పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.
అయితే ఈ చిత్రం ఏ ముహూర్తాన ప్రారంభం అయ్యిందో గానీ.. అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. త్వరలో స్టార్ట్ చేయబోయే కొత్త షెడ్యూల్ కు ప్రస్తుతం వర్క్ షాప్స్ జరుగుతున్నాయి.
ఇందులో పవన్ కూడా పాల్గొంటున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేసిన కీరవాణి.. `నవరాత్రులలో నవ ఉత్తేజం` అంటూ పోస్ట్ పెట్టారు. వారి పక్కన ఉన్న బ్యానర్ లో హరిహర వీరమల్లు -షెడ్యూల్ వర్క్‌షాప్ అని రాసి ఉంది. అంటే షూటింగ్ కి వెళ్లబోయే ముందు చేసే రిహార్సల్స్ అన్నమాట.
దీంతో కీరవాణి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆయన షేర్ చేసిన పిక్‌లో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. గత కొంత కాలం నుంచి ఎక్కడ కనిపించినా కుర్తాలోనే దర్శనమిస్తున్న పవన్.. తాజా పిక్‌లో మాత్రం రెడ్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
https://twitter.com/mmkeeravaani/status/1575716279272366080?s=20&t=lQzxUVXDVsSRKq47srBiCA
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!