`మహానటి` తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగుతో డైరెక్ట్‌గా చేసిన చిత్రం `సీతా రామం`. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తే.. రష్మిక మందన్నా కీలక పాత్రను పోషించింది.
అలాగే సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక, గౌతమ్ మీనన్ తదితరులు సైతం ముఖ్య పాత్రల్లో మెరిశారు. దేశభక్తి, ప్రేమ అంశాలతో ఓ అద్భుతమైన ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. టాక్ బాగుండటంతో.. తొలి రోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తాయని అందరూ భావించారు. కానీ, దుల్కర్ అంచనాలను అందుకోలేకపోయాడు.
బరిలో కళ్యాణ్ రామ్ నటించిన `బింబిసార` ఉండటం, దానికి కూడా హిట్ టాక్ రావడంతో.. ఆ ప్రభావం `సీతారమం` కలెక్షన్స్ పై పడింది. దాంతో తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.50 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 3.05 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా `సీతారామం` టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నిజాం: 0.54 కోట్లు
సీడెడ్: 0.16 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.23 కోట్లు
తూర్పు: 0.15 కోట్లు
పశ్చిమ: 0.8 కోట్లు
గుంటూరు: 0.16 కోట్లు
కృష్ణ: 0.13 కోట్లు
నెల్లూరు: 0.5 కోట్లు
———————————
ఏపీ+తెలంగాణ=1.50కోట్లు(2.25కోట్లు~ గ్రాస్)
———————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా- 0.15 కోట్లు
ఇతర భాషలు – 0.35 కోట్లు
ఓవర్సీస్- 1.05 కోట్లు
————————————
టోటల్ వరల్డ్ వైడ్ – 3.05కోట్లు(5.60కోట్లు~ గ్రాస్)
————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 18.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 19.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.16.45 కోట్ల షేర్‌ను వసూల్ చేయాలి. మరి ఈ టార్గెట్‌ను అందుకోవాలంటే దుల్కర్ ఇంకాస్త స్పీడ్‌ను పెంచాల్సిందే.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…