రామ్ `ది వారియ‌ర్‌`కు అదే మైన‌స్‌.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందో తెలుసా?

Share

కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుసామి, టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ది వారియ‌ర్‌`. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తే.. ఆది పినిశెట్టి విల‌న్‌గా చేశారు.

న‌దియా, అక్షర‌ గౌడ త‌ద‌త‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించాడు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లోగ్రాండ్‌గా విడుద‌లై మంచి టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు ఈ చిత్రం అదిరిపోయే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

కానీ, రెండో రోజు మాత్రం డ‌ల్ అయింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.02 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.30 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 2.63 కోట్ల షేర్‌తో స‌రిపెట్టుకుంది. టికెట్ రేట్స్ అధికంగా ఉండ‌ట‌మే సినిమాకు మైన‌స్‌గా మారింద‌ని, రేట్స్ ని తగ్గించి ఉంటే ఆఫ్ లైన్ బుకింగ్స్ మరింత జోరుగా సాగి ఉండేవ‌ని అంటున్నారు. ఇక ఏరియాల వారీగా `ది వారియ‌ర్‌` 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం- రూ. 2.85 కోట్లు
సీడెడ్- రూ. 1.46 కోట్లు
యూఏ- రూ. 1.34 కోట్లు
తూర్పు- రూ. 0.72 కోట్లు
వెస్ట్ : రూ- 0.76 కోట్లు
గుంటూరు- రూ. 1.38 కోట్లు
కృష్ణా- రూ. 0.45 కోట్లు
నెల్లూరు- రూ. 0.36 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ‌= రూ. 9.32 కోట్ల(రూ.13.90~ గ్రాస్‌)
—————————-

క‌ర్ణాట‌క‌+ రెస్టాఫ్ ఇండియా: రూ. 0.50 కోట్లు
ఓవ‌ర్సీస్‌- రూ. 0.39 కోట్లు
త‌మిళ వ‌ర్ష‌న్‌- రూ. 0.44 కోట్లు
————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= రూ. 10.65 కోట్లు(రూ.16.55 కోట్లు~ గ్రాస్‌)
————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 39.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే ఇప్పుడీ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. తొలి రెండు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 28.35 కోట్ల షేర్ ని వ‌సూల్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

12 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago