Paluke Bangaramayenaa October 6th ఎపిసోడ్ 40: అన్నయ్య, ఈవినింగ్ షాపింగ్ కి వెళ్దాం స్కూల్ అయిపోగానే వెంటనే స్టేషన్ కి వస్తాను అని చెప్తుంది కీర్తి. అడ్డమైనవన్ని కొంటదేమో, కాస్త పద్ధతిగా ఉండేవి మన స్తోమతకి తగ్గట్టు తీసుకో అని చెప్తుంది వాళ్ళ నానమ్మ.పద్ధతి అంటే నీలాగా ముడుత చీరలు కట్టుకోవడమా కీర్తి అంటుంది. అత్తయ్య నేను చందన ఈరోజు మా పుట్టింటికి వెళ్లి వస్తాం అని చందన వాళ్ళ భర్త అంటాడు.

ఎవరైనా ఆడపిల్ల అత్తారింట్లో ఉండి అప్పుడప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్లాలనుకుంటుంది, కానీ నువ్వు మా ఇంట్లో ఉంటూ మీ అమ్మగారింటికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తున్నావ్ అని అంటుంది అభిషేక్ వాళ్ళ నానమ్మ. చందన వాళ్లు వెళ్లిపోతారు, వెళ్తానని చెప్తుంది, అభిషేక్ కూడా ఆఫీస్ కి వెళ్తాను అని అంటాడు, అభిషేక్ వాళ్ళ అమ్మ నాన్నమ్మ గుడికి వెళ్దాం అనుకుంటారు. అమ్మ వాళ్ళు మళ్ళీ ఆఫీస్ కి పంపిస్తారని అనుకోలేదు, అంత కృష్ణుడి దయ, అయ్యో ఆఫీస్ కి లేట్ అవుతుంది ఝాన్సీ మేడం ఏమనుకుంటారు, ఈశ్వర అనుకుంటుంటే, విశాల్ వచ్చి ఏంటి ఇక్కడ అని అడుగుతాడు, ఆఫీస్ కి వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తుంది స్వర.

సరే బండి ఎక్కు గుడికి వెళ్లి ఆ తర్వాత నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానని అంటాడు విశాల్. స్వర ఇంకా విశాల్ బైక్ మీద వెళ్ళిపోతారు. అభిషేక్ వాళ్ళ అమ్మ వాళ్ళు గుడికి వస్తారు. స్వామి అవి ఎవరో ఒక అమ్మాయి ని ప్రేమిస్తున్నాడు ఎవరు అని అడిగితే చెప్పకుండా దాచేస్తున్నాడు, ఆ అమ్మాయి త్వరగా కనిపించేలా చూడు స్వామి అని మొక్కుకుంటుంది. నా కోడలి వరాలకు దేవుడు మాయపోతాడేమో, అసలు దేవుడు అంటే పాజిటివ్ ఎనర్జీ అని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో అని అంటుంది అభిషేక్ వాళ్ళ నానమ్మ. స్వర ఇంకా విశాల్ గుడికి వస్తారు. ఇతను ఏదో అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఒకసారి ఏమో ఇతను అంత మంచివారు ఉండరా అనిపిస్తుంది కానీ ఇంకోసారి ఇతని లాగా సైకో ఉండరని అనిపిస్తుంది, ఝాన్సీ మేడం చెప్పినట్టు ఇతని గురించి తెలుసుకోవాలి, పెళ్లి తర్వాత కూడా జాబ్ చేయనిస్తాడో లేదో తెలుసుకోవాలి అని స్వర అనుకుంటుంది.

ఎంటి స్వర ఏదో ఆలోచిస్తుంది అని విశాల్ అనుకుంటాడు. ఇక మనం బయలుదేరుదామా గుడికి వస్తే నీకు టైం తెలియదు నాకు ఏం చేయాలో అర్థం కాదు అని అభిషేక్ వాళ్ళ నానమ్మ అంటుంది. సరే అత్తయ్య వెళ్దామని అభిషేక్ వాళ్ళ అమ్మ అంటుంది. వెళ్తుండగా, అభిషేక్ వాళ్ళ అమ్మ వాళ్లు స్వరని చూస్తారు. ఎవరు ఈ అబ్బాయి అని అడుగుతుంది అభిషేక్ వాళ్ళ నానమ్మ.బంగారం లాంటి అమ్మాయి ని ఇలాంటి అబ్బాయికి ముడి వేస్తున్నాడు దేవుడు అందుకే నాకు కోపం అని అభిషేక్ వాళ్ళ నానమ్మ అనుకుంటుంది.స్వర చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం మంచి చూసుకో అని అంటుంది అభిషేక్ వాళ్ళ అమ్మ. అసలు స్వరలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలు వస్తే చాలా బాగుండేది అనుకున్నాము అని అంటుంది అభిషేక్ వాళ్ళ నానమ్మ. ఆంటీ ఏం అనుకోకపోతే కొంచెం ప్రసాదం పెడతారా అని అడుగుతాడు. అనుకోకుండా ఎలా ఉంటాం ఆల్రెడీ చాలా అనుకున్నాం మనసులో అని అంటుంది అభిషేక్ వాళ్ళ నానమ్మ.

ఇంక మేము బయలుదేరుతాం పద యశోద అని అంటుంది అభిషేక్ వాళ్ళ నానమ్మ. వెళ్దాం పద అని విశాలంటాడు.నేను కోరుకునేది ఒకటే స్వామి, మా నాన్నతో ప్రేమగా ఉండాలి, ఎవరితో అతను జీవితం బాగుంటుందో వారితో నే నా జీవితాన్ని మూడి వేయి అని కోరుకుంటుంది స్వర. కొంచెం సేపు అలా ప్రశాంతంగా కూర్చొని వెళ్దాం అని అంటాడు విశాల్. ఆఫీస్ కి లేట్ అవుతుంది అని అంటుంది స్వర. పది నిమిషాలు లేటుగా వెళ్తే ఏం కాదు పద అని అంటాడు విశాల్. స్వర దేవుని ఏం కోరుకున్నావు అని అడుగుతాడు విశాల్. నీకు అభిషేక్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా తెలుసు అని అడుగుతాడు. నీలాంటి అమ్మాయి కూడా రావాలని అసలు అనుకోరు, నీ గురించి చాలా తెలిసుంటేనే అలా అనుకుంటారు కదా, అంటే నువ్వు వాళ్ళకి చాలా క్లోజ్ అన్నమాట, అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తుంటావు అప్పుడు అభిని కూడా చూడొచ్చు కదా, ఏమైంది నోటు వెంట సమాధానం రావడం లేదు అని అంటాడు విశాల్.

ఏంటి అలా చూస్తున్నావ్ నేను నిన్ను అనుమానిస్తున్నాను అనుకుంటున్నావు కదా అస్సలు కాదు నేను నిన్ను పెళ్లి చేసుకునే వాడిని ఏవైనా విషయాలు పెళ్లి తర్వాత తెలిస్తే బాగోదు అందుకే ముందే తెలుసుకుంటే నాకు క్లారిటీ ఉంటుంది కదా, స్వర కి ఎవరంటే ఇష్టం ఎవరికీ ఎవరు బాగా క్లోజ్ అని అందుకే అడుగుతున్నాను,ఏం ఆలోచిస్తున్నావ్ ఏం చెప్పాలి అనా లేదా వీడికి చెప్పేది ఏంటి అనా అని అంటాడు విశాల్. నేను వాళ్ళ కుటుంబాన్ని ఒక్కసారే కలిసాను చాలా మంచి వాళ్ళు మళ్లీ ఇంకెప్పుడు కలవలేదు అని అంటుంది స్వర. నాకు ఎవరైనా అబద్ధం ఆడితే నచ్చదు నువ్వు ఆడితే అస్సలు నచ్చదు అని అంటాడు విశాల్. అబద్ధం ఏం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను అంటుంది స్వర.