NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama February 6 2024 Episode 37: కూతురు చేసిన పనికి విశ్వనాథం ఏం చేయనున్నాడు? సత్యతో పెళ్లి వద్దనుకున్న సునంద ని మాధవ్ ఒప్పించనున్నాడా?

Satyabhama  Today Episode February 6 2024 Episode 37 Highlights

Satyabhama February 6 2024 Episode 37:  సత్య మాధవ్ ఎంగేజ్మెంట్ దగ్గరికి కృషి వచ్చి గొడవ చేయడం జరుగుతుంది. క్రిష్ నేను సత్తిని ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్తాడు. సత్య మాత్రం నేనెప్పుడూ కృష్ణ చూడలేదు ఇలాంటి రౌడీని ఎవరైనా ప్రేమిస్తారా అని కరాకండిగా చెప్పేస్తుంది సత్యకి క్రిష్ కి గొడవ జరుగుతుంది క్రిష్ సత్య ని చంపాలని కూడా చూస్తాడు. మాధవ్ కావాలని క్రిష్ ముందే సత్య తో ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు ఆ కోపంతో క్రిష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Satyabhama Today Episode February 6 2024 Episode 37 Highlights
Satyabhama Today Episode February 6 2024 Episode 37 Highlights

ఇక ఇంటికి వస్తారు సత్య ఫ్యామిలీ.గొడవ జరిగినందుకు, సత్యదే తప్పు అన్నట్టుగా వాళ్ళ నాన్నమ్మ మాట్లాడుతూ ఉంటుంది. సత్యా నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది వాళ్ళ అమ్మ వెంటనే సత్యనారాయణమ్మ ఆగు అని అంటుంది. నీ కూతురు చేసిన పనికి నువ్వు తప్పించి లోపలికి పంపించి నేను మాట్లాడాల్సిన మాటలు అన్నీ మాట్లాడకుండా చేయాలనుకుంటున్నావా అని అంటుంది. ఇంకా ఎంతమంది వచ్చి ఇంటికి గొడవపడతారు ఇంకా ఎంతమంది కాళ్లు మీ నాన్న పట్టుకోవాలో చెప్పు అని అంటుంది సత్య నానమ్మ. జరిగిందేదో జరిగిపోయింది అత్తయ్య ఇప్పుడు మళ్ళీ గొడవలు ఎందుకు అని అంటుంది నా నోరు మూయిస్తావే బయట జనానికి తెలియకుండా ఉంటుందా ఏంటి? అప్పుడు మాత్రం సమాధానం చెప్పద్దా అని అంటుంది. వాళ్లడిగే ప్రశ్నలకు ఏ ముఖం పెట్టుకొని బయటికి వెళ్దాం అని అంటుంది. విశ్వనాథం నేను మాట్లాడిన మాటల్లో తప్పేమైనా ఉందా నీ కూతురు చేసింది తప్పు కదా వాడి గురించి చెప్పకుండా దాచి పెట్టడం తప్పు కాదా తెరిచి మాట్లాడరా అని అంటుంది విశ్వనాథంతో, శేఖర్ అన్నయ్య వాళ్ళు జరిగిన దాన్ని అర్థం చేసుకున్నారు సత్య తప్పేం లేదని అందరి ముందు ఒప్పుకున్నారు. మాధవ్ ఇష్టపడి నిశ్చితార్థం చేసుకున్నాడు. బయట వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం మన ఇంటి పిల్లలని అర్థం చేసుకోలేమా అని అంటుంది సత్య తల్లి.

Satyabhama Today Episode February 6 2024 Episode 37 Highlights
Satyabhama Today Episode February 6 2024 Episode 37 Highlights

ఇక అక్కడే ఉన్న హర్ష కూడా అమ్మ చెప్పింది నిజమే బయటి వాళ్లే సత్యని అర్థం చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ మై ఉండి మనం సర్టిఫికెట్ సపోర్ట్ చేయకపోతే ఎలాగో అని అంటాడు. జరిగిన గొడవలో సత్య ప్రమేయం ఏమీ లేదని అర్థమైంది కదా ఇప్పుడు సత్యని మనం నిలదీసి ఏం ప్రయోజనం అని అంటాడు అక్కడే ఉన్న సంధ్యా చూడు అక్క తప్పు చేసినట్టుగా తలవంచుకొని బాధపడుతుంది నానమ్మ ఇంకా అనడం ఆపేస్తావా అని అంటుంది నేను అన్న మాటలే మీకు కనిపిస్తున్నాయి అని అంటుంది సత్య నానమ్మ. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందని నానమ్మ అంతా సవ్యంగానే జరిగింది బావగారు సత్య అర్థం చేసుకున్నారు రేపు పెళ్లి కూడా జరుగుతుంది అని అంటాడు హర్ష. ఇంట్లో అందరూ అలానే కలలు కనండి చేతులు కాలిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మీ అందరికీ అని అంటుంది సత్య నానమ్మ. ఎందుకు ఆలా మాట్లాడుతున్నావు అని అంటుంది సంధ్య. అక్కా చెల్లెలు ఇద్దరు తోడు దొంగలు నోరు మూయండి అని అంటుంది వెంటనే సత్యాన్ని ఏమన్నా అనండి సంధ్యనేమి అనొద్దు అని అంటుంది అవును మీ అత్తింటి వాళ్ళు పెద్ద మనసుతో నిన్ను ఆదరించారని, ఇంట్లో అందరూ చంకలు గుద్దుకుంటున్నారు. ఇప్పుడు అలానే ఉంటుంది రేపు కాపురానికి వెళ్లిన తర్వాత తెలుస్తుంది. నీవల్ల ఏం జరిగినా ఇప్పుడు జరిగిన సంఘటన ఆధారం చేసుకుని అరుస్తారు. మన మీద దుమ్మెత్తికి వస్తారే అని అంటుంది సత్య నానమ్మ. ఇప్పుడు నేను ఏ తప్పు చేశాను అని నానమ్మ ఇంతలా నన్ను నిలదీస్తున్నావ్ అని అంటుంది సత్య. మీ నాన్నని అడుగు నువ్వేం తప్పు చేసావో చెప్తాడు అని అంటుంది.

Satyabhama  Today Episode February 6 2024 Episode 37 Highlights
Satyabhama  Today Episode February 6 2024 Episode 37 Highlights

ఇక సత్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మీరు ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా నాన్న లోకమంతా నన్ను దోషిగా చూసిన పర్వాలేదు కానీ మీరు ఒక్కలు నన్ను అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది. సత్య మాట్లాడి మాటలు వింటున్నారు కదా మీరు చెప్పారనే కదా సత్య ఈ పెళ్లికి ఒప్పుకుంది తన ఆశలు తన గోల్స్ అన్ని పక్కన పెట్టి మీకోసం పెళ్లిని ఒప్పుకుంది. మనం తెచ్చిన సంబంధాన్ని తలవంచి ఒప్పుకుంది ఎవడో ఏదో అన్నాడు అని చెప్పి ఇవాళ మన పిల్లని దూరం పెడతామా, దాని మనసు బాధ పెడతారా అని అంటుంది సత్య తల్లి. మీ మౌనానికి అర్థం ఏంటో చెప్పండి నాన్న అని అడుగుతుంది సత్య. అసలేం జరిగిందో మీకు తెలియదు నాన్న అని జరిగింది చెప్పబోతుంటే తప్పు చేసావు సత్య అని అంటాడు విశ్వనాథం. వెంటనే సత్య చెప్పడం ఆపేసి షాక్ లో ఉండిపోతుంది.విశ్వనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా, సత్య ఏడుస్తూ ఉంటుంది.

Satyabhama  Today Episode February 6 2024 Episode 37 Highlights
Satyabhama  Today Episode February 6 2024 Episode 37 Highlights

ఇక క్రిష్ ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు సత్య కూడా వాళ్ళ నాన్న తప్పు చేసావ్ అన్నమాట ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది.క్రిష్ జరిగిన ఘతానంతా దోచుకొని సత్య ని చూసినప్పటినుండి సత్యతో ప్రతి సన్నివేశాన్ని గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు అక్కడే ఉన్న బాబి వదిన కూడా ఇలా చేస్తుందని నేను అను ఊహించలేదు అన్న అందరి ఆడవాళ్ళలానే వదిన కూడా,మారిపోయింది అని అంటాడు.అమెరికా సంబంధం అయ్యేటిసరికి నిన్ను మర్చిపోయిందన్న ఈ రోజుల్లో అందరూ ఇలానే ఉన్నారు అన్న అని అంటాడు. వాళ్లని వదిన కూడా మోసం చేసిందన్న నువ్వు మాత్రం సిన్సియర్గా లవ్ చేశావు. అలాంటి నిన్ను అందరి ముందు అవమానించింది. నువ్వు వదిన ఎంతగా ప్రేమించావు నాకు ఒక్కడికే తెలుసు అని అంటాడు. ఇంత జరిగిన తర్వాత నువ్వు వదిలేసావ్ అనుకో నేను చేతకాని వాడిలా చూస్తారు అన్న, అవునన్నా నేను చెప్పింది నిజమే, ఈ సంబంధం కుదరడానికి వీల్లేదు అమెరికా సంబంధం అనేసరికి ఎగేసుకుంటూ వెళ్లారే ఆ ఫ్యామిలీ కూడా ఏదో ఒకటి చేయాలి అన్న మనం రివెంజ్ తీర్చుకోవాలి అని బాబి క్రిష్ కి చెప్తూ ఉంటాడు అప్పుడు కానీ నువ్వంటే ఏందో జనానికి తెలియదు భయం కలగాలని నా నువ్వంటే భయం కలగాలి అని అంటాడు. నిన్ను వద్దనుకొని వాళ్ళు ఎంత తప్పు చేసారో అప్పుడైనా వాళ్లకు తెలుస్తుంది అని అంటాడు. మా ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకు లాగాలి. అప్పుడు తన చెయ్యి తప్పైపోయిందని నీ కాళ్లు పట్టుకుని బతిమిలాడుతుంది. అప్పుడు గాని తను చేసిన తప్పేంటో తనకి తెలీదు. అని క్రిష్ కి కోపం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటాడు. క్రిష్ అంతా విని సైలెంట్ గా ఉంటాడు.

Satyabhama  Today Episode February 6 2024 Episode 37 Highlights
Satyabhama  Today Episode February 6 2024 Episode 37 Highlights

ఇక సత్యా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి,బాధపడుతూ నేను ఏ తప్పు చేయలేదు నాన్న అని.ఏమీ మాట్లాడకుండా మీరు సైలెంట్ గా ఉండి నన్ను ఇబ్బంది పెట్టకండి నాన్న అని అంటుంది అయినా విశ్వనాథం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు సత్య ఎందుకు నాన్న నన్ను మాట్లాడకుండా ఉండి ఇబ్బంది పెడుతున్నారు నేనే తప్పు చేయలేదు వాడితో నేను ఎక్కడికి తిరగలేదు వాడు ఇచ్చిన చీర కట్టుకోవడం తప్ప లేదంటే వాడు ఇచ్చిన కాఫీ తాగడం తప్ప నా ప్రమేయం లేకుండా అవన్నీ జరిగిపోయాయి నాన్న అయినా మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు చావే శరణ్యం.మీ మాట కాదు నేను ఏ రోజు ఏదీ చేయలేదు కలలో కూడా మీ మాట నేను కాదన్న ఇప్పటికి మీరు నన్ను నమ్మకపోతే,చెప్పండి నాన్న నేనుమీరు నమ్మడానికి నేనేం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను కావాలంటే మీకోసం చనిపోతాను అని అంటుంది. ఆ మాటలకు, వెంటనే విశ్వనాథం పక్కకు తిరిగి కూతురిని నమ్మలేనంత తండ్రిని కాదమ్మా అని అంటాడు. మరి నన్ను నమ్మితే అందరి ముందు సైలెంట్ గా నేను తప్పు చేసినట్టు ఎందుకు చెప్పావు నాన్న అని అంటుంది అప్పుడు నాకు అలా అనిపించింది అమ్మ అని అంటాడు. అందరి తండ్రి లాంటి వాడిని కాదు సత్య నేను నాలి గోడల మధ్య నేను ఇబ్బంది పెట్టలేను. కానీ నువ్వు చేసింది తప్పు కదా సత్య నా ఈ నాన్నకి చెప్పకపోవడం తప్పు కదా అని అంటాడు అందుకు ఒక కారణం ఉంది నాన్న అంటుంది నాకు తెలుసు సత్యమేమీ ఇబ్బంది పెడతామని నువ్వు చెప్పకూడదు అనుకుంటున్నావు కానీ, నాలుగు గోడల మధ్య నిన్ను బంధిస్తామేమోనని భయపడ్డావా ఈ విషయం తెలిసింది తర్వాత నేను ఏమంటారో అని అనుకున్నావా, మీ నాన్న నేను అర్థం చేసుకోలేడు అని అనుకున్నావా, వాడి గురించి ముందే చెప్తే జాగ్రత్తగా వాళ్లం కదా అని అంటాడు.

ఇక సత్తి ఏడుస్తూ మౌనంగా నిలబడి ఉంటుంది ఇప్పుడు ఏడ్చి ఏం లాభం సత్య ముందే కనుక వాడి గురించి చెప్పి నువ్వు అందరికీ తెలిసేలా వాడి దగ్గరికి వెళ్తాను అంటే మేం కాదనే వాళ్ళమా అన్నయ్య కూడా తోడు వచ్చాడు కదా అయినా కానీ నువ్వు ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు వాడు నిశ్చితార్థం దాకా వచ్చి గొడవ చేసాడు అందరిలో మన పరువు తీశాడు. ఇప్పుడేం చేస్తాం సత్య బాధపడి, ఈ నాన్న ఉన్నాడు అనుకోని ఈ నాన్న ఏదైనా చేయగలడు అనుకుని నువ్వు చెప్పినట్టయితే ఇవాళ బాధపడే పరిస్థితి వచ్చేది కాదు దీని వల్ల రేపు నీకు వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది సత్యా నాకు అని అంటాడు వెంటనే నాన్న అని వాటేసుకొని ఏడుస్తుంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు నాన్న నేనే సరిది చెప్పి వాడిని బుద్ధి చెప్పాలనుకున్నానే కానీ వాడు ఇలా వచ్చి గొడవ చేస్తాడు అని నేను ఊహించలేదు అని అంటుంది. జీవితమంటేనే అనుకోనివి జరగడం, నిశ్చితార్థం అంటే ఎవరైనా, తీపి జ్ఞాపకంలా గుర్తు పెట్టుకుంటారు కానీ నీ జీవితంలో ఎలా జరిగిందో చూసావు కదా అని అంటాడు. నేనేం చెప్పినా నీ మీద కోపంతో కాదు సత్య చెప్పేది, నువ్వు బాగుండాలని నా తాపత్రయం అని అంటాడు. అందరి ముందు సైలెంట్ గా ఉండడానికి కారణం కూడా నాసతికే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఉండిపోయానే తప్ప నీ మీద కోపంతో నేను నలుగురిలో మౌనంగా ఉండలేదు సత్య అది గుర్తుపెట్టుకో అని అంటాడు. ఇకముందు ఎప్పుడు ఇలా చేయను నాన్న నీకు చెప్పకుండా ఏదీ చేయను నీకు అన్నీ చెప్తాను అని అంటుంది సారీ నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. నానమ్మ మాటలన్నీ పట్టించుకోవద్దు అమ్మ ఆమెకి నువ్వంటే కోపం లేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న భయం తప్ప అని అంటాడు. తెలుసు నాన్న కానీ ఆ టైంలో నాకు బాధేసింది అని అంటే నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు సత్య అని అంటాడు సరే అంటుంది. మీరొక్కలు చాలున అన్న నాకు ధైర్యం ఇవ్వడానికి మీరు ఉంటే నేను ఏదైనా సాధిస్తానని నమ్మకం ఉంటుంది మీరు నాతో మాట్లాడారు నాకు అంతే చాలు అని అంటుంది సత్య.

ఇక సునంద ఇంట్లో ఆలోచిస్తూ ఉంటుంది మాధవ్ వచ్చి ఏంటమ్మా ఫ్రెష్ అవ్వకుండా ఇంకా అలానే ఉన్నావు అని అంటాడు. మాధవ్ వేలికి ఉన్న ఉంగరాన్ని చూస్తూ బాధపడుతుంది సునంద ఏమైందమ్మా అని అడుగుతాడు చెప్పినా మీకెవరికీ నా బాధ అర్థం కాదులే అని అంటుంది చెప్పొచ్చు కదా అర్థం చేసుకుంటాం అని అంటాడు మాధవ్. నీ వేడుకున్న ఎంగేజ్మెంట్ ని తీసేస్తావా అని అంటుంది ఆ మాటలకు మాధవ్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ మమ్మీ అని అంటాడు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటే అందరికీ ధైర్యం చెప్పగలను కానీ కొడుకు విషయం అనేసరికి స్వార్థం నేను చూసుకోవాల్సి వస్తుందండి అని అంటుంది శేఖర్ తో సునంద. నీ బాధ నేను అర్థం చేసుకోగలను సునంద అని అంటాడు శేఖర్ అయితే వెంటనే విశ్వనాథం అన్నయ్యకి ఫోన్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో సంబంధం వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేయండి అని అంటుంది ఆ మాటలకు మాధవ్ షాక్ అవుతాడు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు అని అంటుంది అక్కడే ఉన్న మాధవ్ అంత ఈజీగా ఎలా చెప్తున్నావమ్మా సత్య గురించి నీకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని అంటాడు సత్య గురించి కాదు నా బాధ అని అంటుంది సునంద. సత్య వెంటపడుతున్నారు రౌడీ గురించి నాఆలోచన అని అంటుంది. వాడి తెగింపు చూసావు వాడు నిన్ను చంపాలి అనుకున్నాడు అని అంటే సత్య తెగింపు కూడా చూసావు కదా నా ప్రాణానికి తన ప్రాణం అడ్డం వేసింది అని అంటాడు మాధవ్ అయినా పెళ్లి వరకే కదా మనం ఇక్కడ ఉండేది తర్వాత అమెరికా వెళ్ళిపోతాం కదా అని అంటాడు. పెళ్ళి వరకే కదా అంటే అదే మన తక్కువ సమయం వాడేమైనా చేయకుండా ఉంటాడా అని అంటుంది సునంద. ఓపెన్ గాని ఈ లోపల ఉన్న అనుమానం ఏంటో చెప్పు సునంద అని అంటాడు శేఖర్ మామ్ సత్య గురించి నువ్వు ఏమన్నా ఆలోచిస్తున్నావా ఎవరో ఒక అమ్మాయి వచ్చి నా మీద నిందలు వేస్తే నువ్వు ఊరుకుంటావా అని అంటాడు మాధవ్. నేను ఎలా నమ్ముతాను నీ గురించి చెప్తే నిందలు వేసినందుకు అమ్మాయిని తిరిగి తిడతాను అని అంటుంది సునంద. ఇప్పుడు సత్య చేసిన పని కూడా అదే కదమ్మా అని అంటాడు మాధవ్. అందరి ముందు వాడి చెంప పగలగొట్టింది చూడలేదా నువ్వు అని అంటాడు. ఇప్పుడు నువ్వు ఎంగేజ్మెంట్ వద్దంటే సత్య జీవితం ఏమైపోతుంది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? తనకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదా అని అంటాడు నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను మాతో ఇంకొకల సంగతి నాకు అనవసరం అని అంటుంది సునంద. పెళ్లి ఆపడానికి సునంద, చెప్పిన,కానీ మాధవ్ అందుకు అంగీకరించడు.

రేపటి ఎపిసోడ్లో మాధవ్ సత్య వాళ్ళ ఇంటికి వెళ్లి ఎంగేజ్మెంట్ నాతోనే ఎప్పటికీ ఉంటుంది మీ అమ్మాయి నా గుండెల్లో జీవితాంతం ఉంటుంది అని ధైర్యం చెప్పి వస్తూ ఉండగా, క్రిష్ ఆ పెళ్లి కొడుకుని అమెరికా పారిపోయేలా చేయాలి అని అనుకొని, క్రిష్ వాళ్ళ కారుకి అడ్డ నిలబడతాడు మాధవ్ కారులో నుంచి దిగి బయటకు వచ్చి క్రిష్ ఎదుటి నిలబడతాడు సత్య నాది నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని అంటాడు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N