NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 15 2024 Episode 1152: ఇద్దరు పిల్లల తల్లికి పెళ్లి ఏంటి అని కోపంతో రగిలిపోతున్న దివ్య..

Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights

Prema Entha Madhuram January 15 2024 Episode 1152: అంజలి అక్క వీళ్లంతా మా ఫ్యామిలీ అని అక్కి వాళ్లకి అందరినీ పరిచయం చేస్తుంది. తనే మా నాన్న అని ఆర్య ని తీసుకువచ్చి చూపెడుతుంది. అవును అన్ని మా నాన్నే ఇకనుంచి మాకు ఎవ్రీథింగ్ అని అభాయ్ అంటాడు. మా ఫ్రెండ్ నాన్న కాబోతున్నాడు అని అక్కి చెప్తుంది. అయితే మేము కూడా ఫ్రెండ్ అని పిలుస్తాం అని అంజలి అంటుంది.పిల్లల ముగ్గురిని కూడా అక్కి పరిచయం చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఆర్య కి చెప్తారు. అక్కి అభాయ్ అనుని తీసుకువచ్చి తినే మా అమ్మ మేమంటే ప్రాణం మేము లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు అని చెప్తారు. పిల్లలు మీ అమ్మానాన్నను కూడా తీసుకురావాల్సింది కదా మీరు మాత్రమే వచ్చారు ఏంటి అని సుగుణ అంటుంది. ఆ మాట వినగానే పిల్లలు ముగ్గురు ఏడుస్తారు.ఏమైంది పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని ఉష అడుగుతుంది. అంజలి వాళ్ళ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని ఆకాంక్ష చెప్తుంది.

Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights
Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights

పిల్లలు మీ అమ్మ లేదని ఎందుకు బాధపడతారు మీ అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది మీ బాధను తీసేసి చూడండి మీ అమ్మ అందరిలో కనపడుతుంది అని అను చెప్తుంది. వాళ్లు ఆనందపడిపోయి అనుని అమ్మ అని పిలుస్తారు. అయితే మీ నాన్నకు కూడా పెళ్లి చేద్దాం లే అమ్మ అని సుగుణ అంటుంది. మా నాన్నకి మా అమ్మంటే చాలా ఇష్టం మా నాన్న ఒప్పుకోడు మా అమ్మ ప్లేస్ లో ఇంకెవరిని ఊహించుకోడు అని ఆకాష్ అంటాడు.అవును ఒకరి కి మనసు ఇచ్చేసి తన జీవితం అనుకున్న తర్వాత మళ్లీ ఇంకొకరిని తన జీవితంలో ఊహించుకోలేరు అని ఆర్య అంటాడు.అలా ఎందుకు అనుకుంటావ్ సూర్య ఆడది మగవాడు లేకపోతే బ్రతక గలుగుతుంది కానీ మగవాడు మాత్రం ఆడది లేకపోతే కృంగిపోతాడు అందుకే తనుకు తోడు అవసరం పిల్లలను చూసుకోవడానికి ఎలాగైనా వాళ్ళకి అమ్మ కావాలి కదా తనకు కూడా తోడు ఉంటేనే కదా ధైర్యంగా ఉంటాడు లేదంటే మనిషి ఎప్పుడు నిరాశతో బాధపడుతూ ఉంటాడు అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights
Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights

అయితే మా నాన్నకి తోడు అవసరం అంటారా అని అంజలి అంటుంది. అవును బాబు మగవాడికి ఆడదాని తోడు చాలా అవసరం మీ నాన్నకి మళ్ళీ పెళ్లి చేద్దాంలే మీ అమ్మ లాంటి మంచి అమ్మాయిని చూసి అని సుగుణ అంటుంది. అది జరుగుతుందంటావా గ్రాండ్ మ్మ అని ఆనంద్ అంటాడు. ఎందుకు జరగదు మీ నాన్న ఒప్పుకోకపోతే మా నాన్న వచ్చి ఒప్పిస్తాడులే అన్నయ్య అప్పుడు తప్పకుండా ఒప్పుకుంటాడు మికు అమ్మ దొరుకుతుంది అప్పుడు వాళ్ళకి పెళ్లి చేద్దాం అని ఆకాంక్ష అంటుంది. ఆ పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం కాని ఇప్పుడు ఈ పెళ్లిలో అందరం బాగాఎంజాయ్ చేయాలి పిల్లలు ఫంక్షన్ హాల్  అంత అదిరిపోవాలి అని యాదగిరి అంటాడు.అలా అంటే కుదరదు టీం లాగా విడిపోయి పోటీ పెట్టుకుందాం అని అంజలి అంటుంది.అయితే మేము నాన్న పార్టీ అని అభాయ్ అక్కి అంటారు. అయితే మేము అమ్మ పార్టీ అని అంజలి ఆకాష్ ఆనంద్ అంటారు. అయితే చాలెంజ్ చూసుకుందాం అనే పిల్లలు అనుకుంటారు.ఎలాగైనా వీళ్ళ నాన్నని వెతికి తీద్దామని ఆలోచనలో నేను ఉంటే పిల్లలు రోజురోజుకీ నామీద ఆశ పెంచేసుకుంటున్నారు ఇక లేట్ చేయకూడదు అని ఆర్య అనుకుంటాడు.

Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights
Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights

ఈ పెళ్లి వాళ్ళ సార్ కి ఏమైనా ప్రమాదం జరుగుతుందో ఏమో అని అను టెన్షన్ పడుతుంది. ఇంతమంది ఆనందిస్తున్నారు అంటే ఈ పెళ్లి జరగడమే మంచిదేమో ఈ పెళ్లి తోటి అయినా అను మేడం సార్ కలిస్తే ఆనందిస్తాను ఇక మీదట నుంచి ఈ పని నాది అని యాదగిరి అనుకుంటాడు.మరి నేనెవరి పార్టీ అని ఉష అంటుంది.ఈ పెళ్లి నాది కూడా నువ్వు నా పక్కనే ఉండు అయినా పెళ్లయి వాళ్ళకి  ఇద్దరు పిల్లలు ఉన్నా తల్లికి మళ్లీ పెళ్లి ఏంటి అని పక్క వీధి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు అయినా ఈ పెళ్లి మా పెళ్లి తో జరిపించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు నా పరువు పోవడానికి కాకపోతే అని దివ్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, హరీష్ మనం ఈ పెళ్లిలో చాలా అందంగా కనిపించాలి ఇంకెవరు కనపడకూడదు నేను నువ్వు సేమ్ డ్రెస్ వేసుకుని రావాలి అని దివ్య హరీష్ కి ఫోన్ చేసి చెప్తుంది. అలాగే దివ్య అని హరీష్ అంటాడు. ఇంతలో ఉషా వెళ్లి అనుని ఈ చీర కట్టుకో వదిన నువ్వు అన్నయ్య చాలా అందంగా కనపడతారు చూడముచ్చటైన జంట అని అందరూ మెచ్చుకుంటారు అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights
Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights

ఉష ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అని ఏంటే నువ్వు చేస్తున్న పని ఇంకా పెళ్లిజరగలేదు వరుసలు కలిపి మాట్లాడుతున్నావానేను మీ బావ ఫంక్షన్ హాల్లో చాలా అందంగా కనపడాలని అనుకుంటున్నాము నువ్వు ఈవిడకి చీర తెచ్చి ఇచ్చి అందంగా రెడీ అవ్వమని చెప్తావా ఇద్దరు పిల్లల తల్లికి ఇంత డెకరేషన్ అవసరమా అని దివ్య కోపంగా వెళ్ళిపోతుంది.కట్ చేస్తే, పిల్లలు ఆడుకుంటూ దివ్యకి అక్కి తగులుతుంది. దానితో దివ్య ఫోన్ కిందపడి పగిలిపోతుంది కోపంతో రగిలిపోతున్న దివ్య అక్కిని లాగి పెట్టి చంప మీద ఒకటిస్తుంది.సుగుణ పరిగెత్తుకొచ్చి దివ్యని కొడుతుంది.అమ్మ నువ్వు నన్ను కొట్టడం ఏంటి అని దివ్య అంటుంది.నోరు ముయ్యి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను చిన్న పిల్ల తెలియక చేస్తే తనమీద చేయి చేసుకుంటావా అసలు నీకు బుద్ధుందా అని సుగుణ అంటుంది. వాళ్లు చిన్నపిల్లల కావాలనే నేను అందంగా కనిపించకూడదని ఇలా చేశారు నా ఫోన్ పగలగొట్టారు అని దివ్య అంటుంది.దివ్య తనేదో ఆడుకుంటూ తెలియక చేసింది దానికి నువ్వు పిల్లల ని తప్పుగా అర్థం చేసుకుంటావు ఏంటి అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights
Prema Entha Madhuram Today Episode January 15 2024 Episode 1152 Highlights

ఓహో ఇంకా పెళ్లి కాలేదు నువ్వే వాళ్ళ కన్న తండ్రివి అయిపోయినట్టు వెనకేసుకొస్తున్నావ్ ఏంటి అని దివ్య అంటుంది.ఇదిగో దివ్య అసలు ఏం మాట్లాడుతున్నావ్ ఎవరితో మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడు అని యాదగిరి అంటాడు.ఇంకా పెళ్లి కాలేదు కానీ అందరిని బాగానే మేనేజ్ చేసి నీ వెనక తిప్పుకుంటున్నావు కొత్త పెళ్లి కూతుర్ని చూడకుండా నన్ను కొట్టి అవమానిస్తారా అసలు పెళ్లి నాకేనా ఇదంతా చూస్తుంటే నా పెళ్ళిల అనిపించడం లేదు నీ పెళ్లి సంబరంలా ఉంది అని దివ్య కోపంగా వెళ్ళిపోతుంది. సూర్య తన మాటలు ఏం పట్టించుకోకు నాన్న అని సుగుణ అంటుంది. యాదగిరి అక్కి బాధపడుతుందేమో తనను వెళ్లి చూడు అని అంటాడు..కట్ చేస్తే,అక్కి దివ్య అన్నమాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella