Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుంటే.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో ప్రభాస్ `ప్రాజెక్ట్-కె` టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. హైదరాబాద్ లోని హోటల్ సితారలో ప్రభాస్ పార్టీ ఏర్పాటు చేయగా.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సైతం హాజరయ్యారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ఈయన చేతిలో `ఆదిపురుష్`, `సలార్`, `స్పిరిట్` చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. సలార్ సెట్స్ మీదే ఉంది. ఇక స్పిరిట్ ఈ ఏడాది ఆఖరిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
#Prabhas with the #ProjectK Team 😍💥 pic.twitter.com/OtyR32mMqu
— Prabhas Fanism ™ (@PrabhasFanism) June 25, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!