NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: గౌతమ్ ప్రేమను తట్టుకోలేక ఆందోళనలో మల్లి…నాతో కలిసి కారులో వస్తావా అని మీరా మీద వసుంధర ఆగ్రహం!

Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights

Malli Nindu Jabili November 29 2023 Episode 507:  అలంకరణలో లోపాన్ని కనిపెట్టేసాను అని గౌతమ్ చెప్తాడు. ఏంటది అని మల్లి అడుగుతుంది. అంతా బానే ఉంది కానీ గాజులు మ్యాచ్ కాలేదు, నేను తీసుకొస్తాను అని గౌతమ్ అంటాడు. గౌతమ్ బీరువాలో నుండి గాజులు తీస్తుంటే మ్యాగజైన్ కింద పడుతుంది. అది చూసి గౌతమ్ కి కోపం వస్తుంది.గౌతమ్ మ్యాగజైన్ ని తీసుకొని, సాధారణంగానేను ప్రశాంతంగా ఉంటాను, కానీ నిన్నటి నుండి మ్యాగజైన్ కనబడుతుంటే భరించలేనంత కోపం వస్తుంది అని గౌతమంటాడు. ఆఫీసులో మీరే ఇంట్లో మీరే ఆఖరికి నా బెడ్ రూమ్ లో కూడా మీరే అని గౌతమంటాడు. నేను పెట్టలేదండి నీలిమా పెట్టి ఉంటుందేమో అని మల్లి అంటుంది. క్షమించండి చూసుకోలేదు అని చెప్తుంది మల్లి. మల్లి నీకు అరవింద్ ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు నువ్వు ఆశ్రయం పొంది ఉండొచ్చు, నీ బంధంలో తప్పు లేకపోయి ఉండొచ్చు కానీ మీ ఇద్దరినీ ఇలా పక్కపక్కన చూడడం నాకు నచ్చట్లేదు కాబట్టి నేను ఒక పని చేస్తాను మీ ఇద్దరిని వేరు చేస్తాను,కంగారు పడకు మల్లి మీ స్నేహం వేరు చేయను ఈ ఫోటోని వేరు చేస్తాను అని గౌతమ్ చింపేస్తాడు.

Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights
Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights

ఈ మధ్య నేను రెండు కుటుంబాలను రక్తసంబంధాలను కలిపే కాన్సెప్ట్ పెట్టుకున్నాను అందుకే స్వప్న విషయంలో అరవింద్ చేసిన తప్పుని పక్కన పెట్టాను లేదంటే అదే ధ్యాసగా బతుకుతుండేవాడిని అని ఆ మ్యాగజైన్ని చెత్త కుండీలో పడేస్తాడు.సరే అది వదిలేయ్ గాజులు తొడుగుతాను పద అని గాజులు తొడుగుతాడు గౌతమ్ .మల్లి చాలా సంతోషిస్తుంది. సరే వెళ్దాం పద అని ఇద్దరు కిందికి వెళ్తారు. ఫోటోలో అరవింద్ సార్ నా పక్కన ఉన్నందుకే దూరం చేశారు అలాంటిది మా విషయం తెలిస్తే అని మల్లి టెన్షన్ పడుతుంది. మీ ఇద్దరి అలా పైనుంచి దిగి వస్తుంటే కిరాక్ గా ఉన్నారు తెలుసా అంటుంది  నీలిమ.

Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights
Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights

అందరు కలిసి పూజ చేస్తారు. అమ్మ మనింట్లో ఏదైనా పూజ జరిగితే పంతులు గారిని పిలవకు అని గౌతమ్ అంటాడు. ఎందుకు గౌతం అని కౌసల్య అడుగుతుంది. నీలిమ పంతులుగారు లాగా అన్ని దగ్గర ఉండి చేస్తుంది కదా అని అంటాడు గౌతమ్.సరే గుడికి వెళ్దాం పదండి అని కౌసల్య అంటుంది. అమ్మ మీరు వెళ్ళండి మేము వెనకాల వస్తాము అని గౌతమ్ అంటాడు. ఎందుకు గౌతం అని కౌసల్య అడుగుతుంది.అమ్మ వాళ్ళిద్దరికి ప్రైవసీ కావాలంట ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఏం అర్థం చేసుకోరు అంటుంది నీలిమ. ఆదా సంగతి సరే పద నీలిమ మీరు జాగ్రత్తగా రండి గౌతమ్ అని అంటుంది కౌసల్య. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నామండి అని మల్లి అడుగుతుంది. చెప్పకూడదు సర్ప్రైస్ అని గౌతమంటాడు.

Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights Written Update
Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights Written Update

Malli NIndu Jabili Episode 506: వసుంధర మీద అనుమాన పడ్డ అరవింద్…

ఇంతకుముందు కూడా చెప్పానుకొన్ని వినడం కన్నా లైవ్ గా చూస్తేనే బాగుంటుంది అని గౌతం అంటాడు. మీ సర్ప్రైజ్ లో ఏం జరుగుతుందో ఊహించలేను అని అనుకుంటుంది. నేలకొండపల్లిలో ఎలాగో తప్పించుకున్నాను కానీ ఈరోజు ఏమవుతుంది అని అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ మల్లి అని గౌతమ్ అడుగుతాడు. సరే వెళ్దాం పద అని వెళ్తారు. కట్ చేస్తే,  మీరా నువ్వు మట్టిపిసుకునేదానివి అలాంటిది కార్ లో ఇలా తిరుగుతున్నావు, కాకి గంగలో మునిగినంత మాత్రాన హంస అయిపోదు అని వసుంధర అనుకుంటుంది. అమ్మ ఏమైంది అని మాలిని అంటుంది. ఇంతలో భద్ర వసుంధర కి ఫోన్ చేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ దొరికింది మేడం అని అంటాడు. అయితే  నేను ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడికి నువ్వు రా అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights
Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights

అరవింద్ కారాపు నేను దిగాలి అని వసుంధర అంటుంది. మధ్యలో కార్ ఆపి ఎక్కడికి వెళ్తావు అమ్మ అని మాలిని అడుగుతుంది. మా ఫ్రెండు అమెరికాకి వెళుతుంది రెండు సంవత్సరాల దాకా తిరిగి రాదట ఎయిర్పోర్ట్ కి వెళ్లి సెండాఫ్ ఇవ్వలేను మధ్యలోనైనా కలిసి మాట్లాడి వస్తాను అని వసుందర అంటుంది. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వేరే పని మీద  వెళ్తున్నాను అని చెప్పొచ్చు కదా అత్తయ్య అని అరవింద్ అంటాడు. నువ్వు అన్నట్టు చెప్పొచ్చు అరవింద్ కానీ అలా చెప్పితే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఎలా అవుతుంది అందుకే వెళ్తానంటున్నాను, గౌతమ్ పిలిచినందుకు అక్కడికి తప్పకుండా వస్తాను మీరు ఏమి టెన్షన్ పడకండి అని వసుందర అంటుంది.

Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights
Malli Nindu Jabili Today Episode November 29 2023 Episode 507 Highlights

అమ్మగారు నేను మీతో పాటు కారులో కూర్చొని వస్తున్నానని మీరు వెళ్ళిపోకండి నేను ఆటోలో వస్తాను మీరు వెళ్ళండి అని మీరా అంటుంది. అంత ఇబ్బంది ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చెప్పేదాన్ని నేనేదైనా సూటిగానే మాట్లాడుతాను మనసులో ఒకటి పెట్టుకొని నీలాగా పక్కన కూర్చోను గోతులు తవ్వే రకాన్ని కాదు నాకు అంత ఇబ్బంది ఏమీ లేదని చెప్పు మాలిని మీరు బయలుదేరండి అని వసుంధర అంటుంది.జాగ్రత్తగా వెళ్లి రండి మామ్ అని మాలిని వాళ్లు వెళ్లిపోతరు . నేను రాకుండా ఎక్కడికి వెళ్తాను అక్కడ జరగబోయే సంబరాలలో అనుభబ్ పేల్చేది నేనే కదా  అని వసుంధర అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N