Ram Charan-Upasana: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్-ఉపాసన జంట ఒకటి. అపోలో హాస్పిటల్స్ ఎండీ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఇరుకుటుంబసభ్యులను ఒప్పించి 14 జూన్ 2012 తేదిన వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరి వివాహ వేడుకలు అప్పట్లో టాక్ అఫ్ ది టౌన్‌గా నిలిచాయి. పెళ్లి తరువాత రామ్ చరణ్ తన చిత్రాలతో బిజీ అయిపోతే.. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌లో ఒక విభాగానికి అధిపతిగా కొనసాగుతూనే, మరోవైపు ‘బీ పాజిటివ్’ అనే ఒక మ్యాగజైన్ ద్వారా ప్రజల్లో ఫిట్‌నెస్ మీద అవగాహన కల్పిస్తోంది.
ఇకపోతే నేటిలో రామ్ చరణ్, ఉపాసన వైవాహిక బంధానికి పదేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలోనే ఈ జంట తమ 10వ వివాహ వార్షికోత్సవ వేడుకను ఇటలీలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యాషన్ నగరంగా పేరు గాంచిన మిలాన్ లో వీరి మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన భర్త రామ్ చరణ్‌తో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇక ఈ పిక్స్‌లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా చరణ్-ఉపాసనలు వెలిగిపోతున్నారు. దీంతో ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు మరియు పలువురు సెలబ్రెటీలు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాజల్, సమంతలు సైతం చరణ్ దంపతులకు `హ్యాపీ వెడ్డింగ్ యనవర్సరీ` అంటూ విషెస్ తెలిపారు.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…