హెల్త్

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

Share

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని దగ్గును నిర్లక్ష్యం చేస్తే చివరకు అది దీర్ఘకాలిక వ్యాధిగా మారి ఊపిరితిత్తుల సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పొడి దగ్గు వల్ల గొంతునొప్పితో పాటు, శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఈథర్ కొన్ని చిట్కాలను పాటిస్తే దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా.

తేనె :

దగ్గును తగ్గించడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది.తేనెలో ఏమీ కలపకుండా నేరుగా తీసుకుంటే గొంతులోపల ఓ పూతలా ఏర్పడి గరగరమనే మంటను తగ్గిస్తుంది. నేరుగా కాకపోయినా తేనెకి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా తక్షణ ఉపశమనం వస్తుంది.

అల్లం టీ :

అల్లం తో తయారుచేసిన టీ తాగినా కూడా దగ్గు తగ్గుతుంది. కొద్దిగా అల్లంను చిన్న ముక్కలుగా కోసి రెండు కప్పుల నీరు పోసి ఒక 20 నిమిషాల పాటు బాగా మరిగించి చల్లారక చెంచా తేనె కలపి తాగాలి. అలాగే మీకు నచ్చితే నిమ్మకాయ రసం కూడా పిండుకుని తాగవచ్చు. రెండు పూటలా దీన్ని తాగితే దగ్గు తగ్గిపోతుంది.అలాగే ప్రతి రోజు టీ తాగే అలవాటు ఉంటే టీ లో కొద్దిగా అల్లంను దంచి వేసిన మంచి ఫలితం ఉంటుంది.

నల్ల మిరియాలు :

మిరియాల గాటుధానం, రుచిదనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిరియాలు కూడా దగ్గుకు బాగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో చెంచా నల్ల మిరియాలను తీసుకుని వాటిలో ఒక చెంచా తేనె కలపండి. వీటిలో వేడినీళ్లు పోసి మూతపెట్టి ఒక పావుగంట తరువాత తాగితే ఫలితం ఉంటుంది.


Share

Related posts

బరువు తగ్గడానికి ఇది బ్రహ్మాస్త్రం ..కావాలంటే ప్రయత్నం చేసి చుడండి ఆశ్చర్య పోతారు !!

Kumar

Computer: కంప్యూటర్  ముందు గంటల తరబడి పని చేసేవారు కళ్లను ఇలా కాపాడుకోండి!!

siddhu

Children : మీ పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికివెళ్ళబోతున్నారా ?అయితే  ఇది వారికి తెలియచేయండి!! (part-1)

siddhu