యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన `జనతా గ్యారేజ్` సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో వీరి తాజా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పైగా `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రమిది. దాంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీంతో షూటింగ్ ఆలస్యానికి స్క్రిప్ట్ పూర్తి కాకపోవడమే కారణం అంటూ కొద్ది రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే షూటింగ్ లేట్ అవుతుందంటూ టాక్ నడిచింది. ఇలా షూటింగ్ ఆలస్యానికి సంబంధించి రోజుకో న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
కానీ అవన్నీ పోకర్లే అట. అయితే ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆలస్యం కావడానికి ఇదే అంటూ తాజాగా మరొక కారణం తెరపైకి వచ్చింది. అదేంటంటే కొరటాల ముందుగా చెప్పిన కథ తన పాన్ ఇండియా ఇమేజ్‌కు సెట్ కాదని ఎన్టీఆర్ భావించాడట. అందువల్లనే కొరటాల కొత్త కథను సిద్ధం చేస్తున్నాడని.. ఈ కారణంగానే షూటింగ్ లేట్ అవుతుందని లేటెస్ట్ గా ఓ టాక్ బయటకు వచ్చింది. మరి నిజంగా ఈ కారణం వల్లే షూటింగ్ ఆలస్యం అవుతుందా..? లేక మరి ఇంకేదైనా ఉందా..? అన్నది తెలియాల్సి ఉంది.