల సినిమాల సైతం రిలీజ్ అయ్యాయి. తాజాగా మరో సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఆ సినిమా మరేదో కాదు ” ప్రేమికుడు “. అప్పట్లో మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం రీ రిలీజ్ కి సిద్ధమైంది. 30 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ లో ప్రభుదేవా హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్ , గిరీష్ లీడ్ రోల్స్ లో నటించారు.
ఈ మూవీ అప్పట్లో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి కలెక్షన్స్ సాధించేందుకు రెడీ అయింది. ఇక అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాకు ప్రభుదేవా కూడా హాజరుకానున్నారట. ఈ మూవీ రీ రిలీజ్ లో కాసుల వర్షం కురిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ప్రభుదేవా అంటేనే డాన్స్. తన డాన్స్ తో సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తాడు.
అటువంటి ప్రభుదేవా సినిమా అంటే ఒక రేంజ్ కలెక్షన్స్ నమోదవడం ఖాయం. మరి ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అండ్ టైం త్వరలోనే వెళ్ళడు కానున్నాయి. ఇక ఈ వార్త తెలుసుకున్న ప్రేక్షకులు..” నేటితరం యూత్ మీ సినిమాకి తప్పకుండా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం ప్రేమతో నిండి ఉంది కాబట్టి. దాంతోపాటు మీ డాన్స్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తప్పకుండా ప్రేమికుడు రి రిలీజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!