NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 6 2024 Episode 1171: ఈ మండపంలో ఎవరిదో ఒక్కరిదే పెళ్లి జరగాలి అంటున్న దివ్య, మా పెళ్లి జరుగుతుంది అంటున్న ఆర్య..

Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights

Prema Entha Madhuram February 6 2024 Episode 1171: అన్నయ్య ఏమయ్యాడు ఎక్కడున్నాడు చెప్పండి సార్ అని ఉషా అంటుంది. అరే ఉష  ఏం మాట్లాడుతున్నావ్ ఈయనే మి సూర్య అన్నయ్య అని యాదగిరి అంటాడు. చూడు ఉష నేను ఎక్కడికి మీ అన్నయ్య స్థానంలో ఎందుకు వచ్చానో వేరే కారణం ఉంది మీ అన్నయ్య దుబాయ్ లోనే ఉన్నాడు క్షేమంగానే ఉన్నాడు త్వరలోనే తిరిగి వస్తాడు నేను ఏం చేసినా మంచే చేస్తానని నీకు నమ్మకం ఉంటే అమ్మకు ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని ఆర్య అంటాడు. సరే సార్ అని ఉష అంటుంది. సార్ ఏంటమ్మా అన్నయ్య అను ఈ ప్రపంచానికి ఆర్య వర్ధన్ కావచ్చు మీకు మాత్రం అన్నయ్యని అని ఆర్య అంటాడు. సరే అన్నయ్య అని ఉష అంటుంది ఉషా పెళ్లి మొహం కడుక్కోండి రా పో ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అని యాదగిరి అంటాడు. సారీ ఉష మీ అన్నయ్యని తీసుకురాలేను కానీ మీ అన్నయ్య వస్తాడని మిమ్మల్ని నమ్మించి బ్రతికించగలను అని ఆర్య మనసులో అనుకుంటాడు.

Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights
Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights

కట్ చేస్తే, నీరజ్ ల్యాబ్  ఫోటో తీసి ఆర్య కి మెసేజ్ పెడతాడు. టైం లేదు నీరజ్ పెళ్లి పీటల మీద కూర్చున్నాం త్వరగా కానివ్వండి అని మెసేజ్ పెడతాడు.కెనడి ఫాస్ట్ వన్ అవర్ కంటే ఎక్కువ టైం లేదు త్వరగా కానీ అని నీరజ్ కెనడిని తొందర పెడతాడు. అక్కడే పని చేస్తున్న మానస వాళ్ళ మనిషి నెట్వర్క్ కట్ చేస్తాడు. లాప్టాప్ పనిచేయడం లేదు అని కెనడి అంటాడు. ఐ యాం సారీ సార్ అని కెనడి అంటాడు. ఇ0తలో మానస వాళ్ళ మనిషి మనసుకి ఫోన్ చేసి నెట్వర్క్ పనిచేయకుండా చేశాను మేడం ఇక పిక్చర్ రాదు అని చెప్తాడు. ఓకే పెళ్లి ఆగిపోవడం ఇక మన పోస్ట్మాన్ చూసుకుంటాడు అని ఛాయా మానస సంతోష పడుతూ ఉంటారు. ఆర్య వర్ధన్ పీటల మీద కూర్చుంటాడు. అను కూడా పీటల మీద కూర్చుని ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. హరీష్ ఛాయా వాళ్ళకి సెగ చేస్తూ ఉండగా ఆర్య వర్ధన్ కనపడతాడు. దివ్య ఇక్కడ మన పెళ్లి మాత్రమే జరగాలని చెప్పాను కదా గొడవ చేస్తానన్నావ్ ఏంటి సైలెంట్ గా ఉన్నావ్ అని హరీష్ అంటాడు. గదిలో గోల చేస్తే అమ్మ నాకు సర్ది చెప్తుంది అందుకని నలుగురిలో గొడవ చేస్తాను అని దివ్య అంటుంది. హరీష్ మనం పెళ్లి చేసుకోవట్లేదు లే పైకి అని దివ్య అంటుంది. దివ్య నీకు మతుండే మాట్లాడుతున్నావా అని సుగుణ అంటుంది. దివ్య ఏంటి పెళ్లి పీటల మీద గొడవ ఇప్పుడేం జరిగింది అని జ్యోతి అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights
Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights

అవమానం జరిగింది ఈ పెళ్లి మొదలైనప్పటి నుంచి అన్ని అవమానాలు ఇక్కడ ఎవరు పెళ్లి ముఖ్యం కొత్తగ పెళ్లి మొదలైన మా అక్క సగం జీవితం అయిపోయిన వీళ్ళక అని దివ్య అంటుంది. ఇప్పుడు నీకు ఏమైందని ధూమ్ ధామ్ గా పెళ్లి చేస్తుంటే అలా అరుస్తున్నావ్ అని యాదగిరి అంటాడు. ధూమ్ ధామ్ అని ఎవరు పెళ్లి చేస్తున్నారు వీళ్ళ పెళ్లి చేస్తున్నారు ఏదో మా పెళ్లి వాళ్లతో పాటు జరిపిస్తున్నారు అని దివ్య అంటుంది. నాకు నా భర్తకి పెళ్లి జంటన్న గుర్తింపు లేదు ఎవరు వచ్చినా వాళ్లకే పలకరింపులు వాళ్లకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు అని దివ్య అంటుంది. ఈ రెండు పెళ్లిళ్లు జరపాలనే కదా ఇన్ని రోజులు పనులను చేసుకుంన0 ఇప్పుడు పెళ్లి మండపంలో ఈ గొడవేంటే అని సుగుణ అంటుంది. ఈ పెళ్లి మండపంలో వాళ్ల పెళ్లి అయినా జరగాలి మా పెళ్లి అయినా జరగాలి అంతే అని దివ్య తెగేసి చెబుతుంది. దివ్య అని చెయ్యలేపి సుగుణ  కళ్ళు తిరిగే కింద పడిపోతుంది. అమ్మ ఏమైంది అని జ్యోతిని వెళ్లి నీళ్లు తీసుకు రమ్మంటాడు ఆర్య. జ్యోతి వెళ్లి నీళ్లు తీసుకువస్తుంది సుగుణ మొహం మీద నీళ్లు కొట్టి అమ్మ మంచినీళ్లు తాగు అని ఆర్య మంచినీళ్లు తాపిస్తాడు. నీవల్ల ఏం జరిగిందో చూడు ప్రతిదానికి లొల్లి చేస్తావ్ ఏంటి అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights
Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights

తనని ఏమీ అనకండి తనకు బాధనిపించి అలా మాట్లాడింది అని హరీష్ అంటాడు. ఇక్కడ మా పెళ్లి జరగట్లేదని మా బంధువులు వెళ్లిపోతున్నారు అని హరీష్ అంటాడు. అదేంటి అలా అంటావ్ నీకు మర్యాద ఏం తక్కువయింది అని యాదగిరి అంటాడు. దివ్య అలా ఎందుకే మాట్లాడతారు అని సుగుణ అంటుంది. నువ్వేమన్నా అనుకో అమ్మ ఇక్కడ పెళ్లి మాత్రం ఎవరిదో ఒక్కరిదే జరగాలి అని దివ్య అంటుంది. అయితే మీరు వెంటనే పెళ్లి మండపం దిగి వెళ్లిపోండి అని ఆర్య అంటాడు. ఇక్కడ మా పెళ్లి మాత్రమే జరుగుతుంది అని ఆర్య అంటాడు. బావ ఆలోచించుకో తొందర పడకు అని యాదగిరి అంటాడు. అన్ని ఆలోచించుకునే మాట్లాడుతున్నాను యాదగిరి మా పెళ్లి అయిపోయిన తర్వాత డబ్బులు సమకూర్చుకొని నేనే పెళ్లి దగ్గర ఉండి ఘనంగా జరిపిస్తాను ఇప్పుడు బయలుదేరండి అని ఆర్య అంటాడు. ఇప్పుడు పెళ్లి ఆర్య క్యాన్సిల్ చేసుకుంటాడనుకుంటే వాళ్ళని వెళ్లిపొమ్మంటున్నాడు ఏంటి అని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights
Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights

ఇప్పుడు ఏం చేయాలి మొదటికే మోసం వచ్చేలా ఉంది అని ఆలోచించి బావగారు ఇప్పుడేమైంది దివ్య కోపంలో అలా అనేసింది అని హరీష్ అంటాడు. నువ్వు కూడా దివ్య కి  సపోర్ట్ చేసే మాట్లాడవు కదా హరీష్ మీ వాళ్లలో ఎవరికైనా మా పెళ్లి చూడాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు లేదంటే భోజనం చేసి వెళ్ళిపోవచ్చు అని ఆర్య అంటాడు. దివ్య నువ్వు కోపం తగ్గించుకోకపోతే మన పెళ్లి ఆగిపోయేలా ఉంది మీ అమ్మతో ప్రేమగా మాట్లాడు అని హరీష్ అంటాడు. అమ్మ ఏదో పెళ్లి ఆపేయమంటే నిజంగానే పెళ్లి ఆపేస్తావా నా మీద ప్రేమ లేదా అని దివ్య ఏడవడం మొదలు పెడుతుంది.

Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights
Prema Entha Madhuram Today Episode February 6 2024 Episode 1171 Highlights

చేసిన రచ్చంత చేసి మల్ల ఈ డ్రామా ఏంటి పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకుంటావా వీళ్ళ పెళ్లి చూసి భోజనం చేసి వెళ్ళిపోతావా అని యాదగిరి అంటాడు. మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అని దివ్య అంటుంది. సూర్య దాని మాటలు పట్టించుకోకు నాన్న రెండు పెళ్లిళ్లు సవ్యంగా జరగనివ్వు అని సుగుణ అంటుంది. సరే అని ఆర్య తల ఊపుతాడు. ఈ గొడవ వల్ల సార్ పెళ్లి ఆపోవచ్చు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అను టెన్షన్ పడుతుంది. సుగుణమ్మ గారు జరిగింది ఏందో జరిగిపోయింది పెళ్లి జరిపించండి అని పంతులుగారు అంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella