Family Star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” మూవీ ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించడం జరిగింది. సరిగ్గా అదే రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “దేవర” విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ కంప్లీట్ కాకపోవటంతో వాయిదా పడింది. ఆ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి షూటింగ్ సమయంలో గాయం కావడం తర్వాత సర్జరీ జరగటంతో.. అనుకున్న సమయానికి “దేవర” రిలీజ్ చేయలేకపోతున్నారు. సరిగ్గా సమ్మర్ కావడంతో అదే రోజు నిర్మాత దిల్ రాజు “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ చేయబోతున్నారు. గోపి సుందర్ సంగీతమందించిన ఈ పాటకి సిద్ధ శ్రీరామ్ వోకల్ అందించగా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించడం జరిగింది.
విజయ్ దేవరకొండ కెరియర్ లో “గీతాగోవిందం” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దీంతో మళ్లీ చాలాకాలం తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ “ఫ్యామిలీ స్టార్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. “గీతా గోవిందం” మాదిరిగానే రొమాంటిక్ తరహాలోనే “ఫ్యామిలీ స్టార్” సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొన్నటి వరకు వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ గత ఏడాది సెప్టెంబర్ నెలలో “ఖుషి” సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
అంతకుముందు రకరకాల ప్రయోగాలు చేసి పలు సినిమాలు చేయగా అన్ని బోల్తా పడ్డాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగార్” చేయగా.. అది బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు విజయ్ దేవరకొండ కష్టపడ్డారు. మధ్యలో కరోనా రావటంతో అనేక ఇబ్బందులు పడి.. బాడీ పెంచిన గాని సినిమా మొదటి షోకే నెగటివ్ టాక్ రావటం జరిగింది. దీంతో తర్వాత తనకి బాగా కలిసొచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ సినిమాలు ఒప్పుకుంటు ఇప్పుడు కెరియర్ విజయవంతంగా నడిపించుకుంటున్నాడు. ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్” సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!