Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2010లో “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని.. చాలామందికి లక్కీ హీరోయిన్ అయిపోయింది. స్టార్టింగ్ లో సమంత నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. ఒక్క తెలుగులో మాత్రమే కాదు దక్షిణాదిలో తమిళ్ సినిమా రంగంలో కూడా అనేక సినిమాలు చేయడం జరిగింది. తమిళంలో కూడా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంది. దీంతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోలు మహేష్ బాబు, విజయ్, సూర్య, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇలా చాలామంది పెద్ద హీరోలతో నటించింది.
2017 లో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లయినా గాని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ…కెరియర్ కొనసాగిస్తూ 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2022లో మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో.. ఆరు నెలలపాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంది. ఈ ఏడాది మార్చి నెలలో కోలుకున్న.. సమంత చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయటం జరిగింది. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధికి సంబంధించి.. విదేశాలలో మొన్నటి వరకు మిగతా ట్రీట్మెంట్ తీసుకుంది. ఇటీవల విదేశాల నుండి హైదరాబాద్ వచ్చిన సమంత తన చారిటీ సంస్థకు సంబంధించి పలు కార్యక్రమాలలో పాల్గొంది.
ఈ సందర్భంగా అక్కడ పిల్లలతో సరదాగా గడిపింది. ఇదిలా ఉంటే ఇప్పుడు లేటెస్ట్ గా సమంత నిర్మాతగా ప్రొడక్షన్ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంస్థకు “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్” అనే పేరును ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తన నిర్మాణ సంస్థ పేరుతో పాటు లోగోను షేర్ చేయడం జరిగింది. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి.. అర్థవంతమైన ఇంకా సామాజిక, ప్రామాణికమైన స్టోరీలను సెలెక్ట్ చేసి ఈ నిర్మాణ సంస్థ ద్వారా.. సినిమాలని నిర్మించబోతున్నట్లు సమంత తాజాగా MTV షోలో ప్రకటన చేయడం జరిగింది. తనకి ఇష్టమైన ఇంగ్లీష్ పాటలో ఒక దాని నుండి ప్రేరణ పొందిన బ్రౌన్ గర్ల్… పాట స్ఫూర్తిగా ప్రొడక్షన్ హౌస్ కు పేరు పెట్టినట్లు స్పష్టం చేయడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!