మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ గా మారాడు. అవును, మీరు విన్నది నిజమే. అది కూడా ఇక్కడ కాదు.. టాంజానియాలో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్ కోసం భార్య ఉపాసనతో జపాన్ వెళ్లిన రామ్ చరణ్.. అక్కడ పర్యటన ముగించుకుని టాంజానియా చేరుకున్నారు.
టాంజానియాలోని అందాలను ఆస్వాదిస్తూ.. భార్యతో అక్కడ ఫుల్‌గా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. టాంజానియాలోని ఓ జూలో చరణ్ ఓపెన్ టాప్ జీప్ ను నడుపుతూ వీడియోలో కనిపించారు.
అలాగే అక్కడ స్థానికులతో కలిసి రామ్ చరణ్ వంట చేశాడు. ఇంతకీ ఏం వండాడో తెలుసా..? ఆమ్లెట్. అవును, బహిరంగ ప్రదేశంలోనే ఏర్పాటు చేసిన స్టవ్ పై చరణ్ ఆమ్లెట్ వేశాడు. ఆపై తన కెమెరాతో టాంజానియాలోని అందాలను బంధిస్తూ వీడియోలో దర్శనమిచ్చారు.
ప్రస్తుతం రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో అభిమానులను మరియు నెటిజన్లను ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
https://www.instagram.com/reel/CkS3APKodPH/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!