Paluke Bangaramayenaa April 10 2024 Episode 198: మన కళ్ళతో చూసేది ఏది నిజం కాదు స్వర మనసుపెట్టి ఒకసారి ఆలోచించు కాఫీ చాలా బాగుంది తాగు ఇది నచ్చకపోతే అమ్మ వాళ్ళని అడుగు నీకేం కావాలన్నా వాళ్ళు చేసి పెడతారు నాకు బయట పనుంది వెళ్లి వస్తాను అంటూ అభిషేక్ వెళ్ళిపోతాడు.అభి సర్మీరు తప్పు చేశారని నా మనసుకు అనిపించడం లేదు కానీ కళ్ళ ముందు సాక్షాలు కనపడుతుంటే ఏం చేయమంటారు అని స్వర బాధపడుతుంది కట్ చేస్తే, అభి ఎంతసేపైందిరా వచ్చి కాఫీ తాగుతావా అని యశోద అడుగుతుంది. వద్దమ్మా బయట తాగొచ్చాను అని అభిషేక్ అంటాడు. ఏంటి అభి నువ్వు చెప్పేది ఆర్య డ్రగ్స్ తీసుకోవడమేంట్రా అని బామ్మ అంటుంది. నిజంగా నాకు తెలియదు కానీ ఆర్య డ్రగ్ తీసుకున్నాడని కమిషనర్ ఫోన్ చేశాడు స్వరకి తెలియకుండా ఆర్యని కాపాడదని నేను వెళ్లాను
అక్కడికి వెళ్ళాక అందరిని పిల్లల్ని అరెస్టు చేశారు అక్కడ ఆర్య లేకపోవడంతో నేను మనసు కుదుటపరుచుకున్నాను కానీ అక్కడినుంచి ఆర్య పారిపోవడం చూసిన కానిస్టేబుల్ పారిపోతున్నాడని చెప్పడంతో నేను అతని వెంబడించాను తన కళ్ళలో భయం కంగారు చూసి ఆగురా నువ్వేమీ తప్పు చేయలేదు అన్నాను ఈ లోగా స్వర అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు ఇంతలో నాయుడు గారు ఎదురుగా ఉన్నాడు చీకట్లో ఒక అతను ఆర్యకి గన్ను గురి పెట్టాడు నేను ఆర్య ని ఎక్కడ కలుస్తాడు అని వాడికి గురి పెట్టాను వాడు నన్ను కాల్చాలి అనుకున్నాడా భార్యని కాల్చాలి అనుకున్నాడు తెలియదు కానీ ఈ లోగా గన్ను పేలింది వాడు కనిపించలేదు నా చేతిలో గన్ను ఉండిపోయింది డిపార్ట్మెంట్ అంతా నేనే కాల్చానా అని అపోహ పడుతున్నారు అని అభిషేక్ చెబుతాడు. అభి సర్ మా తమ్ముడు డ్రగ్స్ తీసుకోవడం మీరు చూశారా అని అడుగుతుంది స్వర. చూడలేదు స్వర కానీ వాడి కలలో భయం కంగారు చూస్తే నాకు అలాగే అనిపించింది అని అభిషేక్ అంటాడు. మా తమ్ముడు మత్తు తీసుకోలేదని డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ చూడండి నా తమ్ముడు
ఏమన్నాడో తెలుసా సార్ అభి సార్ నాన్నని ఎందుకు కలుస్తాడు అక్క ఆయనని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నాడు అది సార్ నమ్మకం అంటే మీరు మాత్రం మమ్మల్ని నమ్మడం లేదు అని స్వర బాధపడుతుంది. కట్ చేస్తే, అభిషేక్ అ రిపోర్టు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఈ రిపోర్ట్ నిజంగా ఆర్యవేనా లేదంటే మారిపోయిందా అని అడుగుతాడు.మా హాస్పిటల్ లో అలాంటివి జరగవు సార్ అని అతను చెప్పడంతో సర్ ఈ మచ్చ నాకు కెరియర్ మీద పడుతుందినా నిజాయితీని నిరూపించుకోవాలి మళ్లీ ఒకసారి టెస్ట్ చేయరా అని అభిషేక్ బ్రతిమిలాడడంతో డాక్టర్ సరేనని టెస్ట్ చేసి అంతా కరెక్ట్ గా నే ఉంది సార్ అని డాక్టర్ చెబుతాడు. సారీ సార్ నేను తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవాలని మీ సమయాన్ని వృధా చేశాను నన్ను క్షమించండి అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే,
అభి స్వర మీద కోపం తెప్పించడానికి నాకు ఒక ఐడియా వచ్చింది బంగారం అది బండి గాలి తీసేస్తే స్వర అలా చేసిందనుకొని కోప్పడతాడు తిట్టేస్తాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని రవీంద్ర అంటాడు. గాలి తీసేస్తే టైర్ ఎక్కడైనా పంచర్ అయింది అనుకుంటాడు కానీ స్వరతీసింది అని ఎందుకు అనుకుంటాడు అసలు నీ బుర్ర పని చేస్తుందా అని చందన అంటుంది. కట్ చేస్తే, చూడు స్వర ఈ కాఫీ చాలా బాగుంది తాగు అని అభిషేక్ అంటాడు. స్వర అభివంక కోపంగా చూస్తుంది. ఏంటి స్వర అంత పెద్ద కళ్ళేసుకుని చూస్తే భయపడి పోవాలా ఇలా బ్రతిమిలాడడం బుజ్జగించడం నా వల్ల కావట్లేదు నువ్వు తాగు స్వర అని అభిషేక్ అంటాడు. స్వర అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది, బామ్మ కీర్తి చెస్ ఆడుతూ ఉంటారు.
యశోద కూరగాయలు అనీ బయలుదేరుతుంది. యశోద ఎక్కడికి వెళ్తున్నావ్ అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది. కూరగాయలకు వెళుతున్నాను అత్తయ్య అని యశోద అంటుంది. యశోద నీ కొడుక్కి పెళ్లయింది నీ కోడలు ఉంది నువ్వు ఇంకా ఇలాంటి పనులు చేయడమేంటి వాళ్ళకి అప్పగించి వాళ్లే చేస్తారు లేదంటే కోడలు పిల్ల పని చేయట్లేదని చుట్టుపక్కల వాళ్ళు నా నా మాటలు అనుకుంటారు అవసరమా అని వాళ్ళ అత్తయ్య అంటుంది.
నిజమే అత్తయ్య స్వరని ఎవరు అపార్థం చేసుకోవడానికి వీల్లేదు అని యశోద అభి స్వర ని పిలుస్తుంది. ఏంటమ్మా అని అభిషేక్ అంటాడు. ఏమీ లేదురా మీరిద్దరూ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకురండి అని యశోద చెబుతోంది. అలాగే అమ్మ స్వర పద అలా జాలిగా కాసేపు కూరగాయలు తీసుకొని వద్దాం అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది