Mahesh Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుకుగా జరిగాయి. రేపే థియేటర్లలో సందడి చేయనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలవుతున్న సంక్రాంతి సినిమాలన్నిటిలో ఎక్కువ థియేటర్లో “గుంటూరు కారం” రిలీజ్ కాబోతోంది. సినిమా ఫలితం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 12 ఉదయం 1:00 నుండి అర్ధరాత్రి షోలు పడనున్నాయి. మహేష్ కెరియర్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ “గుంటూరు కారం” రాబట్టబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అన్ని సాంగ్స్ అభిమానులను ఎంతగానో అలరించాయి.
“కుర్చీ మడతపెట్టి” సాంగ్ యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. పైగా గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నటనపరంగా ఆ రెండు సినిమాలలో మహేష్ బాబుని చాలా కొత్తగా చూపించడం జరిగింది. “గుంటూరు కారం” లో కూడా కొత్త మహేష్ చూస్తారని సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది. గుంటూరు కారం ప్రమోషన్స్ అంతా హడావిడి అయిపోయింది. దీంతో మహేష్ ఫోకస్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్టుపై పడింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు లోనే పట్టాలేకబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ముందుగా బాహుబలి, RRR సినిమాలకు షూట్ స్టార్ట్ చేయకముందు తీసుకున్న వర్క్ షాప్ క్లాసులు మహేష్ సినిమాకి కూడా తీసుకోవడానికి జక్కన్న రెడీ అయినట్లు టాక్. ఈ వర్క్ షాప్ క్లాసులలో ప్రధాన నటీనటులకు సినిమాలో ప్రతి క్యారెక్టర్ పై అవగాహన ఉండేవిధంగా రాజమౌళి ఐడియా ఇవ్వటం జరుగుద్ది. ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన రాజమౌళి సినిమాలన్నీటికి ఈ రకంగానే నటీనటులకు క్లాసులు తీసుకున్నారు. ఇప్పుడు అదే విధంగా మహేష్ బాబు సినిమాకి క్లాసులు తీసుకుంటున్నారట. త్వరలోనే మహేష్ సినిమా వర్క్ షాప్ క్లాసులు రాజమౌళి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ తరహాలో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. అంతేకాదు 2026లో ఈ సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!