NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Rajamouli: ఆ హిట్ సాంగ్ కు భార్య‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన రాజ‌మౌళి.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

Rajamouli: రాజమౌళి.. ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆరంభం నుంచి వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న రాజమౌళి.. తన మేకింగ్ స్కిల్స్ హాలీవుడ్ దర్శకులను సైతం ఫిదా అయ్యేలా చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియాకు అసాధ్యంగా మారిన ఆస్కార్ ను సైతం తీసుకొచ్చిన ఆయ‌న‌.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

మహేష్ బాబు కెరీర్ లో 29వ చిత్రమిది. రాజమౌళి తండ్రి ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి స్టోరీ అందిస్తుండ‌గా.. బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారని తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించ‌బోతున్నారు. దక్షిణాఫ్రికా నేపథ్యంలో యాక్ష‌న్ అడ్వెంచర్ థ్రిల్ల‌ర్ గా రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఉండ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రి కొద్ది రోజుల్లో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కాబోతోంది.

రాజ‌మౌళితో చేయబోయే సినిమా కోసం మ‌హేష్ బాబు త‌న మేకోవ‌ర్ ను మార్చుకుంటున్నారు. ఇందుకోసం ఇటీవ‌ల ఆయ‌న ఫిజికల్ ట్రైనింగ్, వైద్య చికిత్స నిమిత్తం జ‌ర్మ‌నీ కూడా వెళ్లారు. అక్కడ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుని వ‌చ్చారు. ఈ సంగతి పక్కన పెడితే.. రాజమౌళికి టాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్, సూపర్ కూల్ అనే పేర్లు ఉన్నాయి. తన పని తాను చేసుకోవడం తప్ప ఇతరుల విషయాల్లో ఆయన అస్సలు కలగ చేసుకోరు. వివాదాలకు, వివాస్ప‌ద‌ వ్యాఖ్యలకు రాజమౌళి ఎప్పుడు దూరమే. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. సినిమా, ఫ్యామిలీ ఇవి రెండే ఆయ‌న ప్ర‌పంచం.

అటువంటి రాజమౌళి డాన్స్ వేయడం ఎప్పుడైనా చూశారా.. ఇటువంటి అరుదైన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ తో భార్య రమతో కలిసి రాజమౌళి డాన్స్ వేశారు. ప్ర‌భుదేవా ప్రేమికుడు మూవీలో ఏఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేసిన సూప‌ర్ హిట్ సాంగ్ `అందమైన ప్రేమ‌రాణి..` కి రాజ‌మౌళి భార్య‌తో క‌లిసి డ్యాన్స్ ఇర‌గ‌దీశారు. లిరిక్స్ కు త‌గ్గ‌ట్టు రొమాంటిక్ గా స్పెప్పులు వేసి ఆక‌ట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది.

వైఫ్ ర‌మ‌తో క‌లిసి రాజ‌మౌళి డ్యాన్స్ చేసిన తీరుకు అభిమానులు, నెటిజ‌న్లు మ‌రియు సినీ తార‌లు ఫిదా అయిపోతున్నారు. రాజ‌మౌళిలో ఈ స్పెష‌ల్ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రాజ‌మౌళికి భారీ క్రేజ్ ఉండ‌టంతో.. ఆయ‌న డ్యాన్స్ వీడియో అంత‌ర్జాలంలో సునామీ వేగంతో దూసుకుపోతోంది. కాగా, రాజ‌మౌళి స‌తీమ‌ణి రమా కూడా ఇండ‌స్ట్రీలోనే ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా స‌త్తా చాటుతున్నారు. రాజ‌మౌళి తీసి ప్ర‌తి సినిమాకు ర‌మ‌నే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తారు.

https://x.com/SureshPRO_/status/1774446064827044196?s=20

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu