NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Presidential Election: ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌తో మమతా బెనర్జీ భేటీ.. పోటీకి ‘సై’ అంటారా ‘నై’ అంటారా..?  

Mamata Benarjee Meets Sarad Pawar on Presidential Election Issue

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు  వివిధ రాజకీయ పక్షాల నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపే దిశగా వ్యూహాలను రచిస్తున్న దీదీ..రేపు జరగబోయే భేటీకి వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపారు. అయితే విఫక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్సీపీ నేత శరద్ పవార్ పేరు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని ఆయన ఖండించారు. తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో కీలక భేటీకి ఒక రోజు ముందు శరద్ పవార్ తో మమతా బెనర్జీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు జరిగే సమావేశానికి గానూ మమతా బెనర్జీ, శరద్ పవార్ లు ఈ రోజే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం శరద్ పవార్ నివాసానికి చేరుకున్న మమతా బెనర్జీ ఆయనతో భేటీ అయ్యారు. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, భేటీకి హజరయ్యే పార్టీల వైఖరి తదితర విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Mamata Benarjee Meets Sarad Pawar on Presidential Election Issue
Mamata Benarjee Meets Sarad Pawar on Presidential Election Issue

Presidential Election: పోటీ చేయాలన్న ఆలోచన లేదు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన శరద్ పవార్ జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క ఆయనకు వైరి వర్గాల్లోనూ ఆయనకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధిగా తాను పోటీ చేయడం లేదంటూ శరద్ పవార్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంపై మమతా బెనర్జీ ఆయనతో చర్చించినట్లు వార్తలు వినబడుతున్నాయి. శరద్ పవార్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కూడా మమతా బెనర్జీ అభ్యర్ధించినట్లు తెలుస్తొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న తరుణంలోనే దీదీ ఓ అడుగు ముందుకు వేసి సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది. మరో పక్క రాష్ట్రపతి ఎన్నికను వివక్షాలతో మాట్లాడి  ఏకగ్రీవం చేయాలన్నట్లుగా బీజేపీ భావిస్తొంది. ఆ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ఇతర పక్షాలతో మాట్లాడే బాధ్యతలను పార్టీ అప్పగించింది.

Presidential Election: దీదీ భేటీ రాజకీయంపై సర్వత్రా ఉత్కంఠ

ఇదిలా ఉంటే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ రేపు ఢిల్లీలో జరిగే కీలక సమావేశానికి వెళతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. దీదీ ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఆహ్వానం పంపిన నేపథ్యంలో కేసిఆర్.. కాంగ్రెస్ పార్టీతో వేదికను పంచుకోవడానికి ఇష్టపడటం లేదని వార్తలు వినబడుతున్నాయి. అయితే తన ప్రతినిధిని సమావేశానికి పంపాలని కేసిఆర్ భావిస్తున్నారని తెలుస్తొంది. రేపు దీదీ నిర్వహిస్తున్న సమావేశానికి ఏయే పార్టీల నేతలు హజరు అవుతారు, వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N