Tooth cleaning : మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వాలంటే ముందు సరిగ్గా నమిలి తినాలి. లేదంటే మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు. ఆహారం జీర్ణం అవ్వకపోతే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆహారం నమలడంలో దంతాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దంతాలు అనేవి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. పళ్ళు సరిగ్గా లేకపోతే అసలు తినడమే కష్టం అని చెప్పాలి. అందుకే పళ్ళ గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి.కొన్ని కొన్నిసార్లు ఎంత జాగ్రత్త పడినా, ఎన్ని రకాల టూత్ పేస్ట్ లు వాడినా గాని ఫలితం ఉండదు. తెలుపు రంగులో ఉండవలిసిన దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి.
దంతాలు పసుపు రంగులోకి ఎందుకు వస్తాయంటే..?
ఇలా దంతాలు రంగు మారడం వలన వారు నలుగురితో సరిగ్గా మాట్లాడలేరు సరికదా మనస్ఫూర్తిగా నవ్వను కూడా నవ్వలేరు. నిజానికి పొగాకు సంబంధిత పదార్థాలను నమలడం, సిగరెట్ తాగడం , దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగాతాగడం,మద్యసానం వంటి అనేక కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారుతాయి.మరి ఇలా పసుపు రంగులో మారిన దంతాలను ఎటువంటి ఖర్చు లేకుండా తెల్లగా మార్చుకోవడానికి మేము చెప్పే ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. మంచి ఫలితం దక్కుతుంది.మరి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా.
పసుపుగా ఉన్న దంతాలు తెల్లగా మారడానికి చిట్కా :
ముందుగా ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి నిమ్మకాయ, బేకింగ్ సోడా కావాలి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చిటికెడు బేకింగ్ సోడాను వేయండి.తరువాత అందులో అర చెక్క నిమ్మరసాన్ని పిండి రెండింటినీ బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ తో కానీచేతి వేలితో కానీ తీసుకుని దంతాలన్నటికి పూయండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు బేకింగ్, నిమ్మ కాయల మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం పోయి దంతాలు తెల్లగా వస్తాయి.