NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

APPSC: తెలంగాణ అభ్యర్ధులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేయవచ్చా ..? నాన్ లోకల్ రిజర్వేషన్ ఎంత..?

APPSC: ఆంధ్రప్రదేశ్ ప్రబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) –గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 గ్రూపు – 2 ఉద్యోగాల భర్తీకి నిన్న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గ్రూపు – 2 ఉద్యోగాల్లో 331 ఎగ్జికూటివ్ జాబ్స్, 566 నాన్ ఎగ్జికూటివ్ జాబ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనుండగా, ఉద్యోగాలకు డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకూ ధరఖాస్తులు స్వీకరించనున్నారు.

అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రెపేర్ అవుతున్న అభ్యర్ధులు ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ఉద్యోగాలకు ధరఖాస్తు చేయవచ్చా .. ? అనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ధరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇతర ప్రాంత అభ్యర్ధులు పొందవచ్చు అనే డౌట్ వస్తుంది. అయితే 5 శాతం నాన్ లోకల్ కేటగిరి కింద భర్తీ చేసే అవకాశం ఉంటుంది. నాన్ లోకల్ క్యాటగిరి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందని వారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏ రాష్ట్రం వారైనా ఆ కేటగిరి (నాన్ లోకల్) పరిధిలో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుందని సమాచారం.

అయితే నోటిఫికేషన్ లో నాన్ లోకల్ రిజర్వేషన్ పేర్కొనకపోయినా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నాన్ లోకల్ అభ్యర్ధులు 5 శాతం ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం పోస్టులో 5 శాతమా లేక విభాగాల వారీగా ఖాళీల్లో 5 శాతం అనే డౌట్ కూడా కొందరు వ్యక్తం చేస్తుంటారు. అయితే పోస్టు వారీగా గుర్తించి ఖాళీల వారీగా అయిదు శాతం నాన్ లోకల్ పోస్టులు పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రం ఏపీపీఎస్సీ అధికారుల నుండి నాన్ లోకల్ అభ్యర్ధులు క్లారిటీ తీసుకుంటే మంచింది.

ఏపీపీఎస్సీ గ్రూపు 2 విభాగాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే ..

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 212
ఆర్ధిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 23
జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161
లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ -12
లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 10
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ – 2 – 4
డిప్యూటి తహసీల్దార్ (గ్రేడ్ 2) 114
సబ్ రిజిస్ట్రార్ 16
ఎక్సైజ్ సబ్ ఇన్ ఇన్స్ పెక్టర్ – 150
ఎల్ఎఫ్భీ అండ్ ఐఎంఎస్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 18
గ్రుప్ – 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
డిప్యూటీ తహసీల్దార్
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
సహాయ అభివృద్ధి అధికారి
ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్
మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III
పంచాయితీ రాజ్ అండ్‌ గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి
అసిస్టెంట్ రిజిస్ట్రార్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I

గ్రూప్ – 2 నాన్ ఎగ్జికూటివ్ పోస్టులు

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( జీఏడీ, లా, ఫైనాన్స్, లెజిస్లేచర్ మొదలైన వివిధ విభాగాలు)
సీనియర్ ఆడిటర్
సీనియర్ అకౌంటెంట్ (హెచ్ ఓడీ), డిస్ట్రిక్ట్, ఇన్సూరెన్స్, వర్క్స్ అకౌంట్స్ మొదలైన వివిధ విభాగాలు)
జూనియర్ అసిస్టెంట్ (కార్మిక, పీహెచ్ అండ్‌ ఎంఇ, చక్కెర అండ్‌ చెరకు, వ్యవసాయం, రోడ్లు అండ్‌ భవనాలు మొదలైన వివిధ విభాగాలు)

CM YS Jagan: తుఫాను బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Saranya Koduri