NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 27 2023 Episode 1110: పిల్లలని అడ్డు పెట్టుకొని జలంధర్ ఆర్యను ఎం చేస్తాడు?…

Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights

Prema Entha Madhuram November 27 2023 Episode 1110: నీకు నీ కూతురు అవసరం లేదా పేపర్లు చింపేస్తున్నావ్ ఆ పేపర్ మీద సంతకం పెట్టకపోతే నీ కూతురు చస్తుంది అని రౌడీ అంటాడు. అను కోపంతో రగిలిపోతు ఆ రౌడీ మీద పడి చితకొట్టి తరిమేస్తుంది.అమ్మను రౌడీలను అలా కొడితే అక్కికి ప్రాబ్లం అవుతుందమ్మ ఆలోచించి పని చేయాలి అక్కకి ఏమన్న అయితే ఏం చేస్తావ్ అని సుగుణ అంటుంది. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ల దగ్గరికి వెళ్లి తేల్చుకుంటాను అని అను కోపంగా వెళ్ళిపోతుంది.కట్ చేస్తే, మనo ఇచ్చిన షాక్ కి అను భయపడిపోయి సుగుణ చేత ఈపాటికి సంతకం పెట్టి తీసుకువస్తూ ఉంటుంది అని ఛాయా అంటుంది. ఇంతలో అను అక్కడికి వస్తుంది. ఏంటి అను ఇలా వచ్చావు సంతకం పెట్టించావా అని ఛాయా అంటుంది. ఏంటి పెట్టించేది నా కూతురు నాకు ఇవ్వండి లేదంటే మిమ్మల్ని చంపడానికైనా వెనకాడను అని అను అంటుంది.  నువ్వు చంపేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటాం మరి మాకు చేతులు లేవా అని ఛాయా అంటుంది. చూడండి  నా గురించి నా భర్త గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఆయన తలుచుకుంటే మిమ్మల్ని ఊచలు  లెక్క పెట్టించగలడు అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights
Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights

ఆర్యకి అంత ధైర్యం ఉందని మాకు తెలుసు అను కానీ ఇప్పుడు ఆర్య కూడా చచ్చిన పాముతో సమానం ఎందుకు అంటే అక్కి మా దగ్గర ఉంది కాబట్టి మర్యాదగా వెళ్లి సుగుణతో సంతకం పెట్టించి తీసుకొని రా అని మానస అంటుంది. చూడండి మీరు మాటలతో చెప్తే వినేలా లేరు నా కూతురిని నాకు ఇవ్వకపోతే నేను ఎంతకైనా తెగిస్తాను మిమ్మల్ని చంపి జైలుకైనా సరే వెళ్తాను అని అను అంటుంది.ఇంతలో జలంధర్ ఛాయాకి ఫోన్ చేస్తాడు. నా కూతురు ఎక్కడా అని అడుగుతున్నావు కదా ఇదిగో చూడు అని వీడియో కాల్  చేసి చూపెడుతుంది ఛాయా అనుకి. అక్కిని చూసిన అను నా కూతురుని ఏమి చేయకు జలంధర్ ఏదైనా పగ ఉంది అంటే అది నాకు నీకు మధ్య మాత్రమే పిల్లల జోలికి ఎందుకు వస్తావు అని అను అంటుంది. నీ కూతురు కావాలి అంటే ఆ ల్యాండ్ నాకు కావాలి దాని మీద సంతకం పెట్టి తెచ్చివ్వు నీ కూతురు  క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది అని జలంధర్ అంటాడు. అది వాళ్లు కష్టపడి కడుపు చంపుకొని సంపాదించుకున్న స్థలం ఆ స్థలాన్ని అడగడం న్యాయం కాదు జలంధర్ అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights
Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights

అయితే నీ కూతురు మీద ఆశ వదిలేసుకో బాయ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు జలంధర్. అంకుల్ నాకు భయమేస్తుంది అంకుల్ నన్ను ఇంటికి పంపించేయండి అంకుల్ అని ఏడుస్తుంది అక్కి. నాకు ఆ స్థలం కావాలి ఇస్తావా అని జలంధర్ కోపంగా అక్కి మిది అరుస్తాడు. భయపడిపోయిన అక్కి అంకుల్ మీకేం కావాలో చెప్పండి మా అమ్మతో చెప్పి మీకు ఇప్పిస్తాను అని అక్కి అంటుంది.నీకున్న పరిజ్ఞానం మీ పెద్ద వాళ్లకు లేదే, నువ్వు చిన్న పిల్లవి అయినా బాగా అర్థం చేసుకున్నావమ్మా కానీ నన్ను అర్థం చేసుకొని  ఇంటికి పంపించేస్తే ఆ స్థలం నాకు రాదు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి మాకు కోపరేట్ చెయ్ నీకు బోలెడన్ని చాక్లెట్ కొనిపెడతాను మీ అమ్మ ఆ ల్యాండ్ తీసుకురాగానే నేను ఇంటికి జాగ్రత్తగా పంపిస్తాను అని జలంధర్ అంటాడు. అక్కి మాత్రం అలాగే ఏడుస్తూ అంకుల్ మా అమ్మని చూడాలనిపిస్తుంది నన్ను వదిలేయండి అంకుల్ అని ఏడుస్తుంది అక్కి. అరవద్దని చెప్పాను కదా అరిచావంటే ఇప్పుడే షూట్ చేసి పారేస్తాను అని జలంధర్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights
Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights

కట్ చేస్తే, జెండి సిగ్నల్ దగ్గర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారా ఏ క్షణాల ఎప్పుడైనా అటు నుంచి జలంధర్ వాళ్ళు రావచ్చు అలాగే జలంధర్ ఫోను సిగ్నల్ ఎక్కడ చూపెడుతుందో చెక్ చెయ్ అని అంటాడు ఆర్య.అలాగే ఆర్య మన వాళ్ళతో నేను కూడా అక్కడే ఉంటాను అని జెండి అంటాడు. రేయ్ ఆర్య వర్ధన్ చాలా తెలివిగలవాడు మన ఫోన్ సిగ్నల్ బట్టి కూడా మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటాడు వాడు ఇక్కడికి రాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి అని జలంధర్ అంటాడు. ఇంతలో ఆర్య అక్కడికి వస్తాడు. ఆర్య ని చూసినా రౌడీ కర్ర చేత పట్టుకొని ఆర్య మీదికి వెళ్తాడు. ఆర్య వాళ్లని చిత్తకోటి పారేస్తాడు. ఒక్కసారిగా ఐదుగురు ఆర్య ని చుట్టుముట్టి తల ఒక దెబ్బ కొడితే కింద పడిపోతాడు ఆర్య. ఆర్య చనిపోయాడు అనుకోని రౌడీ జలంధర్ కి ఫోన్ చేసి గురుడు అయిపోయాడు సార్ అని అంటాడు. ఒరేయ్ సరిగ్గా చూసావా లేదా అక్కడ ఉన్నది ఎవరనుకున్నావు రా ఆర్య వర్ధన్ అంత తేలిగ్గా చావడ్రా మళ్ళీ ఒకసారి చూడండి ఉన్నాడా పోయాడా అని జలంధర్ అంటాడు. అన్నా నువ్వు నమ్మట్లేదు కదా వాడి ఆఖరి శ్వాసను వినిపిస్తాను అని ఫోను తన నోటి దగ్గర పెడతాడు.

Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights
Prema Entha Madhuram Today Episode November 27 2023 Episode 1110 Highlights

రేయ్ నా చిరకాల శత్రువు చనిపోయాడు తొందరగా నా దగ్గరికి తీసుకొని రండి అని జలంధర్ ఫోన్ కట్ చేస్తాడు. స్పృహ కోల్పోయి పడిపోయిన ఆర్య ఒక్కసారి లేచి వాళ్ళ మీద దాడి చేసి చిత్తుచిత్తుగా కొట్టి జలంధర్ కి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తాడు. అది చూసినా జలంధర్ షాక్ అయిపోయి గన్ను తీసి ఆర్య వర్ధన్ కి గురి పెడతాడు. తన చేతిని తను పట్టుకొని జలంధర్ గుండెల మీద గన్ను పెట్టి, రేయ్ ఆ స్థలమే కాదు ఆ మట్టిని కూడా నిన్ను తాకనివ్వను ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు ఏం చేస్తావో చెప్పు ఆస్తి కావాలా ప్రాణం కావాలా ఆస్తి కావాలంటే నీ గుండెల్లోకి బుల్లెట్టు దూసుకు వెళుతుంది అని ఆర్య అంటాడు. ప్రాణభయంతో జలంధర్ అక్కడి నుంచి  వెళ్ళిపోతాడు. ఆర్య అక్కిదగ్గరికి వెళ్లి కట్లు విప్పేసి ఇక నీకేం భయం లేదు అక్కి నేను వచ్చేసాను కదా అని ఆర్య అక్కిని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది అను అక్కి కోసం ఏడుస్తూ గడప దగ్గర కూర్చుని ఉంటుంది. ఇంతలో ఆర్య అక్కిని తీసుకొని ఇంట్లోకి వస్తాడు. అక్కి దూరం నుంచి అమ్మ అని పిలుస్తుంది. అక్కి గొంతు విన్న ఉష అదిగో అన్నయ్య అక్కిని కాపాడి తీసుకువచ్చాడు రాధా గారు అని ఉష అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri