Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో “సలార్” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ నీ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎలివేషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. “బాహుబలి” తర్వాత ఐదు సంవత్సరాలు పరాజయాలు చూసిన ప్రభాస్.. “సలార్” సినిమా విజయంతో హిట్టు ట్రాక్ ఎక్కటం జరిగింది. అయితే ఈ జనవరిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కల్కి 2898 AD” విడుదలవుతుందని మొదట భావించారు.
కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో.. మే 9వ తారీకు విడుదల చేస్తున్నట్లు నిన్న అధికారిక ప్రకటన చేయడం జరిగింది. నాగ్ అశ్విన్ సినిమాతోపాటు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తన కెరియర్ లో ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ లో సరికొత్త కామెడీ కోణాన్ని దర్శకుడు మారుతి చూపించబోతున్నట్లు టాక్. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తూ ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకుంటుంది.
తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్ రావటం జరిగింది. విషయంలోకి వెళ్తే జనవరి 15వ తారీకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉదయం 7 గంటల 8 నిమిషాలకు ఫస్ట్ లకు పోస్టర్ విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ ఒకటి విడుదల చేయడం జరిగింది. ఇదే విషయాన్ని గత ఏడాది డిసెంబర్ 29వ తారీకు తెలియజేశారు. కానీ రీసెంట్ అప్డేట్ లో టైం కూడా తెలియజేసి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!