Drinking Coffee: కొంత మందికి ఉదయం లేవగానే కాఫీ తాగడం అలవాటు ఉంటుంది. కాఫీ తాగకుండా బయటకు రారు, వారి దిన చర్య మొదలు కాదు. ఓ కప్పు కాఫీ వారికి ఉత్తేజాన్ని ఇస్తుందని భావిస్తుంటారు. కానీ కాఫీ వల్ల ఎన్నో అనర్ధాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. కాఫీ ఒక కప్పు తాగితే పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. కానీ అంతకంటే ఎక్కువగా త్రాగడం వల్ల కాఫీలో ఉండే కెఫీన్ మన శరీరానికి హాని కల్గిస్తుందట.
మెటబాలిజం నెమ్మదిగా ఉన్న వారు కాఫీని మానివేయడం మంచిది. జీవ క్రియల రేటు తక్కువగా ఉంటే కాఫీని అరిగించుకోవడం మీ శరీరానికి కష్టంగా ఉంటుంది.
కాఫీ తాగిన కొంత మందికి రాత్రి సమయాల్లో సరిగా నిద్రపట్టదు. ఇలాంటి వారు సాయంత్రం మూడు గంటల తర్వాత కాఫీని పూర్తిగా మానేయాలి. వీరు రోజుకు కేవలం ఒక సారి మాత్రమే కాఫీ తాగడం మంచిది.
గ్యాస్ సమస్య ఉన్న వాళ్లు కాఫీ తాగడం మంచిది కాదు. తప్పదు అనుకుంటే భోజనం తరువాత కాఫీ తాగడం మంచిది.
టెన్షన్, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్న వారు కాఫీ తో పాటు ఇతర అన్ని రకాల కెఫినేటెడ్ డ్రింక్స్ కి దూరంగా ఉండటం మంచిది.
ఎలాంటి వారైనా పరగడుపున మాత్రం కాఫీ తాగకూడదు. ముందుగా వేరే ఏదైనా తిన్న తర్వాత కాఫీ తాగడం మంచిది.
సాధరణంగా రోజుకు 400 ఎంజీ కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోకూడదని వైద్యనిపుణులు చెబుతుంటారు. మీరు రోజు కేవలం కాఫీ మాత్రమే రెండు నుండి మూడు కప్పులు తీసుకుంటే ఇంత మోతాదు కెఫీన్ అందుతుంది. కావున రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకపోవడం మంచిది. కాఫీ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నా దాని పరిమితికి మించకూడదు.