Fatty Liver: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు పోవాలి.. ఇదంతా సక్రమంగా జరగాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి.. మన శరీరంలోని అతి పెద్ద అవయవం కాలేయం.. సుమారు ఐదు వందల రకాలకు పైగా విధులను నిర్వర్తిస్తుంది.. ఆహారంలోని కొవ్వులను వేరుగా చేసి శక్తిగా మారుస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి శరీరానికి అవసరమైన ఐరన్ అందేలా చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషత్యుల్యాలను వేరుచేస్తూ మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. సాదరంగా కాలేయం దెబ్బతినదు.. కాలేయం పనితీరు సక్రమంగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. మనం ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి.. ఎటువంటి ఆహారం తీసుకుంటే కాలేయం దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసుకుందాం.!

కాలేయం దెబ్బతినడానికి ఇవి కారణాలు..
శరీరంలో ఆల్కహాల్ ఎక్కువైనప్పుడు కాలేయం చుట్టూ అసాధారణ స్థాయిలో కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన టిష్యూను స్కార్ టిష్యూ రీప్లేస్ చేస్తుంది. ఈ కారణంగా ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువై కాలేయం పనితీరు దెబ్బతింటుంది. దాంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దారితీస్తుంది. ఆల్కహాల్‌తో పాటు ఇతర పరిస్థితులు కూడా కాలేయం దెబ్బతీస్తాయి.
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కూడా మరో రకమైన కాలేయ వ్యాధి. జబ్బు. దీనికి ఆల్కహాల్ తో సంబంధం లేదు. అధిక బరువు, ఒబెసిటీ ఇందుకు కారణమవుతాయి. చక్కెర గల పదార్థాలు ఎక్కువగా తినడం, ప్రాసెస్డ్ ఆహారం ద్వారా కార్బొహైడ్రేట్లు అధిక స్థాయిలో తీసుకోవడం, నేటి ఆధునిక పద్ధతులు, మెటబాలిక్ సిండ్రోమ్ కలిగి ఉండడం ఈ పరిస్థితికి కారణాలు.

కాలేయానికి ఇవి చేటు..
తినడానికి జంక్ ఫుడ్ రుచికరంగా ఉంటాయి. కానీ కాలేయం తో సహా శరీరంలోని అన్ని అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. పిజ్జా , బర్గర్, నూడిల్స్ ఇలాంటి జంక్ ఫుడ్స్ సాధ్యమైనంత దూరంగా ఉండాలి.. ఇవి తింటే మాత్రం ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడటం ఖాయం. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకింగ్ ఫుడ్స్ తోపాటు స్వీట్స్ కూడా దూరంగా ఉండాలి. మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ, కాలేయం ఇతర భాగాల్లో కొవ్వు పేరుకు పోతుంది. ఫలితంగా కాలేయం ఆరోగ్యం క్షీణిస్తుంది. వారానికి ఒక్కసారి లేదంటే రెండుసార్లకు మించి రెడ్ మీట్ తినొద్దు.. మాంసాహారం అతిగా తింటే ముప్పని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

కాలేయానికి మేలు చేసే ఆహారం..
2018 నాటి లిప్పిన్‌కాట్ జర్నల్స్‌లో ప్రచురించిన అధ్యయనంలో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కోలిన్ ఒక ముఖ్యమైన పోషకం అని తెలుస్తోంది. ఇది ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గుడ్లు
సోయాబీన్
కాల్చిన చికెన్
ఎర్ర బంగాళాదుంప
కిడ్నీ బీన్స్
తక్కువ కొవ్వు పాలు
బ్రోకలీ
పనీర్ లో కోలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తరచూ తీసుకుంటే మీ కాలేయానికి ఢోకా ఉండదు.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే బరువు, డయాబెటిస్ నియంత్రణలో ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఎక్కువగా నీటిని తాగాలి.