Health Tips: చాలామందికి ముఖం తెల్లగా ఉన్నప్పటికీ మెడ చుట్టూ మాత్రం నల్లటి మచ్చలు ఉంటాయి.అలా మెడ నల్లగా ఉండడం వలన చాలామంది నలుగురిలో తిరగాలంటే మొహమాటం పడుతూ ఉంటారు. మనం ముఖానికి ఎంత కేర్ తీసుకుంటామో మెడను కూడా అంతే కేర్ తీసుకోవాలి.ఎట్టి పరిస్థితులలోను మెడ చుట్టూ ఉండే మురికిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మెడచుట్టూ ఉన్న నల్లని చర్మం తెల్లగా మారడానికి కొన్ని రకాల న్యాచురల్ టిప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
నిమ్మ,తేనె మిశ్రమం :
ఈ టిప్స్ పాటించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా ..ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా తేనెను తీసుకుని బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని తరచూ మెడపై అప్లై చేస్తే కొద్ది రోజులకు మెడ చుట్టూ ఉన్న నల్లటి మచ్చలు తగ్గిపోతాయి.
సెనగపిండి, నిమ్మరసం మిశ్రమం :
అలాగే మరొక చిట్కా ఏంటంటే మెడలోని నలుపును పోగొట్టాలంటే ఒక రెండు టీస్పూన్ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పసుపు, ఒక అర టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచాలి.15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మెడను కడగాలి. ఈ పేస్ట్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.పైన చెప్పిన టిప్స్ ను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోను మార్పును మీరు గమనించవచ్చు