Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయిపోయింది. అతని గత చిత్రాలు గని, గాందీవధారి అర్జున బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్న వరుణ్ తేజ్.. రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. 2019 పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ మరియు 2019 యొక్క ప్రతీకార బాలాకోట్ వైమానిక దాడుల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. నవదీప్, పరేష్ పహుజా, రుహానీ శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సోనీ పిక్చర్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ల పై రూ. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. కానీ ప్రేక్షకులను అంచనాలను ఈ చిత్రం ఏ మాత్రం అందుకోలేకపోయింది.
కనీసం మెగా ఫ్యాన్స్ ను కూడా వరుణ్ తేజ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. టాక్ అనుకూలంగా లేకపోవడం వల్ల ఆపరేషన్ వాలెంటైన్ కు బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో నెల తిరక్క ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఆపరేషన్ వాలెంటైన్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
థియేటర్స్ లో ఈ చిత్రానికి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాకపోవడంతో.. ఆలస్యం చేయకుండా ఓటీటీలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేశారట. మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ లో వరుణ్ తేజ్ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే కొన్ని చిత్రాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినా.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో హిట్ అవుతుంటాయి. మరి ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో దేశభక్తి ప్రధానంగా రూపుదిద్దుకున్న ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీలో ఏ మేరకు ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.