బీపీతో బాధపడేవారికి శుభవార్త.. ఆ మందులు వాడితే..?

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగాఅధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు తరచూ డాక్టర్లను సంప్రదించి రక్తపోటు సరైన స్థాయిలో ఉందో లేదో తెలుసుకోని, సరైన సమయంలో మందులు వాడటం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఎటువంటి ప్రమాదం లేకుండా బయట పడుతుంటారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారు ఏమాత్రం అలసత్వం వహించడం వారి ప్రాణాలకి ప్రమాదకరంగా మారుతుంది. అయితే తాజాగా అధిక రక్తపోటుతో బాధపడేవారికి జపాన్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తెలియజేశారు. ఎవరైతే బీపీ మందులు ప్రతిరోజు వాడుతున్నారో వారిలో ఆయుష్షు పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడించారు.

రక్త పోటు సమస్యతో బాధపడే వారు మెటోలజోన్ అనే మందులు వాడుతారు.ఈ మందులు ప్రతిరోజు తీసుకోవడం వల్ల వారిలో ఆయుష్షు పెరుగుతుందని పరిశోధనలో తేలింది. మొదటగా ఈ పరిశోధనలు జంతువులపై ప్రయోగించగా పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇచ్చాయి. వయసు పెరిగే కొద్దీ మానవ శరీరంలో మైటోకాండ్రియా పనితీరు తగ్గుతుంది. మెటోలజోన్ ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా మైటోకాండ్రియా పనితీరు సాధారణ స్థితికి వస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మైటోకాండ్రియా పనితీరు సక్రమంగా జరిగితే మనిషి ఆయుష్షు పెరుగుతుంది.మెటోలజోన్ మైటోకాండ్రియా లో ఏర్పడిన సమస్యలను మరమ్మతు చేసి వాటి పని తీరును మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
హెచ్‌ఎస్‌పీఏ-6 జన్యువును రక్తపోటుకు వాడే మందులు ఉత్తేజపరుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మెటోలజోన్ ఏలిక పాముల పై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రపంచం మొత్తం మనిషి ఆయుష్షును పెంచడానికి అనేక పరిశోధనలు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు.కానీ రక్త పోటు సమస్య తో బాధపడే వారు ఉపయోగించే ఈ మందుల వల్ల మనుషులు ఆయుష్షు పెరుగుతుందని తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే ఈ పరిశోధనలపై మరింత లోతుగా అధ్యయనం చేసి మనిషి ఆయుష్యును పెంచే దిశగా పరిశోధనలు జరుపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.