NewsOrbit
5th ఎస్టేట్

రఘురామ కృష్ణం రాజు కథ ముగియగానే మరొక కొత్త ఎంపీ వివాదం షురూ…!

ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజు రోజుకీ సీరియస్ అవుతున్న నేపథ్యంలో వైసీపీలో మరొక ఎంపీ అదే బాటలో నడుస్తున్న ఆనవాళ్ళు కనబడుతున్నాయి. సీఎం జగన్ ఆశీస్సులతోనే పార్టీ లోకి వచ్చాను అని చెప్పుకునే ఈయన మధ్య కాలంగా పార్టీపై మరియు వారి విధి విధానాలపై విమర్శలు సంధిస్తున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు రేంజ్ లో లేకపోయినా మీడియా వారు పెద్దగా ఫోకస్ చేయలేదు కాబట్టి సరిపోయింది. కానీ పార్టీ అధినేత జగన్ మాత్రం వెంటనే అలెర్ట్ అయిపోయి.. ఆయన వైఖరిపై నివేదిక ఇవ్వాలని అడిగారట. ఇప్పుడు ఇదంతా మాట్లాడింది చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుండి గత ఏడాది వైసీపీ తరఫున పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాద్ రావు గురించి.

 

 

Tirupati Election Results 2019: YSRCP's Balli Durga Prasad Rao has ...

మొదట టిడిపి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుర్గాప్రసాద్ అతి పిన్న వయసులో ఎమ్మెల్యే అయి పార్టీలోనే బలమైన నాయకుడిగా ఎదిగాడు. గూడూరు రిజర్వుడు నియోజకవర్గం నుండి 1985, 1994, 1999, 2009 టిడిపి టికెట్ పై విజయం సాధించారు. 28 ఏళ్ళకే ఎమ్మెల్యే అయిన ఈయనకు చంద్రబాబు అనూహ్యంగా 2014 ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. అదీ 2009లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా. దీంతో వెంటనే ఆయన ఎటువంటి ఆలోచనలు లేకుండా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

క్రమంలో లో స్థానికంగా తనకు ఉన్న బలం మరియు జగన్ తుఫాను దెబ్బకు తిరుపతి ఎంపీగా అవలీలగా విజయం సాధించారు. ఇంత వరకు బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆయన స్థానిక నేతలు పట్టించుకోవడం మానేశారు అన్న విమర్శలు వచ్చాయి. ఇదే విషయమై కొన్ని సందర్భాల్లో దుర్గారావు వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు దుర్గా ప్రసాద్ రావు తనను ఎవరూ పట్టించుకోవడం లేదని మరియు ప్రోటోకాల్ ప్రకారం కూడా తనకి దక్కాల్సిన గౌరవం కూడా దక్కడం లేదని ఆరోపించడం గమనార్హం.

ఇక తిరుప‌తి నగరంలో నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణం కేంద్రం ఇచ్చే స్మార్ట్‌ సిటీ నిధులతోనే జరుగుతోందని, రాష్ట్రం రూపాయి కూడా ఇవ్వడం లేద‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద మైన‌స్‌గా మారాయి. అంతేకాదు.. క‌రోనా విష‌యంలో ప్రభుత్వం అవ‌లంబిస్తున్న చ‌ర్యలు త‌న‌కు న‌చ్చలేద‌ని కూడా బ‌ల్లి దుర్గాప్రసాద‌రావు విమ‌ర్శలు గుప్పించారు. ఇవ‌న్నీ జ‌రిగి నాలుగు రోజులు గ‌డిచాయి.

అయితే, విష‌యంలో పార్టీ నేత‌లు ఉన్నార‌న్న ఆయ‌న ఆరోప‌ణ‌లు స‌హా తాజాగా న‌ర‌సాపురం ఎంపీ వివాదం నేప‌థ్యంలో జ‌గ‌న్ బ‌ల్లి దుర్గా ప్రసాద్‌రావు వ్యవ‌హారంపై కూడా దృష్టి పెట్టార‌ని, అస‌లు అక్కడ ఏం జ‌రుగుతోందో త‌న‌కు చెప్పాల‌ని ఇంచార్జ్ మంత్రిని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. మరి ఈయన రాజుగారిలా పరిస్థితిని క్లిష్టతరం చేసుకుంటారా లేక అధిష్టానంతో రాజీపడి మెలుగుతారా అన్నది చూడాలి.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau