Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తే.. సత్యరాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ జూలై 1 న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను కూడా కంప్లీట్ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది.
సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉండబోతోంది. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ హవా ఏ రేంజ్‌లో పెరిగిందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. థియేటర్స్‌లో వచ్చిన ప్రతి సినిమా.. కొద్ది రోజుల గ్యాప్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో విడుదలైన ప్రతి సినిమా రెండు, మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు థియేటర్స్ వెళ్లడం మానేస్తున్నారు.
`పక్కా కమర్షియల్` విషయంలోనూ ఇదే అనుకున్నారా..? అయితే తాజాగా సినిమాను ఓటీటీలో చూద్దాంలే అనుకున్న వారికి మేకర్స్ బ్యాడ్ న్యూస్ తెలియజేశారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. `చాలామంది ఓటీటీలో పక్కా కమర్షియల్ ను చూద్దామని అనుకుంటున్నారేమో కానీ ఇప్పట్లో అది జరగదు. మా సినిమా అప్పుడే ఓటీటీలో రాదు. కాబట్టి అందరూ మా సినిమాను చూసి ఆశీర్వదిస్తే ఇంకా వచ్చే సినిమాలతో ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది. కరోనా తర్వాత సంక్షోభంలో కూరుకుపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. అందుకు అందరూ సపోర్ట్ చేయాలి` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో `పక్కా కమర్షియల్` ఇప్పట్లో ఓటీటీలోకి రాదని స్పష్టమైంది.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…