NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 29 2023 Episode 86: స్వరని పెళ్లి చేసుకో అన్నయ్య అంటున్న కీర్తి…

Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights

Paluke Bangaramayenaa November 29 2023 Episode 86:  ఎందుకు అలా చేశారు నీలకంఠం గారు అభి ఏం చేశాడని ఝాన్సీ అంటుంది. చూశావా నేను ఆరోజు చెప్తే మీరు ఏమీ కాదు పర్వాలేదు స్వరని రానీయండి అన్నారు కానీ ఈరోజు ఆ స్వరం వల్ల వాడి ఉద్యోగంకి మోసం వచ్చింది ఇదంతా మహాతల్లి మన ఇంటికి రావడం వల్లనే అని చందన అంటుంది. అక్క నువ్వు ఎందుకు స్వర ని అలా అంటున్నావ్ స్వర చాలా మంచిది అని కీర్తి అంటుంది. చూడండి అమ్మ ఇక మీదట ఆయన సార్ ని స్వార్థం చూసుకోమనండి లేదంటే అందరూ ఇలాగే చేస్తారు అని నీలకంఠం వెళ్లిపోతాడు.పాపం అభి తను ఇప్పుడు ఎంత డిస్టర్బ్ అయ్యాడో అని ఝాన్సీ అనుకుంటుంది. కట్ చేస్తే, కరుణ నాయుడుని అలాగే చూస్తూ కూర్చుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights

ఇంతలో వైజయంతి వచ్చి కరుణ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది మేడం మీతో ఫ్రెండ్లీగా మాట్లాడదామని అనుకుంటున్నాను అందుకే మీకు కాబోయే అల్లుడ్ని కూడా రమ్మని చెప్పాను అని కరుణ అంటుంది. ఎందుకు రమ్మన్నావు అని వైజయంతి అంటుంది. ఇంతలో విశాల్ వస్తాడు. నాయుడు గారు మందులో మీకు సోడా మిక్స్ చేయాలా అని అడుగుతుంది కరుణ. విశాల్ మరి నీకు అని కరుణ అడుగుతుంది. నాకు ఏదైనా ఓకే మేడం అని విశాల్ అంటాడు. వాళ్ళిద్దరికీ మందు కలిపి పోసి ఇస్తుంది కరుణ. మరి మీ వద్ద మేడం అని విశాల్ అంటాడు. మందు తాగే వాళ్లతో కూర్చోడం నాకు అలవాటు నేను తాగను,స్వర వెళ్లి ముగ్గురికి ఆమ్లెట్ వేసుకొని తీసుకురా అని కరుణ అంటుంది. ఇప్పుడు చెప్పండి నాయుడు గారు పార్టీ ఆఫీస్ లో ఏం జరిగింది మీరు ఇంతలా తాగి ఎందుకు పడిపోయారు అని కరుణ అడుగుతుంది. నేను ఆఫ్ బాటిలే తాగాను ఫుల్ బాటిల్ తాగలేదు అని నాయుడు సైగ చేసి చెప్తాడు.

Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights

ఆ బాటిల్ తాగితే మీరు పడిపోయే రకం కాదే మీరు మందు తాగి వచ్చినపుడు మీ పక్కన ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని అడుగుతుంది కరుణ. వైజయంతి గారు కొంచెం టెన్షన్ పడటం చూసి కరుణ ఓ మీ ముద్దుల భార్య గారు ఉన్నారా అని అంటుంది.అవును బావ తాగొచ్చాడు కింద పడిపోతాడేమో అని మా గదికి తీసుకెళ్దామని అనుకున్నాను కానీ నాకు ఎవరు సపోర్టు వద్దు అని బావ మెట్లు ఎక్కుతూ కింద పడిపోయాడు తర్వాత విశాల్ సహాయంతో హాస్పిటల్ లో జాయిన్ చేశానుఅని వైజయంతి అంటుంది. అంబులెన్స్ కదా మీరు ఫోన్ చేయాల్సింది విశాల్ కి ఎందుకు ఫోన్ చేశారు అని కరుణ అడుగుతుంది. ఏమో ఎందుకో విశాల్ కి ఫోన్ చేయాలనిపించింది విశాల్ వాళ్ళు మాకు కొంచెం దగ్గరగానే ఉంటారు అని వైజయంతి అంటుంది. నాయుడు గారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అంత ప్లాన్ వేసి ఆధారాలు లేకుండా చంపారు అంటే మీ రెండో భార్య చంపొచ్చు కదా మీకు కాబోయే అల్లుడు కూడా కావచ్చు కదా మీరేమీ కంగారు పడకండి జస్ట్ శాంపిల్ చెప్తున్నాను అంతే అని కరుణ అంటుంది. మొన్నటిదాకా వైజయంతి మీద నాకు కొంచెం డౌట్ ఉండేది కానీ మొన్న తను చేసిన పనికి అనుమానం లేదు అని నాయుడు తన మనసులో అనుకుంటాడు. మీరు మినిస్టర్ గారు సీసీ కెమెరాలు పెట్టారు, కానీ ఏం లాభం దొంగోడు వెనకనుంచి వచ్చిన ఆ కెమెరాలు పనిచేయవు అని కనిపెట్టి ఇంట్లోకి వచ్చి నీ భార్యని చంపేసి వెళ్ళాడు అని కరుణ అంటుంది.వామ్మో ఇది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకంగా ఉంది అని వైజయంతి అనుకుంటుంది..

Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights

ఆ వెనకనుంచి వచ్చి మీ అమ్మను చంపేసి వెళ్లిపోయాడు ఏం భయపడకు స్వరా మీ అమ్మ చావుకి కారణమైన రోజు రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూసి ఆరోజు ఎవరు మీ ఇంటికి వచ్చారు తెలుస్తుంది,అందర్నీ స్టేషన్లో పెట్టి ఎంక్వయిరీ చేసి నాలుగు తగిలిస్తే  దెబ్బకి హంతకుడు ఎవరో తెలిసిపోతుంది అని కరుణ అంటుంది. స్వర మీ నాన్నగారిని లోపలికి తీసుకువెళ్ళు అని కరుణ అంటుంది. రెండు రోజుల్లో మీ అత్తయ్య గారిని ఎవరు చంపారో నేను తెలుసుకుంటాను నువ్వెళ్ళు విశాల్ అని కరుణ అంటుంది. వైజయంతి గారు రేపు మనం కలుద్దాం అంటూ కరుణ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,అభి నువ్వు ఇలా డల్లుగా ఉంటే ఇంట్లో ఎవరు ఆనందంగా ఉండలేరు అని ఝాన్సీ అంటుంది. నన్ను ఆ కేసు నుంచి తప్పించారని బాధపడడం లేదు ఝాన్సీ ఎప్పుడు నువ్వు నేను స్వరకి అండగా ఉండి కాపాడే వాళ్ళము ఇప్పుడు స్వర ఒంటరిగా అయిపోయింది పాపం స్వరాకి కష్టాలు కన్నీళ్లు అన్ని ఒకేసారి చుట్టుముట్టాయి స్వర ఒక్కతే ఈ సమస్యలతో పోరాడి ఎలా బయటపడుతుందో అర్థం కావట్లేదు స్వర కోసం ఏమైనా చేయాల ని అనిపిస్తుంది కానీ ఏమి చేయాలో అర్థం కావట్లేదు అని అభిషేక్ అంటాడు. నీ ఆలోచన జాలి నాకు అర్థమైతుంది అభి కానీ ఏం చేయగలము, అవును నిన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అని ఝాన్సీ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights

ట్రాఫిక్ ఆఫీసర్ గా ట్రాన్స్ఫర్ చేశారు అని అభి అంటాడు. పర్వాలేదులే అభి నువ్వు ఎక్కడ ఉన్నా ని నిజాయితీని నిరూపించుకో గలవు ఏమి బాధపడకు అని ఝాన్సీ అంటుంది. ఇప్పుడు స్వరాన్ని వాళ్లు బలవంతంగా విశాల్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు అని అభిషేక్ అంటాడు. అన్నయ్య విశాల్ దుర్మార్గుడు అతనితో పెళ్లి జరగకూడదు  అంటే నువ్వు ఒక పని చేస్తావా, నువ్వు స్వర నీ పెళ్లి చేసుకోవాలి అని కీర్తి అంటుంది.కీర్తి నువ్వు చిన్నపిల్లవి పెళ్లి అంటే మాటలు కాదు నువ్వు వెళ్లి చదువుకో అని అభిషేక్ అంటాడు. ఝాన్సీ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. కీర్తి ఎందుకు ఇలా మాట్లాడింది అని అభిషేక్ అంటాడు. నువ్వు ఈ మధ్య స్వర మీద ఎక్కువ జాలి చూపిస్తున్న అభి చూసేవాళ్ళకి వేరే లాగా అర్థమవుతుంది

Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 29 2023 Episode 86 Highlights

అభి, మీ ఆఫీసులో కూడా మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అందరూ అనుకుంటున్నారు అంట కానిస్టేబుల్ చెప్పాడు మరి దీని గురించి ఏమంటావు అని ఝాన్సీ అంటుంది. వాళ్ళు ఏమైనా అనుకోని ఝాన్సీ నేను మాత్రం అలాంటి తప్పుడు ఉద్దేశంతో ఎప్పుడూ స్వరని చూడలేదు ఇదంతా వాళ్ళ పిన్ని కావాలని చేస్తుంది నా నిజాయితీ ఏంటో చూపిస్తాను అంటూ వెళ్ళిపోతాడు అభిషేక్. అభి ఏమనుకుంటాడో ఏమో నాకు తెలియదు కానీ నా మనసులో మాట మాత్రం చెప్పేయాలి అని ఝాన్సీ అనుకుంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella