Waltair Veerayya: మాస్ మహారాజ రవితేజ “వాల్తేరు వీరయ్య” లుక్ కొద్ది నిమిషాల క్రితం విడుదలయ్యింది. చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ కూడా కీలక పాత్ర చేయడం తెలిసిందే. చేతిలో గొడ్డలితో గ్యాస్ బండ లాక్కొస్తున్నా లుక్ లో స్టైలిష్ గా రవితేజ నడుస్తున్న “వాల్తేరు వీరయ్య” పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో చిరంజీవి మరియు రవితేజ “అన్నయ్య” సినిమాలో నటించడం తెలిసిందే. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో…రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది.
ప్రజెంట్ మాస్ ప్రేక్షకులలో రవితేజకి మంచి క్రేజ్ ఉంది. ఇక దర్శకుడు బాబి కూడా సినిమాని ఊర మాస్ లెవెల్ లో చిత్రీకరించినట్లు పోస్టర్లు విడుదలైన పాటలు… బట్టి తెలుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి లుక్ కూడా ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ మాస్ సినిమాలు ముఠామేస్త్రి, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ తరహా లుక్ లో కనిపిస్తున్నారు. మరి మాస్ మహారాజా రవితేజనీ కూడా ఆ తరహాలోనే చూపిస్తున్నారు. దీంతో సినిమాలో ఈ ఇద్దరు ఏ రేంజ్ లో చెలరేగిపోయారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో వరుస పరాజయాలలో ఉన్న రవితేజ “క్రాక్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.
ఆ తర్వాత వచ్చిన “రామారావు ఆన్ డ్యూటీ”, “డిస్కో రాజా” సినిమాలు చేసిన గాని రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే ఈసారి డిసెంబర్ 23వ తారీకు “ధమాకా” తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత రెండు వారాలకే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తారీకు “వాల్తేరు వీరయ్య” సినిమాతో చిరంజీవితో రవితేజ థియేటర్ లో సందడి చేయనున్నారు. రవితేజ లేటెస్ట్ లుక్ ఒక ఫైట్ సీన్ నీ తలపిస్తోంది. దీంతో “వాల్తేరు వీరయ్య” రవితేజ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!