కరివేపాకుకి మంచి రుచీ సువాసనా ఉన్నాయి. వాటితో పాటూ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
కరివేపాకు తో చేసిన జ్యూస్ బరువుని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతారు . అందరికీ అందుబాటులో ఉండే కర్వేపాకు జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
కరివేపాకు జ్యూస్ ని పొద్దున్నే తాగితే బరువు తగ్గడం తో పాటూ శరీరానికి కావాల్సిన న్యూట్రియెంట్స్ ని అందించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది . గ్రీన్ జ్యూస్ లో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ ని ఇవ్వడంతో పాటు , అరుగుదలని పెంచి, అధిక బరువుని తగ్గించడంలో సహకరిస్తుంది . ఈ గ్రీన్ జ్యూస్ బాడీ లో ఉన్న టాక్సిన్స్ ని బైటికి పంపేసి మెటబాలిజం ని పెంచుతుంది. మెటబాలిజం ఎంత ఎక్కువగా ఉంటే బరువు తగ్గటం ,అంత స్పీడ్ గా జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాల మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
సుమారుగా ఒక పది కరివేపాకు ఆకులని తీసుకుని ఒక గ్లాసు నీళ్లతో కలిపి మిక్స్ చేయండి,ఈ జ్యూస్ ని మరింత హెల్దీ గా చేయాలంటే అందులో కొంచెం పాలకూర, కొత్తిమీర, పుదీనా వెయ్యండి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఈ గ్రీన్ జ్యూస్ ని ఫ్రెష్ గా అప్పటికప్పుడు పొద్దున్నే తాగితే శరీరానికి కావాల్సిన క్లోరోఫిల్ తో పాటూ ఎన్నో విటమిన్స్ కూడా అందుతాయి. ఈ గ్రీన్ జ్యూస్ ని రోజూ తాగితే కొన్ని రోజుల తరువాత పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది.