NewsOrbit
Education News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్

APPSC Group 2 Preparation Strategy: మీ ప్రైవేట్ ఉద్యోగం కి రాజీనామా చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారా? ప్రేపరషన్ స్ట్రాటజీ మీ కోసం!

APPSC Group 2: Should you quit private job to prepare for APPSC Group 2 Government Job? APPSC Group 2 Preparation Strategy

APPSC Group 2 Preparation Strategy: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిష  న్(ఏపీపీఎస్సీ) గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన విషయం ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. గ్రూప్ 2 లో ఉన్న 897 ఖాళీల భర్తీ కోసం ఏపీపీఎస్సీ డిసెంబర్ 21 2023 నుండి జనవరి 10 2024 వరకు ధరకాస్తులు స్వీకరిస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించబడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది ఆంధ్రులకి ఇది శుభవార్త, అయితే చాలా మంది మనసులో ఉన్న ప్రెశ్న ఒక్కటే…ఈ గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవ్వాలంటే ఎంత సమయం కావాలి, నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మానేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రెశ్నలకు సమాధానాలతో పాటు పూర్తి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రేపరషన్ స్ట్రాటజీ న్యూస్ ఆర్బిట్ నుండి మీకోసం.

APPSC Group 2: Should you quit private job to prepare for APPSC Group 2 Government Job? APPSC Group 2 Preparation Strategy
APPSC Group 2: Should you quit private job to prepare for APPSC Group 2 Government Job? APPSC Group 2 Preparation Strategy

APPSC Group 2 Exam Dates: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తేదీ ఎప్పుడు?

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 25 2024లో జరగనుంది. అంటే నోటిఫికేషన్ తేదీ నుండి ప్రిలిమ్స్ వరకు 3 నెలలు సమయం ఉంది అనుకోవాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 దరఖాస్తుకు జనవరి 10వ తారీకు చివరి తేదీగా నిర్ణయించబడింది.

గ్రూప్ 2 పరీక్ష విధానము

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో మొదటి భాగం ప్రిలిమ్స్ పరీక్ష, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వారు మెయిన్స్ ఎగ్సామ్ కి అర్హత సాధిస్తారు. మెయిన్స్ మెరిట్ సాధించిన వారు కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ (CPT) రాసి అది కూడా క్లియర్ అయిన తరువాత ఫైనల్ జాబితాలో వారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిసల్ట్ తెలుసుకోవొచ్చు. అయితే CPT లో విఫలం అయినా మీరు ఉద్యోగానికి అనర్హులైనట్లే అని నోటిఫికేషన్ లో స్పష్టంగా చెప్పేసింది ఏపీపీఎస్సీ. పరీక్ష OMR ఆఫ్లైన్ లో ఉంటుందా కంప్యూటర్ ఆన్లైన్ లో ఉంటుందా అనేది ఇంకా తెలియదు, ఈ విషయం గురించి తరువాత వెబ్సైటు లో అప్డేట్ చేసే అవకాశం ఉంది.

గ్రూప్ 2 ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ పరీక్షించే విధంగా 150 ప్రెశ్నలతో కూడిన ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. ఒకొక్క ప్రెశ్నకు సమాధానం పెట్టేందుకు అభ్యర్ధికి 1 నిమిషము ఇవ్వబడింది, అంటే మొత్తం 150 నిమిషాల పరీక్షా.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో నెగెటివ్ మార్కింగ్: చాలామంది అభ్యర్థులు నెగెటివ్ మార్కింగ్ గురించి అవగాహనా లేకుండా తప్పులు చేస్తుంటారు, నోటిఫికేషన్ ఆధారంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది అని తెలుస్తుంది.

APPSC: తెలంగాణ అభ్యర్ధులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేయవచ్చా ..? నాన్ లోకల్ రిజర్వేషన్ ఎంత..?

Paper(Subject) – General Studies & Mental Ability (150)
Total No of Questions – 150
Total Duration  – 150 Minutes
Total Marks – 150 Marks

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్: చదవాల్సినవి ఇవే

ప్రిలిమ్స్ సిలబస్ లో భాగంగా ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర, జనరల్ మరియు ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ AP, హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు AP, భారతీయ సమాజ నిర్మాణం, సంక్షేమ యంత్రాంగం, సామాజిక సమస్యలు, ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ

APPSC Group 2: Should you quit private job to prepare for APPSC Group 2 Government Job? APPSC Group 2 Preparation Strategy
APPSC Group 2: Should you quit private job to prepare for APPSC Group 2 Government Job? APPSC Group 2 Preparation Strategy

APPSC Group 2 Prelims Subjects , APPSC Group 2 Prelims Subject Wise Marks
ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర
30 మార్కులు
జనరల్ మరియు ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ AP, హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మరియు AP
30 మార్కులు
భారతీయ సమాజ నిర్మాణం, సంక్షేమ యంత్రాంగం, సామాజిక సమస్యలు
30 మార్కులు
ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
30 మార్కులు
మెంటల్ ఎబిలిటీ
30 మార్కులు
Total – 150 Questions
Total – 150 Marks

ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర – ఎలా ప్రిపేర్ అవ్వాలి?

హిస్టరీ సిలబస్ చదవడం అనగానే చాలా మంది అభ్యర్థులకు ముందే భయం వేస్తుంది, భారత చరిత్ర అంటే ఒక మహా సముద్రం, అది ఈదడానికి సరైన పడవను ఎంచుకోవడం లోనే అసలు రహస్యం దాగి ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారు చాలా మంది హిస్టరీ కోసం ఎన్సిఈఆర్టి పుస్తకాలు చదువుతారు, అయితే మీరు ఆ తప్పు చేయకండి. స్టేట్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 లాంటి పరీక్షలు ఎక్కువగా ఫాక్ట్స్ ఆధారిత ప్రెశ్నలు అడుగుతారు, ఇందుకు తమిళనాడు స్టేట్ సిలబస్ పుస్తకాలు సరైనవి. మీరు ఆన్లైన్ లో తమిళనాడు స్టేట్ సిలబస్ హిస్టరీ పుస్తకాలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవొచ్చు. ఇంకా సతీష్ చంద్ర బిపిన్ చంద్ర లాంటి వారి పుస్తకాలు ఇండియన్ హిస్టరీ సిలబస్ కోసం బాగా పని చేస్తాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర విషయానికి వస్తే విజేత కంపెటిషన్స్, తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా పని చేస్తాయి, ఇవి కాకుండా రఘునాధ రావు లాంటి వారు రాసిన హిస్టరీ అండ్ కల్చర్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్, మోడరన్ హిస్టరీ అఫ్ ఆంధ్ర ఇలాంటివి చదివితే సరిపోతుంది.

ఎలాంటి పుస్తకాలు చదవాలి అనే అంశం మీద వేరే ఆర్టికల్ లో క్షున్నంగా చర్చిద్దాము, ఇక్కడ ఈ ఆర్టికల్ లో ప్రధానంగా మాట్లాడేది మీరు వెతుకుతున్న ప్రశ్న, ప్రైవేట్ ఉద్యోగం బంద్ చేసి గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవుతే ఎలా ఉంటుంది అని.

ముందుగా చెప్పేది ఏమిటి అంటే, ప్రైవేట్ ఉద్యోగం బంద్ చేసి గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వడం అనేది మంచి ఆలోచన. ఎందుకంటే 3 నెలల తరువాత కావాలంటే మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం లో చేరొచ్చు, గ్రూప్ 2 లాంటి ఉన్నత పదవి కోసం ఆ రిస్క్ తీసుకోవొచ్చు. కానీ మీ ఆర్ధిక పరిస్థిథి మీకే తెలుస్తుంది, ఇప్పుడు ఉద్యోగం బంద్ చేసి తరువాత వెంటనే ఉద్యోగం రాకపోయినా కుటుంబం కి ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా అని ఆలోచించుకోవాలి, మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. మీరు ఇంతకముందు ఎప్పుడైనా గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారా, మీకు సిలబస్ మీద ఎంతవరకు అవగాహనా ఉంది, వీరే కంపెటేటివ్ ఎక్సామ్స్ కి మీరు ప్రిపేర్ అయ్యారా, మీ జ్ఞాపక శక్తి ఎలా పని చేస్తుంది ఇలాంటి అంశాల పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.

పైన మాట్లాడిన వాటి ఆధారంగా మీరు నిర్ణయం తీసుకున్న తరువాత మీరు అర్ధ చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే, గ్రూప్ 2 కి కేవలం 3 నెలలు వ్యవధి మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్తిథిలో మీరు మొత్తం సిలబస్ చదివెయ్యాలి అని అనుకుంటే పొరబడినట్లే, అలా చేయడం కష్టమే కాదు అసాధ్యం కూడా. కష్టపడి చదవడంతో పాటు స్మార్ట్ ప్రేపరషన్ కూడా ఉండాలి. అంటే ఏ సబ్జెక్టు మీద ఎక్కువ సమయం పెట్టాలి, పుస్తకాలు మొత్తం చదవకుండా ముఖ్యమైన టాపిక్స్ ఎలా చదవాలి, ఆన్లైన్ రిసోర్సెస్ నో స్మార్ట్ గ ఎలా వాడుకోవాలి, టెస్ట్ సిరీస్లు రాస్తూ మీ ప్రేపరషన్ ని ఎలా తగినట్లు మలుచుకోవాలి, కరెంట్ అఫైర్స్ కోసం ఎలాంటి సోర్సెస్ చదవాలి ఇలా ప్రతి విషయం గురించి ఆలోచించి, మూడు నెలలకు సరైన ప్రణాళిక వేసుకోవాలి, ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రేపరషన్ పక్కాగా అమలు చెయ్యాలి… పూర్తి విశ్లేషణ మరియు స్ట్రాటజీ కొరకు ఇంకాస్త సమయం వేచి ఉండండి….శుభం

 

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N