NewsOrbit
హెల్త్

సానిటైజర్ లు వాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త !

సానిటైజర్ లు వాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త !

కరోనావైరస్ నుంచి మనలని మనం రక్షించుకోవడానికి ముందుగా పాటించాల్సింది పరిశుభ్రత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చేతుల్ని, సబ్బు నీరు ఉపయోగించి తరచుగా కడుక్కోవడం, లేదా శానిటైజేర్ వాడి శుభ్రం చేసుకోవాలి.  శానిటైజేర్ చేతుల మీద వైరస్ ని హరిస్తుంది.

సానిటైజర్ లు వాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త !
అయితే, కొన్ని సంస్థలు తయారు చేస్తున్నశానిటైజేర్ ఆరోగ్యానికి చాలా హానికరమని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకటించింది. వాటిని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

వైరస్ బారి నుంచి కాపాడే శానిటైజర్లని ఇథనల్ (ఇథైల్) ఆల్కహాల్ తో తయారు చేయాలి. కానీ, దానికి బదులుగా తక్కువ రేటుకు వస్తుందని , మిథనాల్ (మిథైల్) ఆల్కహాల్ తో తయారుచేస్తున్నారు. ఇలాంటి వాటితో చేతులు బొబ్బలు ఎక్కటమే కాదు,మరిన్ని ముప్పులు  సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఎలాంటి శానిటైజర్ వాడాలన్నది ఇప్పుడూ  ప్రశ్న.ఈ శానిటైజర్ల ప్రభావానికి గురైతే జలుబు , వికారం, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, వణుకు ఏర్పడతాయని, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సూచించారు. మిథనాల్ కలిసిన శానిటైజర్లను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తం కావాలని, సురక్షితమైన శానిటైజర్లను మాత్రమే వాడాలని తెలిపారు. మన దేశంలో కూడా నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీలైనంతవరకు మంచి సంస్థకు చెందిన హ్యాండ్ శానిటైజర్లను వాడటమే ఉత్తమం.

మంచి శానిటైజర్ కు కొలమానం ఏమిటి? అన్నది ప్రశ్న.మంచి శానిటైజర్ లక్షణాల్ని చూస్తే..జిగురు.. నురుగు మాదిరి కంటే ద్రావణం మాదిరి ఉండే శానిటైజర్లతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది .
చేతుల్లో శానిటైజర్ వేసుకుంటే నిమిషంలో ఆవిరి కావాలి. అందుకు భిన్నంగా చేతులకు అంటుకుని ఉంటే మాత్రం చర్మ సంబంధమైన సమస్యలకు అవకాశం ఉంది.

శానిటైజర్లలో 60 నుంచి 90 శాతం వరకూ ఆల్కహాల్ ఉండాలన్నది మర్చిపోకూడదు.
కనీసం 20 – 30 సెకన్లు చేతలకు రుద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇథైల్ ఆల్కహాల్,ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్, ఎన్ ప్రొఫైల్ ఆల్కహాల్ తో ఉన్నవి వాడితే మంచిది.
ఈ శానిటైజర్లను మాత్రం  వాడొద్దు:
✺ ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్‌ – All-Clean Hand Sanitizer (NDC: 74589-002-01)
✺ ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్ – Esk Biochem Hand Sanitizer (NDC: 74589-007-01)
✺ క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజర్ – CleanCare NoGerm Advanced Hand Sanitizer 75% Alcohol (NDC: 74589-008-04)
✺ లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్ – Lavar 70 Gel Hand Sanitizer (NDC: 74589-006-01)
✺ ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ హ్యాండ్ శానిటైజర్ – The Good Gel Antibacterial Gel Hand Sanitizer (NDC: 74589-010-10)
✺ క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌ – CleanCare NoGerm Advanced Hand Sanitizer 80% Alcohol (NDC: 74589-005-03)
✺ క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 75% ఆల్కహాల్‌- CleanCare NoGerm Advanced Hand Sanitizer 75% Alcohol (NDC: 74589-009-01)
✺ క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌ – CleanCare NoGerm Advanced Hand Sanitizer 80% Alcohol (NDC: 74589-003-01)
✺ శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ – Saniderm Advanced Hand Sanitizer (NDC: 74589-001-01)

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri