పనుల్లో, వ్యాపారాలలో ఒత్తిడి కారణంగా రిలాక్సేషన్ కోసం చాలా మంది కాఫీ తాగడం అలవాటు చేసుకుంటారు. ఒత్తిడిని తగ్గించుకొని చిన్న రిలాక్సేషన్ కోసం రోజులో కొందరు చాల సార్లు కాఫీని తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీని వల్ల ఒత్తిడి కొంతవరకు తగ్గుముఖం పడతది. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఒత్తిడి తొలగిపోవడం ఏమోగాని పలు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. ఆ సమస్యలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కాఫీ తాగడం ద్వారా శరీరంలోకి కెఫీన్ అనే ఉత్తేజక మందు ప్రవేశిస్తుంది. ఇది శరీరంలోని కణాలను ఉత్తేజపరుస్తుంది. ఇది మోతాదులో తాగితే శరీరానికి ఉపయోగం కానీ కొందరు రోజులో చాలా సార్లు తాగుతుంటారు. దీనివల్ల రక్తపోటు పెరగడమే కాదు గుండెకు సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం శరీరంలో షుగర్ లెవెల్స్ భారీగా పెరుగుతాయి. అంతేకాదు రక్తనాళాలు మూసుకుపోయి రక్తపోటు పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు కాఫీ తాగకపోవడం మంచిది. ఎందుకంటే కాఫీ తాగడం మూలంగా వారు తీసుకున్న ఆహరం జీర్ణం కాదు, అధికంగా తీసుకోవడం ద్వారా విరేచనాల సమస్యలు తలెత్తవచ్చు.
అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. అది ఒక్కసారి అకస్మాత్తుగా మానేస్తే తలనొప్పి, చిరాకుగా అనిపించడం లేదా ఏకాగ్రత కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సందర్భాలలోనే కొందరికి పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు వంకరలు తిరుగుతుంటాయి. శరీరంలో కెఫీన్ మోతాదు పెరగడం వల్ల నీరసం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కిడ్నీ సమస్యలు ప్రారంభమై అతి మూత్ర వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రాత్రిళ్ళు పని చేసే వారు కాఫీ తాగితే నిద్ర రాకుండా చేస్తుంది కానీ అది అధికంగా తాగడం ద్వారా నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి.